రాంచీ: ఇంగ్లండ్‌తో గత రెండు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించడంలో పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారని జట్టు బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. పిచ్‌లు అనుకూలంగా లేకపోయినా కీలక సమయాల్లో వారు చెలరేగడం వల్లే మ్యాచ్‌లు మనవైపు మొగ్గు చూపాయని అతను అన్నాడు. ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు తీసిన 36 వికెట్లతో పోలిస్తే పేసర్లు 22 వికెట్లు తీశారు.
‘సాధారణంగా భారత్‌లో దాదాపు అన్ని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తూనే ఉంటాయి. అశ్విన్, జడేజాలు ఎలాగూ ఇక్కడ వికెట్లు తీయగలరు. కానీ మన ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనే సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా మారింది. పరిస్థితులకు తగినట్లుగా స్పందించి పేసర్లు జట్టును ముందంజలో నిలిపారు. నాలుగో టెస్టుకు బుమ్రాలాంటి స్టార్ బౌలర్ దూరం కావడం నిరాశ కలిగించేదే. అయినా ఇతర పేసర్లకూ మంచి అనుభవం ఉంది.
సిరాజ్ తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శనను మరచిపోవద్దు’ అని గిల్ ప్రశంసించాడు. పలువురు కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్ల వచ్చిన అవకాశాలను కొత్త ఆటగాళ్లు సమర్థంగా వాడుకున్నారన్న గిల్... సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లను ఉదాహరణగా చూపించాడు.
తనపై తాను పెట్టుకున్న అంచనాల కారణంగానే కొన్నిసార్లు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వాటిని అధిగమించి భారీ స్కోర్లపై దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. తొలి టెస్టులో శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయినా భారత జట్టు...ఆ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి రెండు టెస్టుల్లో
ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచినట్లు గిల్ గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment