త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ప్రమాదకర బౌలర్ల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్ దశలో పాల్గొనే జట్లతో పాటు మొత్తం 16 జట్ల నుంచి ఇద్దరు చొప్పున బౌలర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. బౌలర్ల పూర్వ ప్రదర్శన, ఫామ్, ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. గణాంకాలు, ర్యాంకింగ్స్‌ను అక్టోబర్ 10 వరకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు వివరించింది.
ఆయా జట్లలోని ఇద్దరు స్ట్రయిక్ బౌలర్ల వివరాలు..
1. ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్
2. భారత్: భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్
3. సౌతాఫ్రికా: లుంగి ఎంగిడి, తబ్రేజ్ షంషి
4. ఆస్ట్రేలియా: జోష్ హేజిల్‌వుడ్,ఆడమ్ జంపా
5. న్యూజిల్యాండ్: ట్రెంట్ బౌల్ట్, లచ్లాన్ ఫెర్గూసన్
6. శ్రీలంక: వనిందు హసరంగ, మహీష్ తీక్షణ
7. ఇంగ్లండ్: మార్క్ వుడ్, రీస్ టాప్లే
8. పాకిస్తాన్: మహ్మద్ వసిమ్, హరీస్ రౌఫ్
9. బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్,ముస్తాఫిజుర్ రెహ్మాన్
10. వెస్టిండీస్: ఓబెద్ మెక్‌కాయ్, జేసన్ హోల్డర్
11. ఐర్లాండ్: జోష్ లిటిల్, మార్క్ అదైర్
12. జింబాబ్వే: ల్యూక్ జాంగ్వే, టెండాయ్ చతారా
13. నమీబియా: జాన్ ఫ్రైలింక్, జేజే స్మిట్
14. స్కాట్లాండ్: మార్క్ వ్యాట్, సాఫ్యాన్ షరీఫ్
15. నెదర్లాండ్స్: ఫ్రెడ్ క్లాసెన్, బ్రాండన్ గ్లోవర్
16. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: జహూర్ ఖాన్, జునైద్ సిద్దిఖీ
Comments
Please login to add a commentAdd a comment