ICC Shares Popular Web Series Game Of Thrones Photo Say Super-12 Coming - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ఫోటో షేర్‌ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా!

Published Sat, Oct 22 2022 8:27 AM | Last Updated on Tue, Oct 25 2022 5:31 PM

ICC Shares Popular Web Series Game Of Thrones Photo Say Super-12 Comming - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌ పోరు ముగిసింది. శనివారం(అక్టోబర్‌ 22న) నుంచి సూపర్‌-12 సమరం మొదలుకానుంది. క్వాలిఫయింగ్‌లో రౌండ్‌లో దుమ్మురేపిన నాలుగు జట్లు టాప్‌-8 టీమ్స్‌తో పోటీ పడనున్నాయి.ఇంత వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా సాగనుంది. సూపర్‌-12 సమరం పురస్కరించుకొని ఐసీసీ తన ట్విటర్‌లో ఒక ఫోటోను షేర్‌ చేసింది.

పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ ''గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌(Game Of Thrones)'' ఫాలో అయిన వారికి మాత్రమే ఐసీసీ పెట్టిన ఫోటో అర్థమవుతుంది. ఆ ఫోటోలో గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌లో హీరోగా పిలుచుకునే జాన్‌ స్నో(John Snow) ఫోటోను మార్ఫింగ్‌ చేసిన ఐసీసీ వేరొకరి ఫోటోను పెట్టింది. ఆపై ''టి20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12 ఈజ్‌ కమింగ్‌..'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌ ప్రధానంగా కథ మొత్తం కింగ్స్‌ ల్యాండిగ్‌ ఉన్న ఐరన్‌ త్రోన్‌ కోసం జరిగే యుద్దాలతో పాటు.. వైట్‌ వాకర్స్‌(Night King)తో పోరు ప్రధానంగా సాగుతుంది. ఈ సిరీస్‌ మొత్తంలో ''వింటర్‌ ఈజ్‌ కమింగ్‌(Winter Is Comming)'' అనే డైలాగ్‌ చాలా ఫేమస్‌. ఈ సిరీస్‌లో మంచికి పేరుగా ఉండే హౌస్ ఆఫ్‌ స్టార్క్స్‌(House Of Starks) విజయం సాధిస్తుంది.

ఇది దృష్టిలో ఉంచుకొనే ఆ సిరీస్‌లో ఐరన్‌ త్రోన్‌ కోసం ఎలా అయితే పోటీ పడతారో.. అచ్చం సూపర్‌-12 ఉన్న 12 జట్లు టి20 ప్రపంచకప్‌ కోసం పోటీ పడుతున్నట్లు సింబాలిక్‌గా ఐసీసీ ఈ ఫోటోను షేర్‌ చేసినట్లు తెలిసింది. అయితే ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కాగా ఐసీసీ ఫోటోపై అభిమానులు కామెంట్స్‌ చేశారు. కింగ్‌ కోహ్లి ఎక్కడ.. రోహిత్‌ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఐసీసీ షేర్‌ చేసిన ఫోటో ట్రెండింగ్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement