క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ పెద్ద మైనస్. సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. బ్యాటింగ్.. బౌలింగ్ ఇలా ఏ సమయంలోనైనా నిర్ణీత సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయకపోతే స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ సహా ఆటగాళ్లకు జరిమానా విధిస్తూ వస్తున్నారు. అయితే ఈ రూల్‌లో ఐసీసీ కాస్త మార్పులు చేసింది.
ఇకపై స్లో ఓవర్ రేట్ నమోదైతే.. మ్యాచ్ ఫీజులో కోత విధించకుండా.. ఫీల్డింగ్ జట్టులో కొత్త నిబంధన తీసుకొచ్చింది. సాధారణంగా పవర్ ప్లే అనంతరం 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం ఉంటుంది. స్లో ఓవర్ రేట్ నమోదైతే స్లాగ్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండేలా రూల్ తీసుకొచ్చింది. తాజగా ఈ నిబంధన మ్యాచ్ విజయాలపై ప్రభావం చూపుతుంది.
అయితే స్లో ఓవర్ రేట్‌కు మరో ప్రధాన కారణం.. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లు. బౌండరీ వెళ్లిన ప్రతీసారి బంతి తీసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. దీనివల్ల కూడా మ్యాచ్ నిర్ణీత సమయంలోగా పూర్తవ్వడం లేదు. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ ఒక వినూత్న ఆలోచన చేసింది. ఇకపై బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన తర్వాత ఆ బంతి తీసుకురావడానికి గ్రౌండ్‌లోని సపోర్ట్ స్టాఫ్ సహా డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లను ఉపయోగించాలని భావిస్తుంది.
బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన ప్రతీసారి ఫీల్డర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ స్ట్రాటజీని ఉపయోగించగా.. అది చక్కగా పనిచేసింది. ఈ పని ద్వారా స్లో ఓవర్ రేట్‌ను దాదాపు నియంత్రించొచ్చు అనేది ఆసీస్ క్రికెట్ వాదన. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ ఐసీసీ అనుమతితో టి20 వరల్డ్‌కప్‌లో ఇలాంటి రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో దీనిని అమలు చేస్తున్నారు.
A clever ploy from the Aussies who are keen to avoid the fielding restriction penalty if overs aren't bowled in time during this #T20WorldCup pic.twitter.com/5e73KABQcd
— cricket.com.au (@cricketcomau) October 19, 2022
Comments
Please login to add a commentAdd a comment