icc rules
-
షాకింగ్.. ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్! రూల్స్ ఏం చెబుతున్నాయి?
శ్రీలంక పర్యటనను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ బౌలింగ్ చేసిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మెండిస్ ఒకే ఓవర్లో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.స్పిన్నర్లకు భారత్ కాస్త తడబడుతుండంతో లంక కెప్టెన్ అసలంక పార్ట్ టైమ్ స్పిన్నర్ మెండిస్ మెండిస్‌ను ఎటాక్‌లో తీసుకువచ్చాడు. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన మెండిస్ తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్నాడు. కానీ వాస్తవానికి రైట్ ఆర్మ్ బౌలర్ అయిన కమిందు మెండిస్.. సూర్యకు మాత్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఆ బంతికి ఫోర్ కొట్టిన సూర్య తర్వాత బంతికి సింగిల్ తీసి రిషబ్ పంత్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అప్పుడు అనూహ్యంగా మెండిస్ మళ్లీ తన రైట్ఆర్మ్ శైలిలోనే బౌలింగ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్లో చేతులు మార్చి బౌలింగ్ చేయడంపై ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ లుక్కేద్దాంఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?రూల్స్ ప్రకారం.. బౌలర్‌కు ఏ చేతితోనైనా బంతిని వేసే అవకాశం ఉంటుంది. అయితే బంతి వేసే ముందు సదరు బౌలర్ తన శైలిని కచ్చితంగా అంపైర్‌కు తెలియజేయాలి. అప్పుడే వారు బౌలింగ్ చేసే చేతిని మార్చుకోవడానికి అంపైర్ అనుమతి ఇస్తాడు.ఆ విషయాన్ని బ్యాటర్‌కు సైతం అంపైర్ తెలియజేస్తాడు. ఒక వేళ బౌలర్ చేతిని మార్చుకున్న విషయాన్ని అంపైర్‌గా తెలియజేయకపోతే అది నో బాల్‌గా పరిగణించబడుతోంది. ఇప్పుడు భారత్-శ్రీలంక తొలి మ్యాచ్‌లో మాత్రం మెండిస్ తన నిర్ణయాన్ని అంపైర్‌కు తెలిపాడు. అందుకే, దానిని సరైన బంతిగానే అంపైర్ ప్రకటించాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన ఐదో బౌలర్‌గా మెండిస్ నిలిచాడు.ఈ జాబితాలో భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అక్షయ్ కర్నేవార్, పాకిస్తాన్ లెజెండ్ హనీఫ్ మహ్మద్, ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం గ్రాహం గూచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ హషన్ తిలకరత్న ఉన్నారు.చదవండి: IND vs SL: అతడెందుకు దండగ అన్నారు.. కట్‌చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్ -
క్రికెట్లో ఔట్లు ఎన్ని విధంబులు అనిన...???
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా ప్రకటించబడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అసలు క్రికెట్లో ఓ బ్యాటర్ ఎన్ని రకాలుగా ఔట్‌గా ప్రకటించబడతారని అభిమానులు గూగుల్ చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానం పది. ఇందులో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. వీటిలో బ్యాటర్లు దాదాపు అన్ని విధాల్లో ఒకటి అంత కంటే ఎక్కువసార్లు ఔట్ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో (శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్) ఓ బ్యాటర్ (ఏంజెలో మాథ్యూస్) తొలిసారి టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదిఏమైనా రూల్ కాబట్టి, అంతిమంగా ఫలితం అతనికి అనుకూలంగానే వచ్చింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి ఎలిమినేట్ (సెమీస్‌కు అర్హత సాధించలేదు) అయ్యింది. తాజా ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో పాటు ఎలిమినేషన్‌కు గురైంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
RCB VS LSG: అమిత్ మిశ్రా తొండాట.. కోహ్లి బలయ్యాడు..!
ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ కీలక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలవుతోంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. నిన్నటి మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా బంతిపై ఉమ్మిని రాస్తూ కనిపించాడు. Is saliva allowed in ipl?? #iplinhindi #IPL2023 #ipl #rcb #JioCinema pic.twitter.com/Uh7hiR7D2G — ROHIT RAJ (@RohitRajSinhaa) April 10, 2023 ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్య నిషేధించబడింది. కోవిడ్ అనంతరం ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఉమ్మికి బదులు బంతిపై చమటను అప్లై చేసేందుకు ఐసీసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ కారణంగానే అమిత్ మిశ్రా చర్యపై క్రికెట్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మిశ్రా చర్యను మెజార్టీ శాతం తప్పుపడుతున్నారు. తెలిసి చేసినా, పొరపాటున చేసినా మిశ్రాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మిశ్రా బంతిపై ఉమ్మిని రుద్దిన ఓవర్లోనే (మూడో బంతికి) విరాట్ కోహ్లి ఔట్ కావడంతో.. రన్ మెషీన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. మిశ్రా తొండాట ఆడాడని.. అలా చేయకపోయి ఉంటే కోహ్లి ఔటయ్యే వాడే కాదని వితండవాదానికి దిగుతున్నారు. ఉమ్మి అప్లై చేయడం వల్ల బంతి షైన్ అయ్యి కోహ్లి ఔట్ కావడానికి కారణమైందని కామెంట్స్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఇలాంటి చర్యకు పాల్పడినందుకు మిశ్రా జట్టు లక్నోకు 5 పరుగుల పెనాల్టి విధించి ఆర్సీబీని విజేతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ నిషేధించింది కాబట్టి మిశ్రా అలా చేయడం తప్పని మరికొందరు అంటున్నారు. కాగా, 2021 ఐపీఎల్‌లోనూ మిశ్రా ఇలాంటి చర్యకే పాల్పడి అంపైర్ వార్నంగ్కు గురయ్యాడు. ఈ చర్య మరోసారి రిపీట్ చేస్తే పెనాల్టి విధిస్తానని అప్పుడు అంపైర్ మిశ్రాను గట్టిగా మందలించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో లక్నో విజయం సాధించింది. -
అయ్యో బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, ఖలీల్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా వికెట్ కీపర్ నూరల్ హసన్ చేసిన చిన్న తప్పిదం వల్ల భారత్‌కు ఐదు పరుగులు లభించాయి. ఏం జరిగిందంటే? భారత్ ఇన్నింగ్స్ 112 ఓవర్ వేసిన తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో.. అశ్విన్ థర్డ్‌మ్యాన్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న యాసిర్ అలీ బంతి కోసం పరిగెత్తుతూ వెళ్లి అక్కడ నుంచి త్రో వికెట్ కీపర్ వైపు చేశాడు. అయితే అతడు త్రో చేసిన బంతి నేరుగా వికెట్ కీపర్ హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం టీమిండియాకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. 5 penalty runs !! Yasir Ali hits the ⛑️ pic.twitter.com/pMQ373lMWZ — Cricket Videos (@kirket_video) December 15, 2022 చదవండి: IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. 404 పరుగులకు భారత్ ఆలౌట్ -
స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన
క్రికెట్లో స్లో ఓవర్ రేట్ పెద్ద మైనస్. సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. బ్యాటింగ్.. బౌలింగ్ ఇలా ఏ సమయంలోనైనా నిర్ణీత సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయకపోతే స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ సహా ఆటగాళ్లకు జరిమానా విధిస్తూ వస్తున్నారు. అయితే ఈ రూల్‌లో ఐసీసీ కాస్త మార్పులు చేసింది. ఇకపై స్లో ఓవర్ రేట్ నమోదైతే.. మ్యాచ్ ఫీజులో కోత విధించకుండా.. ఫీల్డింగ్ జట్టులో కొత్త నిబంధన తీసుకొచ్చింది. సాధారణంగా పవర్ ప్లే అనంతరం 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం ఉంటుంది. స్లో ఓవర్ రేట్ నమోదైతే స్లాగ్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండేలా రూల్ తీసుకొచ్చింది. తాజగా ఈ నిబంధన మ్యాచ్ విజయాలపై ప్రభావం చూపుతుంది. అయితే స్లో ఓవర్ రేట్‌కు మరో ప్రధాన కారణం.. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లు. బౌండరీ వెళ్లిన ప్రతీసారి బంతి తీసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. దీనివల్ల కూడా మ్యాచ్ నిర్ణీత సమయంలోగా పూర్తవ్వడం లేదు. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ ఒక వినూత్న ఆలోచన చేసింది. ఇకపై బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన తర్వాత ఆ బంతి తీసుకురావడానికి గ్రౌండ్‌లోని సపోర్ట్ స్టాఫ్ సహా డగౌట్లో ఉన్న ఆటగాళ్లను ఉపయోగించాలని భావిస్తుంది. బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన ప్రతీసారి ఫీల్డర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ స్ట్రాటజీని ఉపయోగించగా.. అది చక్కగా పనిచేసింది. ఈ పని ద్వారా స్లో ఓవర్ రేట్‌ను దాదాపు నియంత్రించొచ్చు అనేది ఆసీస్ క్రికెట్ వాదన. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ ఐసీసీ అనుమతితో టి20 వరల్డ్‌కప్‌లో ఇలాంటి రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో దీనిని అమలు చేస్తున్నారు. A clever ploy from the Aussies who are keen to avoid the fielding restriction penalty if overs aren't bowled in time during this #T20WorldCup pic.twitter.com/5e73KABQcd — cricket.com.au (@cricketcomau) October 19, 2022 చదవండి: 'టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్.. కొత్త రూల్స్ మరిచితిరి!
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో చివర్లో విజయం అందుకున్న టీమిండియా ఎలాగోలా తొలిసారి సిరీస్‌ను దక్కించుకుంది. టీమిండియా భారీ స్కోరు చేసింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మిల్లర్ విధ్వంసానికి మ్యాచ్ ఓడిపోయేదే. మ్యాచ్ ఓడినా మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో అభిమానుల మనుసు గెలుచుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. అక్టోబర్ 1 నుంచి ఐసీసీ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మ్యాచ్ టీమిండియా, సౌతాఫ్రికాదే కావడం గమనార్హం. అయితే కొత్త నిబంధనలను అంపైర్లు మరిచిపోయారు. తాజా రూల్స్ ప్రకారం స్ట్రయికర్ షాట్ కొట్టి అవుటైతే పరుగు తీసే ప్రయత్నం చేస్తూ నాన్‌స్ట్రయికర్ అతడిని దాటినా సరే, కొత్తగా వచ్చే బ్యాటర్ మాత్రమే స్ట్రయికింగ్ తీసుకోవాలి. కానీ రెండో ఓవర్ నాలుగో బంతికి రోసో అవుటయ్యాక, ఐదో బంతికి డి కాక్ స్ట్రయిక్ తీసుకున్నాడు. వాస్తవానికి మార్క్రమ్ స్ట్రైయిక్ తీసుకోవాల్సింది.. అంపైర్లు దీనిని గుర్తించలేకపోయారు. తొలి మ్యాచ్ కదా.. అందుకే మరిచిపోయింటారు.. ఫాలో కావడానికి అంపైర్లకు టైం పడుతుందేమో అంటూ అభిమానులు కామెంట్ చేశారు. -
నిబంధనను పాతరేసిన పాక్ కెప్టెన్.. యాక్షన్ తీసుకోవాల్సిందే!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐసీసీ నిబంధన అతిక్రమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆటలో బాబర్ ఆజం బంతికి లాలాజలం రుద్దాడు. క్రికెట్లో బంతి షైన్ కోసం ఆటగాళ్లు సలైవా ఉపయోగించకూడదని కోవిడ్-19 సీరియస్‌గా ఉన్న సమయంలో ఐసీసీ పేర్కొంది. బాబర్ ఆజం మాత్రం నిబంధనను గాలికి వదిలేసి బంతికి లాలాజలం రుద్దుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ బాబర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ కెప్టెన్ చేసింది ముమ్మాటికి తప్పేనని.. బంతికి లాలాజలం రుద్దకూడదని తెలిసినా.. అది పట్టించుకోకుండా తన పని చేసుకుపోయాడు. దీనిపై ఐసీసీ అపెక్స్ కౌన్సిల్ సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందనని అభిమానులు పేర్కొన్నారు. ఇటీవలే బంతికి సలైవాను రుద్దడాన్ని బ్యాన్ చేస్తూ ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ అసొసియేషన్) నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకొని అంతకముందే ఐసీసీ బంతికి లాలాజలం రుద్దడాన్ని తాత్కాలికంగా నిషేధించింది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కూడా ఐసీసీ అప్పట్లో విడుదల చేసింది. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం బంతికి ఉమ్మి రుద్దడం తప్పుగా పరిగణించింది. ఆ తర్వాత మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్ సలైవా విషయంలోకొత్త సవరణ తీసుకొచ్చింది. బంతి షైన్ కోసం బౌలర్ లేదా ఆటగాళ్లు లాలాజలం రుద్దడం నిషేధమని... అలా చేస్తే బంతి షేప్ మార్చినట్లే అవుతుందని పేర్కొంది. అందుకే సలైవాను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే అక్టోబర్ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుందని ఎంసీసీ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడోరోజు బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. బాబర్ ఆజం 45, పవాద్ ఆలమ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్ ఆడుతున్నావా? IPL 2022: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ -
బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ బయటపడ్డాడు.. లేకపోతే..?
కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు బీసీసీఐపై పలు ఆరోపణలు చేశాడు. అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన అశ్విన్‌ను బీసీసీఐ కాపాడిందని, లేకపోతే అతనిపై నిషేధం పడేదని వెల్లడించాడు. ఐసీసీకి యాష్పై అనుమానం కలిగినప్పుడు బీసీసీఐ అతన్ని కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచిందని, ఆ సమయంలో యాష్ తన బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడని ఆరోపణలు గుప్పించాడు. కాగా, స్పిన్ బౌలర్ భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనంటూ ఐసీసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ మాట్లాడుతూ.. బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ నిషేధం బారిన పడకుండా బయటపడ్డాడని, అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో ఇలాంటి పరిస్థితి ఉండదని, వారికి తమ ఆటగాళ్ల భవిష్యత్తు కంటే డబ్బే ముఖ్యమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అజ్మల్ ఐసీసీపై కూడా పలు ఆరోపణలు గుప్పించాడు. ఐసీసీ.. ఒక్క బీసీసీఐ సలహాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని నిబంధనలను మారుస్తుందని, ఎంతటి కఠిన నిబంధనలైనా భారత్‌కు వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నాడు. కాగా, అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన కారణంగా అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కుడి చేతి ఆఫ్ స్పిన్నర్ అయిన అజ్మల్ పాక్ తరఫున 2008-15 మధ్యలో 35 టెస్ట్‌లు, 113 వన్డేలు, 64 టీ20లు ఆడి మొత్తంగా 447 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బౌలర్ అశ్విన్ 78 టెస్ట్‌లు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడి మొత్తంగా 611 వికెట్లు సాధించాడు. చదవండి: అసభ్య పదజాలంతో రైనా టీషర్ట్, చీవాట్లు పెట్టిన ద్రవిడ్ -
కావాలనే బౌండరీ లైన్ తొక్కాడు..
అబుదాబి: అప్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్ఘన్ ఆటగాడు హస్మతుల్లా షాహిది చేసిన తప్పిదం జింబాబ్వే జట్టుకు ఒక అదనపు పరుగు వచ్చేలా చేసింది. విషయంలోకి వెళితే.. మూడో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఆడుతుంది. క్రీజులో సికందర్ రజా 79, ముజరబనీ 0 పరుగులతో ఉన్నారు. ఇన్నింగ్స్ 90వ ఓవర్ చివరి బంతిని షిర్జాద్ యార్కర్ వేయగా.. రజా దానిని కవర్స్ దిశగా ఆడాడు. కవర్స్‌లో ఉన్న హస్మతుల్లా బంతిని అందుకొని బౌండరీ లైన్ ఆవల తన పాదాన్ని ఉంచాడు. రూల్ ప్రకారం ఒక ఆటగాడు బంతి చేతిలో ఉండగా బౌండరీ లైన్ దాటితే.. దానిని ఫోర్‌గా భావిస్తారు. కానీ ఇక్కడ హస్మతుల్లా కావాలనే అలా చేశాడని వీడియోలో కనిపించింది. ఆఖరి బంతికి సింగిల్ లేదా మూడు రన్స్ వస్తే రజా స్ట్రైక్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన హస్మతుల్లా రజాకు స్ట్రైక్ రాకూడదనే ఉద్దేశంతో.. తర్వతి ఓవర్లో స్ట్రైకింగ్‌కు వచ్చే ముజరబనీ ఔట్ చేసే అవకాశం ఉంటుందని భావించాడు. దీంతో అంపైర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఐసీసీ నిబంధనల్లోని రూల్ 19.8 ప్రకారం.. స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ఆడిన షాట్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఒక పరుగు ఇస్తారు. అలా జింబాబ్వే జట్టుకు అదనపు పరుగు రావడంతో పాటు.. తదుపరి ఓవర్లో రజా స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రజా ఔట్ కావడంతో జింబాబ్వే 287 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ విరామం ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు అఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 545 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. చదవండి: పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ వారెవ్వా రాహుల్.. నీ విన్యాసం అదుర్స్ -
ఐసీసీపై ఆగ్రహం.. క్రికెటర్‌కు నోటీసులు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలపై ఆగ్రహం వ్యక్తంచేసినందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా శనివారం నోటీసులు జారీచేసింది. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. ఐసీసీ బౌలింగ్ యాక్షన్ నిబంధనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. బౌలింగ్ యాక్షన్ వ్యవహారంలో ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఐసీసీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న బోర్డు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి బౌలర్లకు ఒకే నిబంధనలను అమలు చేయాలని సూచించాడు. అనుమానస్పద బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లను పరీక్షించడానికి ఓ విధానాన్ని రూపోందించాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ కోరింది. ఈ నోటీసుల వ్యవహారంపై హాఫిజ్ స్పందిస్తూ.. తాను పీసీబీ అనుమతితోనే ఇంటర్వూలో పాల్గొన్నానని తెలిపాడు. తాను గంటపాటు ఇంటర్వూ ఇస్తే అందులో కేవలం 15 సెకన్ల గురించి మాట్లాడుతున్నారని, మొత్తం ఇంటర్వ్యూ చూసి తను ఏ సందర్భంలో మాట్లాడానో తెలుసుకోవాలన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు మోచేతిని 15 డిగ్రీల వరకు వంచేందుకు ఐసీసీ అనుమతిస్తుంది. ఈ విషయంలో మూడుసార్లు నిబంధనల కంటే ఎక్కువగా మోచేతిని వంచిన హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ అనుమానం వ్యక్తం చేస్తూ నిషేధం విధించింది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అనుమానాస్పద బౌలింగ్ కారణంగా ఐసీసీ అతడిని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 17న లాబోరో యూనివర్సిటీలో జరిగిన పరీక్షల్లో హఫీజ్ ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీల్లోపే మోచేతిని వంచుతున్నట్టు తేలింది. దీంతో మే 1న తిరిగి అతడిపై ఉన్న నిషేదాన్ని ఎత్తేసింది. -
లంక కెప్టెన్ చండిమల్ ఫేక్ ఫీల్డింగ్
-
లంక కెప్టెన్ మోసం.. కోహ్లిని పట్టించుకోని అంపైర్లు
సాక్షి, స్పోర్ట్స్ : వివాదాస్పద ఫేక్ ఫీల్డింగ్ వ్యవహారం శ్రీలంక-భారత్ టెస్ట్ మ్యాచ్‌లోనూ ఎదురయ్యింది. మూడో రోజైన శనివారం భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా శ్రీలంక కెప్టెన్ చండిమల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. భారత ఇన్నింగ్స్ 53వ ఓవర్‌ను దసున్ క్షనక బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని భువనేశ్వర్ కవర్స్ వైపు ఆడాడు. బంతికోసం పరిగెత్తిన చండి డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే బంతి ముందుకు వెళ్లిపోయింది. చండి మాత్రం క్రీజు వైపు బంతిని విసిరినట్లు సైగ చేశాడు. ఇంతలో వెనకాలే వచ్చిన మరో ఫీల్డర్ బంతిని అందుకుని క్రీజ్ వైపు విసిరాడు. ఐసీసీ నూతన నిబంధనల ప్రకారం ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడితే పెనాల్టీగా ఐదు పరుగులు బ్యాటింగ్ జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చండిమల్ చేసిన పనిపై అంపైర్లు నిగెల్ లాంగ్-జోయెల్ విల్సన్‌లు చర్చిస్తున్న సమయంలో.. డ్రెస్సింగ్ రూమ్ గ్యాలరీ వద్ద ఉన్న కోహ్లీ పెనాల్టీ కోసం 5 వేళ్లను సంజ్ఞగా చూపించాడు. కానీ, ఫీల్డ్ అంపైర్లు మాత్రం అతన్ని పట్టించుకోకుండా పెనాల్టీ ఇవ్వకుండానే ఆటను కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జెఎల్టీ కప్ డొమెస్టిక్ మ్యాచ్‌లో క్వీన్స్లాండ్ బుల్స్ ఆటగాడు మార్నస్ లబుస్‌ఛాగ్నె ఇదే రీతిలో ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడగా.. అంపైర్లు పెనాల్టీ విధించారు. -
ఊచకోత తప్పనుంది..
బ్యాటింగ్ పవర్ ప్లే రద్దు సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు నిబంధనలను సవరించిన ఐసీసీ సాక్షి: టీ20 ప్రభావాన్ని తట్టుకుంటూ వన్డేలు ఆదరణ కోల్పోకుండా ఉండేందుకు ఐసీసీ నిర్దేశించిన రూల్స్ బౌలర్ల పాలిట శాపంలా మారాయి. మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారితేనే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారని భావించిన క్రికెట్ పెద్దలు ఫీల్డింగ్‌పై పరిమితులు విధించారు. నిబంధనలు వచ్చిన కొత్తలో బాగున్నా.. రానురాను అవి విమర్శల పాలయ్యాయి. వన్డేల్లో బౌలర్లు కేవలం బ్యాట్స్‌మెన్‌కు బంతుల విసిరే యంత్రాల్లా మారిపోయారు. వన్డేలలో కంటే టీ20ల్లో బౌలింగ్ చేయడమే బాగుంటుందని బౌలర్లు చెబుతున్నారంటే.. నిబంధనలు వారికి ఎంత ప్రతిబంధ కాల్లా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. 350కి పైగా పరుగులు సులభంగా చేయడం, పైగా ప్రత్యర్థి జట్టు ల క్ష్యాన్ని ఛేదించడం ఇప్పుడు పెద్ద కష్టమేమి కాదు. ఈ తీరుపై అభిమానులు కూడా పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదంటే వన్డేలు.. బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మరాయనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. నిబంధనలను సడలించాలని అన్ని జట్లు చేస్తున్న డిమాండ్లకు ఐసీసీ తలవంచింది. ఫీల్డింగ్ పరిమితులు, మిగిలిన నింబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్తగా వచ్చిన రూల్స్ పరిశీలిస్తే.. బ్యాటింగ్ పవర్‌ప్లే రద్దు.. నిజానికి వన్డేల్లో 2005 వరకు ఒకే పవర్ ప్లే ఉండేది. తొలి 15 ఓవర్ల పాటు 30 గజాల సర్కిల్ అవతల ఇద్దరు ఫీల్డర్లు మాత్రం ఉండాలనే నిబంధన అది. 2005లో ఈ పవర్ ప్లేను అలాగే ఉంచి మరో రెండింటిని అమల్లోకి తెచ్చారు. అవి బౌలింగ్ పవర్ ప్లే (బౌలింగ్ జట్టు కెప్టెన్ తీసుకుంటాడు), బ్యాటింగ్ పవర్ ప్లే (క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ తీసుకుంటారు). ఇవి రెండు ఐదేసీ ఓవర్లు ఉంటాయి. ఇవి ఆడుతున్నప్పుడు సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే ఈ రెండు పవర్ ప్లేలు 11-40 ఓవర్ల మధ్య మాత్రమే తీసుకోవాలని 2011లో రూల్ తెచ్చారు. 2012లో బౌలింగ్ పవర్ ప్లేను తీసేశారు. ఇప్పుడు బ్యాటింగ్ పవర్ ప్లేను రద్దు చేయడంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం కాస్త ఇబ్బందిగానే మారనుంది. 40-50 ఓవర్ల మధ్య ఫీల్డింగ్ సవరణలు.. నిజానికి పవర్ ప్లే మినహా మిగిలిన ఓవర్లలో సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు. అయితే టీ20 రాకతో వన్డేల్లో కూడా బౌండరీల మోత మోగించేందుకు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండాలనే నిబంధనను ఐసీసీ 2012లో తెచ్చింది. దీని వల్ల బ్యాట్స్‌మెన్ షాట్ ఆడేందుకు ఎప్పుడు ఏదో ఒక ఫీల్డర్ లేని ఖాళీ ఉండేది. ఫీల్డింగ్ కెప్టెన్, బౌలర్‌కు ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలనే దానిపై గందరగోళంగా ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధనను పూర్తిగా సవరించకపోయినా.. 40-50 ఓవర్ల మధ్యలో సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను మోహరించవచ్చనే రూల్ బౌలర్లకు ఊరటనే చెప్పవచ్చు. క్యాచింగ్ పొజిషన్లు అవసరం లేదు.. ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లలో కనీసం రెండు క్యాచింగ్ పొజిషన్లలోనైనా ఫీల్డర్లు ఉండాలనే నిబంధన కూడా 2012లోనే తెచ్చారు. క్యాచింగ్ పొజిషన్లంటే.. స్లిప్, సిల్లీ పాయింట్, గల్లీ, లెగ్ స్లిప్, లెగ్ గల్లీ, షార్ట్ లెగ్ తదితర స్థానాలు. బ్యాట్స్‌మెన్ ఆడిన షాట్లను నేరుగా క్యాచ్ అందుకునే అవకాశం ఉన్న స్థానాలివి. ఇప్పుడు ఇద్దరు ఫీల్డర్లు ఉండాలనే నిబంధనను తొలగించారు. నో బాల్ అయితే చాలు.. అయితే ఒక నిబంధన మాత్రం వారికి కాస్త ప్రతికూలంగా తీసుకున్నారు. ఇప్పటివరకు లెగ్ నోబాల్‌కు మాత్రమే ఫ్రీ హిట్ ఉండేది. ఇప్పట్నుంచి ఏ నోబాల్ కైనా ఫ్రీహిట్ ఉంటుంది. వన్డేలతో పాటు టీ20ల్లో కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం 1 - 10 ఓవర్లు: సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు 11 - 40 ఓవర్లు: సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు 40 - 50 ఓవర్లు: సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఈ కొత్త నిబంధనలు జూలై 5 నుంచి అమల్లోకి వస్తాయి.