సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో చివర్లో విజయం అందుకున్న టీమిండియా ఎలాగోలా తొలిసారి సిరీస్‌ను దక్కించుకుంది. టీమిండియా భారీ స్కోరు చేసింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మిల్లర్ విధ్వంసానికి మ్యాచ్ ఓడిపోయేదే. మ్యాచ్ ఓడినా మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో అభిమానుల మనుసు గెలుచుకున్నాడు.
ఈ సంగతి పక్కనబెడితే.. అక్టోబర్ 1 నుంచి ఐసీసీ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మ్యాచ్ టీమిండియా, సౌతాఫ్రికాదే కావడం గమనార్హం. అయితే కొత్త నిబంధనలను అంపైర్లు మరిచిపోయారు. తాజా రూల్స్ ప్రకారం స్ట్రయికర్ షాట్ కొట్టి అవుటైతే పరుగు తీసే ప్రయత్నం చేస్తూ నాన్‌స్ట్రయికర్ అతడిని దాటినా సరే, కొత్తగా వచ్చే బ్యాటర్ మాత్రమే స్ట్రయికింగ్ తీసుకోవాలి.
కానీ రెండో ఓవర్ నాలుగో బంతికి రోసో అవుటయ్యాక, ఐదో బంతికి డి కాక్ స్ట్రయిక్ తీసుకున్నాడు. వాస్తవానికి మార్క్రమ్ స్ట్రైయిక్ తీసుకోవాల్సింది.. అంపైర్లు దీనిని గుర్తించలేకపోయారు. తొలి మ్యాచ్ కదా.. అందుకే మరిచిపోయింటారు.. ఫాలో కావడానికి అంపైర్లకు టైం పడుతుందేమో అంటూ అభిమానులు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment