శ్రీలంక పర్యటనను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ బౌలింగ్ చేసిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మెండిస్ ఒకే ఓవర్‌లో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
స్పిన్నర్లకు భారత్ కాస్త తడబడుతుండంతో లంక కెప్టెన్ అసలంక పార్ట్ టైమ్ స్పిన్నర్ మెండిస్ మెండిస్‌ను ఎటాక్‌లో తీసుకువచ్చాడు. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన మెండిస్ తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్నాడు.
కానీ వాస్తవానికి రైట్ ఆర్మ్ బౌలర్ అయిన కమిందు మెండిస్.. సూర్యకు మాత్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఆ బంతికి ఫోర్ కొట్టిన సూర్య తర్వాత బంతికి సింగిల్ తీసి రిషబ్ పంత్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అప్పుడు అనూహ్యంగా మెండిస్ మళ్లీ తన రైట్‌ఆర్మ్ శైలిలోనే బౌలింగ్ చేశాడు.
దీంతో ఒకే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేసినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్‌లో చేతులు మార్చి బౌలింగ్ చేయడంపై ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ లుక్కేద్దాం
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
రూల్స్ ప్రకారం.. బౌలర్‌కు ఏ చేతితోనైనా బంతిని వేసే అవకాశం ఉంటుంది. అయితే బంతి వేసే ముందు సదరు బౌలర్ తన శైలిని కచ్చితంగా అంపైర్‌కు తెలియజేయాలి. అప్పుడే వారు బౌలింగ్ చేసే చేతిని మార్చుకోవడానికి అంపైర్ అనుమతి ఇస్తాడు.
ఆ విషయాన్ని బ్యాటర్‌కు సైతం అంపైర్ తెలియజేస్తాడు. ఒక వేళ బౌలర్ చేతిని మార్చుకున్న విషయాన్ని అంపైర్‌గా తెలియజేయకపోతే అది నో బాల్‌గా పరిగణించబడుతోంది. ఇప్పుడు భారత్-శ్రీలంక తొలి మ్యాచ్‌లో మాత్రం మెండిస్ తన నిర్ణయాన్ని అంపైర్‌కు తెలిపాడు.
అందుకే, దానిని సరైన బంతిగానే అంపైర్ ప్రకటించాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒకే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన ఐదో బౌలర్‌గా మెండిస్ నిలిచాడు.ఈ జాబితాలో భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అక్షయ్ కర్నేవార్, పాకిస్తాన్ లెజెండ్ హనీఫ్ మహ్మద్, ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం గ్రాహం గూచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ హషన్ తిలకరత్న ఉన్నారు.
చదవండి: IND vs SL: అతడెందుకు దండగ అన్నారు.. కట్‌చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్
Comments
Please login to add a commentAdd a comment