Watch: UK Batter Forgets Wearing Pads During Match Video Goes Viral - Sakshi
Sakshi News home page

పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా?

Published Thu, Jul 21 2022 3:24 PM | Last Updated on Thu, Jul 21 2022 4:35 PM

UK Batter Forgets Wearing Pads During Match Video Goes Viral - Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఫన్నీ ఘటనలు సహజం. క్యాచ్‌లు, రనౌట్‌లు, ఫీల్డర్ల మధ్య సమన్వయలోప సందర్భాలు, ఆటగాళ్ల గొడవలు.. ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మన కళ్ల ముందుంటాయి. అప్పుడప్పుడు ఆటగాళ్లు కావాలని చేసే చర్యలను నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా యూకే వేదికగా జరిగిన క్లబ్‌ క్రికెట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్‌ క్రీజులోకి వచ్చేటప్పుడు అతి ముఖ్యమైన ప్యాడ్లను కట్టుకోవడం మర్చిపోయాడు. కనీసం క్రీజులోకి వచ్చాకా కూడా తాను ఏం మరిచిపోయానన్న సంగతి గమనించలేకపోయాడు.

ప్రత్యర్థి ఆటగాళ్లు సహా తోటి బ్యాటర్‌.. ''నీ ప్యాడ్స్‌ ఎక్కడా?'' అని అడిగితే.. అప్పుడు మన బ్యాటర్‌కు బుర్రలో లైట్‌ వెలిగింది. వెంటనే ఎంత వేగంగా క్రీజులోకి వచ్చాడో.. అంతే వేగంగా పెవిలియన్‌కు వెళ్లి ప్యాడ్లను కట్టుకొని తిరిగొచ్చాడు. కనీసం పక్కవాళ్లు చెప్పేంతవరకు కూడా సోయి లేని ఆ ఆటగాడి పేరు మార్టిన్‌ హ్యూగ్స్‌.. సౌత్‌ ఎండ్‌ సివిక్‌ క్రికెట్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. ''పక్కవాళ్లు చెప్పేవరకు కూడా సోయి లేదు.. ఇంత మతిమరుపా'' అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. ఇప్పటివరకు 11వేల మంది వీడియోనూ లైక్‌ చేయగా.. 1200 మంది రీట్వీట్‌ చేయడం విశేషం.

చదవండి: పాకిస్తాన్‌ ఓపెనర్‌ ప్రపంచ రికార్డు.. 93 ఏళ్ల తర్వాత తొలి సారిగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement