అంపైర్‌కు దడ పుట్టించిన బెన్‌ స్టోక్స్‌.. | Sakshi
Sakshi News home page

ENG Vs PAK: అంపైర్‌కు దడ పుట్టించిన బెన్‌ స్టోక్స్‌..

Published Tue, Dec 20 2022 10:30 AM

Ben Stokes Loses Control of-Bat Nearly Lands On Square Leg Umpire Viral - Sakshi

ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి అంకానికి చేరుకుంది. మరో 55 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఏం చేసినా ఇంగ్లండ్‌ గెలుపును ఆపడం పాక్‌కు కష్టమే.ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. 17 సంవత్సరాల తర్వాత టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాక్‌ గడ్డపై  అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ పాక్‌ జట్టుకు బొమ్మ చూపించింది.

ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ లెగ్‌ అంపైర్‌కు దడ పుట్టించాడు. కొద్దిగా అటు ఇటు అయ్యుంటే అంపైర్‌ తల కచ్చితంగా పగిలేదే. రెహాన్‌ అహ్మద్‌ ఔటయ్యాకా స్టోక్స్‌ క్రీజులో అడుగుపెట్టాడు. అప్పటికే ఇంగ్లండ్‌ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో నుమాన్‌ అలీ వేసిన ఐదో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్‌ చేతిలో గ్రిప్‌ జారిన బ్యాట్‌ స్క్వేర్‌లెగ్‌లో నిలబడిన లెగ్‌ అంపైర్ పక్కనబడింది.

ఈ చర్యతో భయపడిన అంపైర్‌ హసన్‌ రాజా కాస్త పక్కకు జరిగి స్టోక్స్‌వైపు చూశాడు. స్టోక్స్‌ కూడా అయ్యో నేను కావాలని చేయలేదు.. బ్యాట్‌ గ్రిప్‌ జారిందంటూ వివరించాడు. ఇదంతా గమనించిన పాకిస్తాన్‌ ఆటగాళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. అయితే అంపైర్‌ అదృష్టం బాగుంది లేకపోయుంటే కచ్చితంగా ఏదో ఒక చోట తగిలేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి స్టోక్స్‌ తన చర్యతో అంపైర్‌ గుండెల్లో దడ పుట్టించాడంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు.

చదవండి: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?

IND VS BAN 1st Test: విరాట్‌ కోహ్లిని కాపాడిన రిషబ్‌ పంత్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement