17 సంవత్సరాల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడోటెస్టులోనూ గెలిచి ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు పాక్ మాత్రం ఎలాగైనా టెస్టు గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది.
ఇక మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఆడుతుంది. పాక్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ రనౌట్ అయిన తీరు ఆసక్తిగా నిలిచింది. హ్యారీ బ్రూక్‌తో ఏర్పడిన మిస్ కమ్యూనికేషన్ కారణంగా స్టోక్స్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఇన్నింగ్స్ 33వ ఓవర్లో ఐదో బంతిని బ్రూక్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బ్రూక్, స్టోక్స్‌లు రెండు పరుగులు తీశారు. అయితే స్టోక్స్ మూడో పరుగు కోసం వస్తున్నాడని బ్రూక్ అంచనా వేయలేదు. బ్రూక్స్ పరిగెత్తాలనుకొనేలేపే పాక్ ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అప్పటికే స్టోక్స్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వచ్చేశాడు. బ్రూక్స్ కోసం స్టోక్స్ తన వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే స్టోక్స్ త్యాగం ఊరికే పోలేదు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన కెప్టెన్‌ను ఔట్ చేశానన్న బాధనో ఏమో తెలియదు కానీ మరోసారి కీలక సెంచరీతో మెరిశాడు బ్రూక్స్. ఈ సిరీస్‌లో బ్రూక్స్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 111 పరుగులు చేసిన బ్రూక్స్ మహ్మద్ వసీమ్ జూనియర్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతేకాదు పనిలో పనిగా 125 ఏళ్ల రికార్డును కూడా బద్దలుకొట్టాడు బ్రూక్స్. ఇంగ్లండ్ తరపున తొలి ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రూక్స్ నిలిచాడు. ఇంతకముందు కేఎస్ రంజిత్ సిన్హ్జి 418 పరుగులతో ఉన్నాడు. తాజాగా బ్రూక్స్ రంజిత్‌సిన్హ్జిని అధిగమించాడు.
"Utter, utter confusion!" ⚡#PAKvENG | #UKSePK pic.twitter.com/wdyDwg9AIU
— Pakistan Cricket (@TheRealPCB) December 18, 2022
Comments
Please login to add a commentAdd a comment