field umpire
-
IPL 2024: ఫీల్డ్ అంపైర్ల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిద్దూ
క్రికెట్లో టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెక్నాలజీ ఉపయోగించి 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే ఫీల్డ్ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నాడు. ఫీల్డ్ అంపైర్ అంటే ప్రతి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేయడం కాదని తెలిపాడు.ఫీల్డ్ అంపైర్లు విచక్షణ ఉపయోగించి సొంత నిర్ణయాలు తీసుకుంటేనే క్రికెట్‌కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైరే తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్ అంపైర్ అవసరమే లేదన్నాడు. ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సంఘటనను దృష్టిలో పెట్టుకుని సిద్దూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతికి కోహ్లి ఔటయ్యాడు. Navjot Singh Sidhu said, "now the on field umpire's job is not to stand in the stadium when 3rd umpire technology is being used for 90% of the decisions shown all on screen". (Star Sports). pic.twitter.com/uLmWRboLMZ— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024 నో బాల్ కోసం కోహ్లి అప్పీల్ చేసినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ఈ వివాదాస్పద ఘటన క్రికెట్ వర్గాల్లో పెను దుమారం లేపింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసపట్టులో సాగుతుంది. ఆర్సీబీ, పంజాబ్ మినహా అన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్ జట్లకు ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపుగా ఖరారు కాగా.. మరో బెర్తు కోసం ఐదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్, లక్నో, సీఎస్కే, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుస స్థానాల్లో ఉన్నాయి. అన్ని జట్లు మరో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి.. కట్‌చేస్తే సక్సెస్ఫుల్ అంపైర్‌గా
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలి టెస్టుకు పాకిస్తాన్ అంపైర్ అహ్సన్ రాజా ఫీల్డ్ అంపైర్‌గా పనిచేయడం ఆసక్తి కలిగించింది. ఎలైట్ ఐసీసీ అంపైర్‌గా అహ్సన్ రాజాకు తొలిసారి యాషెస్ టెస్టు సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయం పాక్ అభిమానులను సంతోషపరిచింది. మరి అభిమానుల సంతోషం వెనుక కారణం ఏంటని అనుకుంటున్నారా.. 2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బస్సులో స్టేడియానికి వెళ్తున్న లంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగింది. అదే బస్సులో అహ్సన్ రాజా కూడా ఉన్నాడు. పలువురు లంక క్రికెటర్లతో పాటు అహ్సన్ రాజా కూడా ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి బులెట్ దూసుకెళ్లడంతో బతకడం కష్టమన్నారు. కానీ అహ్సన్ రాజా బతకాలనే పట్టుదల అతన్ని కోలుకునేలా చేసింది. అంతేకాదు అంపైరింగ్ చేయాలన్న కోరికతో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అహ్సన్ రాజా కోరిక మళ్లీ నెరవేరింది. అంపైరింగ్‌పై ఉన్న ఇష్టంతో అహ్సన్ రాజా క్రికెట్‌కు తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. తన కెరీర్లో అహ్సన్రాజా 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక క్రికెట్లో తాను సక్సెస్ కాలేనని గ్రహించిన అహ్సన్ రాజా ఆటకు గుడ్‌బై చెప్పి అంపైరింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. అలా 2006లో అంపైర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2006లో ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ద్వారా అహ్సన్ రాజా అంపైరింగ్ చేవాడు. ఆ తర్వాత 2009లో పీసీబీ కాంట్రాక్ట్ దక్కించుకున్న అహ్సన్ రాజా అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2018లో అండర్-19 వరల్డ్‌కప్, ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్‌కప్, 2019 ఐసీసీ టి20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్, 2020 ఐసీసీ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక 2021లో పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ నిర్వహించాడు. అలా కేవలం నాలుగేళ్లలోనే అత్యంత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అహ్సన్ రాజా ఐసీసీ ఎలైట్ అంపైర్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. కట్‌చేస్తే.. ఇవాళ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తూ టాప్ అంపైర్‌గా పేరు తెచ్చుకున్నాడు. What an inspiring journey from Ahsan Raza. Was one of the victims of SL team attack back in 2009 and there were even rumors that he had expired but he fought through it and made his way to the top from bottom. From umpiring in Bermuda vs Namibia to umpiring in Ashes. pic.twitter.com/WiNjv2slxW — yang goi (@GongR1ght) June 16, 2023 so good to see ahsan raza umpiring in an ashes opener. icc have had always respect for aleem dar & after his retirement, they have passed in it onto ahsan raza. pic.twitter.com/W7PfSR7ppu — Kamran (@kamran_069) June 16, 2023 చదవండి: రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు -
రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో అజింక్యా రహానేను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని రహానే స్ట్రెయిట్ షాట్ ఆడగా.. బంతి వేగంగా వెళ్లడంతో క్యాచ్ మిస్ అవుతుందని అనుకున్నాం. కానీ లలిత్ యాదవ్ అద్బుతం చేశాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ కుడిచేత్తో కేవలం వేళ్ల సాయంతోనే అద్బుతంగా అందుకున్నాడు. అయితే ఇక్కడ లలిత్ యాదవ్ దూబేను రనౌట్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ రహానే క్యాచ్ అందుకున్న లలిత్ ఆ పని చేయలేకపోయాడు. అయితే లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు రహానే షాక్ తినగా.. అంపైర్ క్రిస్ గఫానీ మాత్రం ఇంప్రెస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What a Catch by Lalit Yadav 🤯🤯#LalitYadav #CSKvDC pic.twitter.com/WJP6GyPXtl — Cricket Apna l Indian cricket l Bleed Blue 💙🇮🇳 (@cricketapna1) May 10, 2023 -
పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్లో 30 యార్డ్ సర్కిల్ దూరం ఎక్కువగా ఉన్నట్లు అంపైర్లు గుర్తించి సరిచేయడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్రౌండ్స్‌మెన్ కొలతలతో 30-యార్డ్ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి. అయితే కొలతలు తప్పుగా తీసుకోవడం వల్ల 30-యార్డ్ సర్కిల్ అసలు దానికంటే కాస్త దూరంగా పెట్టారు. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా తొలి ఓవర్లో నాలుగు బంతులు వేసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, రషీద్ రియాజ్‌లు తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మ్యాచ్‌ను హాల్డ్ చేసి గ్రౌండ్స్‌మెన్‌ను పిలిచి 30-యార్డ్ సర్కిల్‌ను సరిచేశారు. గ్రౌండ్స్‌మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు కూడా సర్కిల్‌ను సరిచేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేశారు. పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. 30 యార్డ్ సర్కిల్‌ను సరిగ్గా సెట్ చేయలేకపోయారు.. ఇక ఆసియాకప్‌ను హోస్ట్ చేస్తారంటా.. అంటూ కామెంట్ చేశారు. pic.twitter.com/TPyCV3qCyZ — Out Of Context Cricket (@GemsOfCricket) April 29, 2023 చదవండి: అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే -
ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!
క్రికెట్లో ఫీల్డ్ అంపైర్ పనేంటని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరు. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లకు సిగ్నల్స్ ఇవ్వడం.. బౌలర్లకు ఆదేశాలు ఇవ్వడం.. రనౌట్లు, నోబ్లు, వైడ్లు, లెగ్‌బైలు ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాచ్‌లో ఆటగాళ్ల కన్నా అంపైర్‌కే ఎక్కువ పని ఉంటుంది. అనుక్షణం ఏకాగ్రతతో ఉంటూ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించడం అతని పాత్ర. ఒకప్పుడు ఫీల్డ్ అంపైర్ ఏది చెబితే అదే శాసనం. ఇప్పుడంటే డీఆర్ఎస్ల రూపంలో అంపైర్ల నిర్ణయాన్ని చాలెంజ్ చేయొచ్చు. కానీ ఒకప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్.. రనౌట్ ఈ రెండు అంశాల్లో తప్ప అంపైర్ ఔట్ ఇచ్చాడంటే బ్యాటర్ మాట మాట్లాడకుండా పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు డీఆర్ఎస్లు అంపైర్లను కన్ఫూజన్‌కు గురిచేస్తున్నాయి. బంతి బంతికి డీఆర్ఎస్ కోరే అవకాశం ఉండడంతో వైడ్ బాల్స్‌ను కూడా సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్జున్ వేసిన నాలుగో బంతి త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్ టెండూల్కర్‌తో పాటు కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్‌ఔట్ అంటూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్, ఇషాన్‌లు సైలెంట్ అయిపోయారు. కానీ ఇక్కడే అసలు కథ ప్రారంభమయింది. ఏమైందో తెలియదు కానీ నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్ బాల్ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో అది క్లియర్ వైడ్ అని తెలిసింది. అంపైర్‌గా ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా నితిన్ మీనన్ రివ్యూ వెళ్లడం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటేనే ఈ రివ్యూను అంపైర్ ఉపయోగిస్తారు. ఐపీఎల్లో ఇంతవరకు ఈ రివ్యూ ఏ అంపైర్ వాడుకోలేదు. ఒక రకంగా ఐపీఎల్ చరిత్రలో ఒక అంపైర్ డీఆర్ఎస్ కోరడం ఇదే తొలిసారి. అయితే ఒక వైడ్ బాల్ విషయంలో అయోమయానికి గురవ్వడం ఏంటో.. దీనికోసం థర్డ్ అంపైర్ వరకు వెళ్లడమేంటో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే రివ్యూ కోరుకోవాల్సింది ఆటగాళ్లని.. అంపైర్లు కాదని కొందరు విమర్శించారు. What's just Nitin Menon has done by taking caught behind decision upstairs on his own... What we can call this..#IPL2O23 #SRHvsMI @cricbuzz pic.twitter.com/4E8tzVXAzg — Amit K Jha (@Amit_sonu_) April 18, 2023 Why the hell did Nitin Menon take the review? Strange. #MIvsSRH — Mihir Gadwalkar (@mihir_gadwalkar) April 18, 2023 Umpire taking review for caught behind🤔 Whats happening??#MIvsSRH — Manish Nonha (@ManishNonha) April 18, 2023 చదవండి: పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్ అయిపోతున్నాడు! 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు' -
చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం
అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఒక మహిళ ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌కు చెందిన మహిళా అంపైర్ కిమ్ కాటన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్.. మరో అంపైర్ వేన్ నైట్స్‌తో కలిసి ఫీల్డ్ అంపైరింగ్ చేసింది. అయితే కిమ్ కాటన్ గతంలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు థర్డ్ అంపైర్ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్లో తొలిసారి ఫీల్డ్ అంపైరింగ్ చేసిన కిమ్ కాటన్ తన పేరును క్రికెట్ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ పేరిట చాలా రికార్డులున్నాయి. 2020లో మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్‌గా 2018 నుంచి కిమ్ కాటన్ 54 టి20 మ్యాచ్‌లతో పాటు 24 వన్డేల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించింది. ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. History today for umpire Kim Cotton who becomes the first female umpire to stand in a men’s international match between two @ICC full member countries 🤝#NZvSL #CricketNation pic.twitter.com/EI8C1RJt4d — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే -
నోబాల్ విషయంలో పాక్ క్రికెటర్ నానా యాగీ
పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ నోబాల్ విషయమై అంపైర్‌తో నానా యాగీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా రంగ్‌పూర్ రైడర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రోబుల్ హక్ వేశాడు. వరుసగా రెండు బంతులు బౌన్సర్లు వేయడంతో.. ఫీల్డ్ అంపైర్ రెండో బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నో బాల్ ఇవ్వడంపై రంగ్‌పూర్ రైడర్స్ కెప్టెన్ నురుల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హారిస్ రవూఫ్ జోక్యం చేసుకొని అసలెలా నోబాల్ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బౌన్సర్లు వేస్తే వార్నింగ్‌తో సరిపెట్టాలని రూల్ ఉన్నా.. పట్టించుకోకుండా నోబాల్ ఇవ్వడమేంటన్నాడు. అయితే అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నురుల్ హసన్, హారిస్ రవూఫ్‌లు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రంగ్‌పూర్ రైడర్స్ సిల్హెట్ స్ట్రైకర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రైకర్స్.. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తంజిమ్ హసన్ సకీబ్(41 పరుగులు), కెప్టెన్ మొర్తజా(21 పరుగులు).. ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో హసన్ మహ్మూద్, అజ్మతుల్లాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోనీ తాలుక్దార్ 41 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. Haris Rauf In fight With Umpire over a no Ball. #BPL #Bpl2023 pic.twitter.com/oLLme81d7f — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 27, 2023 చదవండి: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? -
బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు?
క్రికెట్లో ఆటగాళ్లతో పాటు అంపైర్ల పాత్ర కూడా చాలా కీలకం. బౌలర్ ఎన్ని బంతులు వేస్తున్నాడు.. బ్యాటర్లు ఎన్ని పరుగులు తీశారు.. వైడ్ బాల్స్, నో బాల్స్, సిక్సర్లు, బౌండరీలు, క్యాచ్‌లు, ఎల్బీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫీల్డ్ ఉన్న ఇద్దరు అంపైర్లు చాలా బిజీగా ఉంటారు. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగితే రాజీ కుదర్చడం కూడా అంపైర్ల బాధ్యత. బాధ్యతతో కూడిన అంపైరింగ్‌లో నిర్లక్ష్యం వహించడం ఎప్పుడైనా చూశారా. చూడకపోతే మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రీక్యాప్ చేయండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లెగ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ బౌలర్ వేసిన బంతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడం కనిపించింది. ఇందులో మరొక విషమేంటంటే.. ఆ సమయంలో ఎరాస్మస్ వెనక్కి తిరిగి చేతితో ఏదో లెక్కబెడుతున్నట్లు కనిపించింది. అప్పటికే అన్రిచ్ నోర్ట్జే బంతి వేయడం.. క్రీజులో ఉన్న జేసన్ రాయ్ షాట్ ఆడడం జరిగిపోయాయి. ఇంగ్లండ్ బ్యాటర్లు పరిగెత్తే సమయంలో అంపైర్ ఎరాస్మస్ అప్పుడే మేల్కొన్నట్లు ముందుకు తిరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా 24వ ఓవర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వన్డే క్రికెట్‌పై బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. అంపైర్ పని కాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నాడబ్బా.. పట్టించుకోవడం లేదు కాబట్టే ప్రతీది థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తున్నారనుకుంటా.. గుత్కా సుప్రీమసీ అంటూ కామెంట్స్ చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. pic.twitter.com/KKPnERRMuw — 🗂️ (@TopEdgeCricket2) January 27, 2023 చదవండి: 'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం -
అంపైర్‌కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్..
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి అంకానికి చేరుకుంది. మరో 55 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఏం చేసినా ఇంగ్లండ్ గెలుపును ఆపడం పాక్‌కు కష్టమే.ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. 17 సంవత్సరాల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ పాక్ జట్టుకు బొమ్మ చూపించింది. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ అంపైర్‌కు దడ పుట్టించాడు. కొద్దిగా అటు ఇటు అయ్యుంటే అంపైర్ తల కచ్చితంగా పగిలేదే. రెహాన్ అహ్మద్ ఔటయ్యాకా స్టోక్స్ క్రీజులో అడుగుపెట్టాడు. అప్పటికే ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నుమాన్ అలీ వేసిన ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్ చేతిలో గ్రిప్ జారిన బ్యాట్ స్క్వేర్‌లెగ్‌లో నిలబడిన లెగ్ అంపైర్ పక్కనబడింది. ఈ చర్యతో భయపడిన అంపైర్ హసన్ రాజా కాస్త పక్కకు జరిగి స్టోక్స్‌వైపు చూశాడు. స్టోక్స్ కూడా అయ్యో నేను కావాలని చేయలేదు.. బ్యాట్ గ్రిప్ జారిందంటూ వివరించాడు. ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. అయితే అంపైర్ అదృష్టం బాగుంది లేకపోయుంటే కచ్చితంగా ఏదో ఒక చోట తగిలేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి స్టోక్స్ తన చర్యతో అంపైర్ గుండెల్లో దడ పుట్టించాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. Ben Stokes has thrown a bat further than I have ever hit a ball I reckon pic.twitter.com/hDKH6gO5tO — Ticker Merchant (@WillMarshall15) December 19, 2022 చదవండి: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? IND VS BAN 1st Test: విరాట్ కోహ్లిని కాపాడిన రిషబ్ పంత్ -
చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ ఫీల్డ్ అంపైర్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో సహనం కోల్పోయిన అగర్ అంపైర్‌ను బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. క్రీజులో కుదురుకున్న డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్స్ జోడిని విడదీయడానికి కమిన్స్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ చేతికి బంతినిచ్చాడు. బంతితో వికెట్లు తీయాల్సింది పోయి.. బంతి వేసిన తర్వాత పదే పదే పిచ్‌పైకి వస్తూ బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఇది చూసిన ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ అగర్‌ను హెచ్చరించాడు. ''పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్ కాదు..'' అంపైర్ అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇది విన్న అగర్ వెంటనే.. ''మీరు అనేది ఏంటి.. నేను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్నా'' అంటూ సమాధానమిచ్చాడు. అగర్ సమాధానంతో ఏకీభవించని అంపైర్.. ''బ్యాటర్ బంతిని కొట్టింది మిడ్ వికెట్ వైపు.. నువ్వు పిచ్‌పైకి ఎందుకు వస్తున్నావు.. అంటే బ్యాటర్‌ను అడ్డుకోవడానికే కదా'' అంటూ తెలిపాడు. ఇది విన్న అగర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అంపైర్ మీదకు దూసుకొచ్చిన అగర్ అసభ్యకరమైన పదంతో దూషించాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఆ తర్వాత కూడా అగర్, పాల్ రీఫెల్లు వాదులాడుకోవడం కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగినందుకు ఆస్టన్ అగర్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఆదిలోనే శుభారంభం ఇచ్చాడు. 14 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్ చేర్చగా.. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ జేసన్ రాయ్‌ను ఆరు పరుగుల వద్ద సూపర్ బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే ఒక ఎండ్‌లో డేవిడ్ మలాన్ స్థిరంగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు ముందుకు కదిలింది. సామ్ బిల్లింగ్స్, కెప్టెన్ బట్లర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన మలాన్ శతకంతో మెరిశాడు. 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో డేవిడ్ విల్లే 40 బంతుల్లో 34 నాటౌట్ దాటిగా ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు. “What do you mean⁉" Ashton Agar wasn't having it from Paul Reiffel 👀https://t.co/FQjowjYEKS — Fox Cricket (@FoxCricket) November 17, 2022 చదవండి: Video: స్టార్క్ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్ వీడియో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
AUS Vs AFG: పూర్ అంపైరింగ్.. ఆరుకు బదులు ఐదు బంతులే
ఒక ఓవర్లో ఎన్ని బంతులుంటాయని క్రికెట్‌పై కనీసం పరిజ్ఞానం ఉన్న వాళ్లని అడిగితే టక్కున 'ఆరు' అని చెప్పేస్తారు. అయితే ఐదు బంతులు పడగానే ఓవర్ ముగిసిపోవడం ఎప్పుడైనా చూశారా. ఒకవేళ చూడకుంటే మాత్రం వెంటనే ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్ రీప్లే చూడండి. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఆసీస్, ఆఫ్గన్ మ్యాచ్ ఒక ఓవర్ ఐదు బంతులతోనే ముగియడం ఆసక్తికరంగా మారింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను నవీన్-ఉల్-హక్ వేశాడు. ఆ సమయంలో క్రీజులో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్‌లు క్రీజులో ఉన్నారు. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ వచ్చాయి. ఆ తర్వాత మూడో బంతిని మార్ష్ బౌండరీ తరలించాడు. ఇక నాలుగో బంతిని వార్నర్ డాట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత ఐదో బంతికి మూడు పరుగులు వచ్చాయి. ఓవర్ పూర్తయిందనుకున్న నవీన్ ఉల్ హక్ అంపైర్ వద్దకి వచ్చాడు. అంపైర్ కూడా మిస్ కమ్యునికేషన్ వల్ల ఓవర్ పూర్తైనట్లుగా భావించాడు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సహా ఆఫ్గన్ ఆటగాళ్లు కూడా ఈ తప్పిదాన్ని గుర్తించలేకపోయారు. అయితే ఓవర్ పూర్తై మరుసటి ఓవర్ తొలి బంతి పడిన తర్వాత ఫీల్డ్ అంపైర్ తప్పిదాన్ని గమనించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక బంతి తక్కువగా ఆడినట్లయింది. అయితే ఇది అంపైర్ల తప్పిదమని అభిమానులు పేర్కొంటున్నా చిన్న మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందనుకోవచ్చు. ఫీల్డ్‌లో ఉండే అంపైర్లు చూసుకోవాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటి. ఓవర్ పూర్తయ్యేవరకు అన్ని బంతులను కౌంట్ చేయడంతో పాటు పరుగులు, రనౌట్లు, లెగ్‌బైలు, నోబ్లతో పాటు చాలా అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అంపైర్లు కూడా పొరపాటు చేయడం సహజం. అయితే ఇది తొలి ఇన్నింగ్స్‌లో జరిగింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండో ఇన్నింగ్స్‌లో అయ్యుంటే వివాదంగా మారేది. In the 4th over of Australia's batting Only 5 ball to be bowled.. Poor Umpiring in this tournament... #AUSvAFG pic.twitter.com/zdUnAvOvrF — GUJARAT TITANS (@Gujrat_titans_) November 4, 2022 చదవండి: డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే 27 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా విఫలం.. ఎట్టకేలకు -
బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్‌ను ఫ్రాంక్ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్‌ను కూడా ఫ్రాంక్ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ చేయాల్సింది మరిచి అంపైర్ ప్యాంట్‌ను లాగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన లంకాషైర్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రిస్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్ నవ్వుతూ అంపైర్‌కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్ ప్రాంక్'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్ ప్రాంక్ చేయడం ఏమో గాని అంపైర్ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్ చేశారు. @ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. 😂😂😂 pic.twitter.com/oF2qWeZbXk — Tino Hallerenko (@tinohalleron) August 27, 2022 చదవండి: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్ -
అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ
క్రికెట్లో అంపైర్ల పాత్ర కీలకమైనది. అది ఫీల్డ్ అంపైర్లు కావొచ్చు.. థర్డ్ అంపైర్ కావొచ్చు. అంపైర్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆటగాళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది. అంపైర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకోవడానికి ఇప్పుడంటే డీఆర్ఎస్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది. కానీ డీఆర్ఎస్ లేనప్పుడు అంపైర్‌దే కీలక నిర్ణయం.రనౌట్, స్టంపింగ్ మినహా మిగతా ఎలాంటి నిర్ణయాలైనా అంపైర్ తీర్పు ఫైనల్‌గా ఉంటుంది. కొన్నిసార్లు ఔట్ కాకపోయినప్పటికి.. అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాట్స్మెన్లు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి అవి మేలుచేస్తే.. కొన్నిసార్లు కీడు చేశాయి. తప్పుడు అంపైరింగ్ వల్ల ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్లతో గొడవకు కూడా దిగిన సందర్బాలు కోకొల్లలు. డీఆర్ఎస్ రూల్ వచ్చినప్పటికి.. ఇప్పటికీ ఫీల్డ్ అంపైర్లకే సర్వాధికారాలు ఉంటాయి. థర్డ్ అంపైర్ ఔట్ కాదని ప్రకటించినా.. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇస్తే బ్యాటర్ వెనుదిరగాల్సిందే. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్ సహా బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్ సహా ఇతర ప్రైవేట్ లీగ్స్‌లో చాలానే చోటుచేసుకుంటున్నాయి. కాగా క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారత్‌లోనూ అంపైరింగ్ వ్యవస్థ ఎప్పటిలాగే ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండడంతో బీసీసీఐ.. అంపైరింగ్ స్థాయిని పెంచేందుకు చర్చలు తీసుకోవడం మొదలెట్టింది. కొత్త అంపైర్లను తీసుకునే నియామక ప్రక్రియలో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని భావించింది. అందుకే గ్రూప్-డి అంపైరింగ్ నియమాకాల కోసం (మహిళలు, జూనియర్ మ్యాచులు) బీసీసీఐ రాత పరీక్ష నిర్వహించింది. 200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో క్వాలిఫికేషన్ మార్కులు 90. 200 మార్కుల్లో.. రాత పరీక్షకు 100 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకి 35 మార్కులు, వీడియో ఇంటర్వ్యూకి 35 మార్కులు ఉంటాయి. ఫిజికల్ టెస్టుకి మిగిలిన 30 మార్కులు ఉంటాయి. అయితే అంపైర్ల నియామకాల కోసం బీసీసీఐ నిర్వహించిన రాతపరీక్షలో కొన్ని పిచ్చిప్రశ్నలతో అభ్యర్థులను విసిగించింది. రాత పరీక్షలో ప్రశ్నలన్నీ కఠినంగా ఉన్నప్పటికి.. కొన్ని మాత్రం వింతగా ఉండడంతో ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి కొన్ని ప్రశ్నలు మీకోసం.. చదివేయండి. ►పెవిలియన్‌లో ఫ్లడ్ లైట్స్‌తో పాటు స్టేడియం స్టాండ్స్ నీడ పడడం సహజం. అలాగే ఫీల్డర్ నీడ కూడా పిచ్‌పై పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటర్, అంపైర్‌కి ఫిర్యాదు చేస్తే... ఏం చేస్తారు? ►బౌలర్ గాయపడి చేతికి బ్యాండేజీ కట్టుకున్నాడు. అది నిజమైనది కాదని, మీరు దాన్ని పీకేశారు. అప్పుడు రక్తస్రావం అయ్యింది. మీరేం చేస్తారు? అతనితో బౌలింగ్ చేయనిస్తారా? ►షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలా ఫీల్డర్ హెల్మెట్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి ఇరుక్కుని, దాన్ని ఫీల్డర్ క్యాచ్‌గా పట్టుకుంటే అది ఔట్‌గా పరిగణిస్తారా? పైన చెప్పుకున్నవి కేవలం సాంపుల్.. ఇలాంటి వింత ప్రశ్నలు మరో 37 ఉన్నాయి. గత నెల అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 140 మంది హాజరయితే పరీక్ష రాయగా.. అందులో నుంచి ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయనున్నారు.'' ఇది కేవలం క్రికెట్ రూల్స్ గురించి మాత్రమే కాదు. భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక అంపైర్ సమయోచితంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడనేది ముఖ్యం. అది తెలుసుకునేందుకు ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాం'' అని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. -
వైడ్ ఇచ్చినా పట్టించుకోలేదు.. మూల్యం చెల్లించుకున్నాడు
క్రికెట్లో అంపైర్లు చేసే తప్పిదాలు కొన్నిసార్లు నష్టం కలిగిస్తే.. ఒక్కోసారి మేలు చేస్తాయి. అంపైర్లు తాము ఇచ్చే తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలైనప్పుడు వచ్చే విమర్శలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక బౌలర్.. బ్యాట్స్‌మన్ ఎవరైనా సరే అంతిమంగా ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సిగ్నల్‌కు కట్టుబడాల్సిందే. తాజాగా విలేజ్ క్రికెట్లో అంపైర్ నిర్ణయం మాత్రం నవ్వులు పూయించింది. అంపైర్ చర్య కంటే బ్యాటర్ చేసిన పని మరింత నవ్వు తెప్పించింది. విషయంలోకి వెళితే.. బౌలర్ లెగ్‌సైడ్ అవతల బంతి వేయడం.. బంతి బ్యాటర్ వద్దకు చేరకముందే అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. అయితే క్రీజులో ఉన్న బ్యాటర్ మాత్రం కనీసం అంపైర్ ఇచ్చిన సిగ్నల్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో సదరు బ్యాటర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అంపైర్ ఇచ్చిన వైడ్ సిగ్నల్ చూసి బ్యాటర్ ఆగిపోయి ఉంటే బాగుండేది.. అనవసరంగా గెలికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ షేర్ చేసింది. కాగా బ్యాటర్ చర్యను ట్రోల్ చేస్తూ క్రికెట్ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Umpire already signalling a wide… OUT caught 🤣🤣🤣 pic.twitter.com/FWLpbTspUG — England’s Barmy Army (@TheBarmyArmy) August 1, 2022 చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా -
కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
న్యూజిలాండ్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా జూలై 12న(మంగళవారం) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే అదే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కివీస్ సీమర్ బ్లెయిర్ టిక్నర్ గుడ్‌లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. క్రీజులో ఉన్న సిమీ సింగ్ థర్డ్‌మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ టాప్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్ పాల్ రెనాల్డ్స్ మొదట ఔట్ అంటూ వేలెత్తాడు. అయితే మరుక్షణమే ఔట్ కాదంటూ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. అంపైర్ నిర్ణయంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. వెంటనే టామ్ లాథమ్ ఎందుకు ఔట్ కాదంటూ అంపైర్ వద్దకు వచ్చాడు. కాగా టిక్నర్ బంతి విడుదల చేయడానికి ముందు అతని టవల్ పిచ్‌పై పడింది. ఇది నిబంధనలకు విరుద్దమని.. ఈ చర్య వల్ల బ్యాట్స్‌మన్ ఏకాగ్రత దెబ్బతిని ఔటయ్యే ప్రమాదం ఉందని.. అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డెడ్‌బాల్‌గా ప్రకటించినట్లు తెలిపాడు. దీంతో లాథమ్ అసలు టవల్ వల్ల బ్యాటర్ ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగలేదని వివరించినప్పటికి పాల్ రెనాల్డ్స్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. ఇక చేసేదేం లేక టామ్ లాథమ్ నిరాశగా వెనుదిరిగాడు. అలా ఔట్ నుంచి బయటపడ్డ సిమీ సింగ్ 25 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. మరి క్రికెట్లో చట్టాలు అమలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఏం చెబుతుందంటే.. ►ఎంసీసీ లా ఆఫ్ క్రికెట్ ప్రకారం లా 20.4.2.6 కింద ఏవైనా శబ్దాలు.. ఏదైనా కదలిక.. ఇంకా ఇతరత్రా చర్యలు స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఫీల్డ్ అంపైర్‌కు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించే అధికారం ఉంటుంది. ఇది మ్యాచ్ జరుగుతున్న మైదానంలో కావొచ్చు.. లేదా మైదానం బయట ప్రేక్షకుల స్టాండ్స్‌లో జరిగినా కూడా అంపైర్ డెడ్‌బాల్‌గా పరిగణిస్తాడు. ►లా 20.4.2.7 ప్రకారం స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ దృష్టి మరల్చడానికి లా 41.4 (ఉద్దేశపూర్వక ప్రయత్నం) లేదా లా 41.5 (ఉద్దేశపూర్వకంగా మోసం లేదా బ్యాటర్‌ను అడ్డుకోవడం) కిందకు వస్తుంది. టిక్నర్ తన తప్పు లేకున్నప్పటికి అతని టవల్ బంతి విడవడానికి ముందే పిచ్‌పై పడడంతో అంపైర్ పాల్ రెనాల్డ్స్ పై రెండు నిబంధన ప్రకారం డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. pic.twitter.com/lmFW1uEnwr — ParthJindalClub (@ClubJindal) July 13, 2022 -
బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా?
టి20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్, వార్విక్ షైర్ మధ్య మ్యాచ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ చేసిన తప్పుకు ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ జట్టు తప్పు చేస్తే పీల్డ్ అంపైర్‌కు వెంటనే యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే క్రికెట్ పుస్తకాలు మాత్రం అంపైర్‌కు ఆ హక్కు ఉంటుందని పేర్కొంటున్నాయి. క్రికెట్ పుస్తకాల్లోని లా 41.5 నిబంధనలు ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. ఒక బౌలర్ ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను గాయపరిస్తే అతనితో పాటు జట్టుపై ఫీల్డ్ అంపైర్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చనేది పరిశీలిద్దాం లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టులోని ఒక ఫీల్డర్.. బ్యాటర్ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్ అంపైర్ లేదా లెగ్ అంపైర్‌లో ఎవరో ఒకరు.. పీల్డర్ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్ లేదా బౌలర్ తప్పు ఉందని తేలితే.. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే బౌలింగ్ జట్టుకు వార్నింగ్ ఇస్తూ డెడ్ బాల్‌గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్‌కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్‌బాల్‌గా పరిగణించి.. బ్యాటర్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు. లా 45.5.5: ఫీల్డర్ లేదా బౌలర్.. బ్యాటర్లతో ఫిజికల్‌గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్ తీసుకోవాలి లా 45.5.6: బౌలింగ్ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్ అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు వివరిస్తారు. లా 45.5.7: బౌలర్ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్‌బాల్‌గా కౌంట్ చేస్తారు. లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు. లా 45.5.9: స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం. లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్‌లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్ జట్టుపై ఏ యాక్షన్ తీసుకున్నారనేది వివరించాలి. -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్‌వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్‌వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్‌వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
ఫీల్డ్ అంపైర్‌ను డైలమాలో పడేసిన ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022 సీజన్లో ఆటగాళ్ల కంటే అంపైర్లే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్ శర్మ ఔట్ విషయంలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా మాత్రం ఫీల్డ్ అంపైర్ ఔట్ సిగ్నల్ ఇవ్వడంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. గురువారం ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆరో ఓవర్ సమర్జిత్ సింగ్ వేశాడు. ఆ ఓవర్లో ఒక బంతిని సమర్జిత్ బ్యూటిఫుల్ ఇన్‌స్వింగర్ వేయగా.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఎడ్జ్‌ను దాటుతూ కీపర్ ధోని చేతుల్లో పడింది. అయితే బ్యాట్‌కు తాకిన శబ్ధం వినిపించడంతో ధోని అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ కాస్త డైలమాలో పడి మొదట వైడ్ అనుకొని వైడ్ సిగ్నల్ ఇవ్వబోతూ వెంటనే యాంగిల్ మార్చి ఔట్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది.కెప్టెన్ ఎమ్మెస్ ధోని (33 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడగా, మిగతావారంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానియెల్ స్యామ్స్ (3/16) చెన్నైని దెబ్బ తీయగా... కార్తికేయ, మెరిడిత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. తిలక్ వర్మ (32 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. చదవండి: IPL 2022: స్టేడియంలో పవర్ కట్.. నో రివ్యూ.. పాపం కాన్వే..! #CSKvsMI #IPL2022 pic.twitter.com/MLzPnMpibH — Subuhi S (@sportsgeek090) May 12, 2022 -
డికాక్ నిజాయితీని మెచ్చుకొని తీరాల్సిందే!
డీఆర్ఎస్ రూల్ వచ్చాకా ఔట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాటింగ్ జట్టుకు.. బౌలింగ్ జట్టుకు ఔట్‌పై ఏ మాత్రం సందేహం ఉన్నా వెంటనే రివ్యూకు వెళ్లిపోతున్నారు. కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా బ్యాట్స్‌మన్ తనంతట తానే క్రీజు విడిచి వెళ్లడం అరుదుగా చూస్తున్నాం. తాజాగా ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో అలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందీప్ శర్మ వేశాడు. ఆ ఓవర్లో సందీప్ వేసిన ఒక బంతి డికాక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ జితేశ్ చేతిలో పడింది. పంజాబ్ ఆటగాళ్లు ఔట్‌కు అప్పీల్ చేసినప్పటికి ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే డికాక్ మాత్రం తాను ఔట్ అంటూ క్రీజు వీడాడు. ఈ నేపథ్యంలో పెవిలియన్ వెళ్తున్న డికాక్ నిజాయితీని సందీప్ శర్మ మెచ్చుకుంటూ అతని భుజాన్ని తట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Venkatesh Iyer: అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్.. ఎందుకిలా! pic.twitter.com/tzk1o22hAf — Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022 -
ఇంత దారుణమా.. ఏ లెక్కన ఔటిచ్చారో చెప్పండి!
ఈ మధ్య కాలంలో క్రికెట్లో ఫీల్డ్ అంపైర్లు అనవసర తప్పిదాలు ఎక్కువగా చేస్తున్నారు. ఫలితంగా బ్యాట్స్‌మెన్ మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా కౌంటీ క్రికెట్లో అంపైర్ చెత్త నిర్ణయానికి బ్యాట్స్‌మన్ బలవ్వాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. కెంట్, హంప్‌షైర్ మధ్య ఆదివారం కౌంటీ మ్యాచ్ జరిగింది. కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ క్రీజులో ఉన్నాడు. హంప్‌షైర్ బౌలర్ ఫెలిక్స్ ఆర్గన్ వేసిన బంతిని అడ్డుకునే క్రమంలో జోర్డాన్ తన కాలిని ఆఫ్‌స్టంప్ అవతల అడ్డుపెట్టాడు. అతని కాలికి తగిలి బంతి గాల్లోకి లేచి ఫీల్డర్ చేతిలో పడింది. అది క్లియర్ ఔట్ కాదని తెలుసు.. అయినా ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. పోని ఎల్బీ అనుకుందామంటే అసలు బంతి ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా వెళుతుంది. మరి ఏ లెక్కన అంపైర్ ఔట్ ఇచ్చాడనేది అర్థం కాని విషయం. అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న జోర్డాన్ కాక్స్ కొన్ని సెకన్ల పాటు క్రీజులో అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్డ్ అంపైర్‌ను ట్రోల్ చేశారు. ''చెత్త అంపైరింగ్.. మరి ఇంత దారుణమా.. అసలు ఇది ఏ లెక్కన ఔట్ అనేది అంపైర్ చెప్పాల్సిందే..'' అంటూ కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్‌లు తప్పుడు నిర్ణయం ఇచ్చిన అంపైర్‌కు తమదైన శైలిలో చురకలంటించారు. ఇక ఐస్లాండ్ క్రికెట్ కూడా తమదైన శైలిలో ట్రోల్ చేశారు.'' ఐపీఎల్‌లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అంపైర్లను మార్చాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ తప్పిదాలు కౌంటీ క్రికెట్లో జరుగుతున్నాయి. మా దగ్గర ట్రెయిన్ అయిన మంచి అంపైర్లను ఐపీఎల్ కంటే ముందుగా కౌంటీలకు పంపించాలి'' అంటూ పేర్కొంది. మొన్నటికి మొన్న ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఒక నో బాల్ వ్యవహారం ఎంతటి హైడ్రామా సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత క్లియర్‌గా నోబాల్ అని తెలుస్తున్నప్పటికి ఫీల్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పిలవడం సిల్లీగా అనిపించినా అతని కోపాన్ని చూపించింది. ఆ తర్వాత అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన తెలిపిన పంత్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, శార్దూల్ ఠాకూర్లపై ఐపీఎల్ మేనేజ్మెంట్ కఠిన చర్యలు తీసుకుంది. అంతకముందు ఆర్సీబీ సీనియర్ ఆటగాడు కోహ్లి ఎల్బీ విషయంలోనూ థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీసింది. చదవండి: Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్ You're the umpire. Are you giving this out? 👀#LVCountyChamp pic.twitter.com/ec4fwFJOAS — LV= Insurance County Championship (@CountyChamp) April 24, 2022 -
అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో!
ఐపీఎల్ 2022లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే స్టోయినిస్ క్రీజులో ఉన్నంతవరకు మ్యాచ్ లక్నోవైపే మొగ్గు చూపింది. ఎందుకంటే స్టోయినిస్ క్రీజులో ఉన్నప్పడు లక్నో విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు కావాలి. స్టోయినిస్‌తో పాటు జాసన్ హోల్డర్ క్రీజులో ఉండడంతో విజయంపై ఆశలు బలంగా ఉన్నాయి. ఈ దశలో ఒక అంపైర్ ఒక బంతిని వైడ్ బాల్‌గా పరిగణించకపోవడంతో స్టోయినిస్ తన ఫోకస్‌ను కోల్పోయి వికెట్ పోగొట్టుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ జోష్ హాజిల్‌వుడ్ వేశాడు. హాజిల్‌వుడ్ వేసిన ఓవర్ తొలి బంతి ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్లింది. అయితే అంపైర్ మాత్రం వైడ్ ఇవ్వలేదు. దీంతో వైడ్ ఇవ్వకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టోయినిస్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఫోకస్ కోల్పోయిన స్టోయినిస్ హాజిల్‌వుడ్ వేసిన తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో కోపంతో ఊగిపోయిన స్టోయినిస్ అంపైర్‌ను సీరియస్‌గా చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే స్టోయినిస్ విషయంలో అంపైర్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తప్పుబట్టారు. బంతి అంత క్లియర్ ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తుంటే వైడ్ ఇవ్వకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఒకవేళ అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలిచేదేమో.. ఎవరికి తెలుసు'' అంటూ కామెంట్ చేశారు. అయితే మరికొందరు మాత్రం లక్నో మేనేజ్మెంట్ను తప్పుబట్టారు. చేజింగ్ సమయంలో దాటిగా ఆడే స్టోయినిస్ లాంటి బ్యాటర్‌ను లేటుగా పంపించడమేంటని చురకలు అంటించారు. చదవండి: Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ IPL 2022: చహల్ హ్యాట్రిక్.. ఆ పోజుతో ప్రతీకారం తీర్చుకున్నాడా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Marcus Stoinis adding some extra colorful vocabulary to this night of IPL action. pic.twitter.com/vGf7d2oIFp — Peter Della Penna (@PeterDellaPenna) April 19, 2022 -
అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 2022లో సూపర్ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్ మెరుపు బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. భారీ సిక్సర్లు అవలీలగా బాదే లివింగ్‌స్టోన్ తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ 150 పరుగులు మార్క్ సాధించిందంటే అదంతా లివింగ్‌స్టోన్ ఇన్నింగ్స్ కారణం అని చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిపై అభ్యంతరం తెలిపిన లివింగ్‌స్టోన్ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆ ఓవర్ మూడో బంతిని లివింగ్‌స్టోన్ భారీ సిక్స్‌గా మలిచాడు. అయితే తన తర్వాతి బంతిని బౌన్సర్ వేసి లివింగ్‌స్టోన్‌కు పంచ్ ఇచ్చాడు. అయితే ఫీల్డ్ అంపైర్ దానిని బౌన్సర్ అని హెచ్చరించలేదు. ఇది చూసిన లివింగ్‌స్టోన్.. అంపైర్ వద్దకు వెళ్లి.. బౌన్సర్ కదా వార్నింగ్ ఇవ్వరా అంటూ అంపైర్లను అడిగాడు. కానీ ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కోపంతో క్రీజులోకి వెళ్లిన లివింగ్‌స్టోన్ తన ఆగ్రహాన్ని ఉమ్రాన్‌పై చూపించాడు. దాదాపు అదే తరహాలో వేసిన ఫుల్‌టాస్ బంతిని బౌండరీ తరలించాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న షారుక్ ఖాన్ కిందకు వంగడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాతి లివింగ్‌స్టోన్ షారుక్ ఖాన్ వద్దకు రాగా..''వామ్మో బతికిపోయా అన్నట్లుగా'' షారుక్ లుక్ ఇవ్వడం వైరల్‌గా మారింది. చదవండి: SRH vs PBKS: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ Something between Livingstone - Umpire pic.twitter.com/dMDNL9piPz — Big Cric Fan (@cric_big_fan) April 17, 2022 -
హాట్‌టాపిక్‌గా మారిన సిరాజ్, కుల్దీప్ చేష్టలు.. వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లు ఆడలేదు. అయినా కూడా ఈ ఇద్దరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. మ్యాచ్ ఆడకున్నా ఎందుకు వైరల్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. విషయంలోకి వెళితే.. యజ్వేంద్ర చహల్ లంక బ్యాట్స్‌మన్ చరిత్ అసలంకను ట్రాప్ చేసి ఎల్బీ చేశాడు. అయితే అసలంక డీఆర్ఎస్ కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను ఎక్కడ తగల్లేదు.. దీంతో అసలంక క్లీన్‌ఔట్ అని తేలింది. అంపైర్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో డ్రింక్స్ బాయ్ అవతారంలో గ్రౌండ్లోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అంపైర్ వెనుకాల నిలబడి ఔట్ సింబల్ చూపించాడు. ఆ తర్వాత కుల్దీప్ కూడా వచ్చి అంపైర్ వెనక నుంచి ఔట్ సిగ్నల్ చూపించాడు. ఇదే సమయంలో ఫీల్డ్ అంపైర్ కూడా ఔట్ అని వేలు చూపించడం కెమెరాలకు చిక్కింది. ఈ దశలో కుల్దీప్ అంపైర్‌ను గుద్దుకుంటూ వెళ్లడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు రెండో టి20 మ్యాచ్‌కు లక్నో నుంచి ధర్మశాలకు బస్సులో బయలుదేరిన సమయంలో సిరాజ్, కుల్దీప్లు షారుక్ ఖాన్ ఫేమస్ సాంగ్..'' కిస్కా హై ఏ తుమ్కో ఇంతిజర్ మైన్ హు నా'' పాట పాడారు. ఈ వీడియోనూ బీసీసీఐ రిలిజ్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను గెలుచుకుంది. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా ఆదివారం శ్రీలంకతో మూడో టి20 మ్యాచ్ ఆడనుంది. These guys 🤣#indvsl pic.twitter.com/3p4T9O4JUV — vel (@velappan) February 26, 2022 Match Day 🙌 Onto the 2nd @Paytm #INDvSL T20I at Dharamsala 📍#TeamIndia pic.twitter.com/iAGh8FDrwt — BCCI (@BCCI) February 26, 2022 -
కివీస్ చేతిలో టీమిండియా ఓటమికి 'ఆ అంపైరే' కారణం..!
Richard Kettleborough Is Umpire For India Vs New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో టీమిండియాను దగ్గరుండి మరీ ఓడించే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. కివీస్‌తో మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన రిచర్డ్.. కోహ్లి సేనను దగ్గరుండి ఓడించాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సమష్టిగా విఫలమై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. Richard Kettleborough again? 😭😭 pic.twitter.com/kelnRU7Hg9 — Moon child 🌙 (@notsodumb_) October 31, 2021 దీంతో ఈ ఓటమికి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోనే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కెటిల్‌బరో అంపైర్‌గా ఉండటం వల్లే టీమిండియా ఓడిందని ట్రోల్ చేస్తున్నారు. కొందరేమో రిచర్డ్ భారత జట్టు పాలిట శనిలా దాపురించాడని, అతను అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదని గుర్తు చేస్తున్నారు. కాగా, 2014 నుంచి ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన (భారత్ ఆడినవి) ప్రతి నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఆఖరికి రిచర్డ్ టీవీ అంపైర్‌గా ఉన్న మ్యాచ్‌ల్లో సైతం టీమిండియా విజయం సాధించలేకపోయింది. చదవండి: నాలుగు శతకాలు బాదిన ఆటగాడిని అలా ఎలా ఆడిస్తారు.. కోహ్లిని ఏకి పారేసిన గంభీర్ -
అంపైర్ ఔటివ్వలేదని వికెట్లు పీకి పాడేసిన స్టార్ క్రికెటర్..
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ సమాజం తలదించుకునే పని చేశాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో భాగంగా అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న షకీబ్ అల్ హసన్.. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి లోనై వికెట్లను తన్నడంతో పాటు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. Shit Shakib..! You cannot do this. YOU CANNOT DO THIS. #DhakaLeague It’s a shame. pic.twitter.com/WPlO1cByZZ — Saif Hasnat (@saifhasnat) June 11, 2021 వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహాని లిమిటెడ్ జట్టు ఆచితూచి ఆడుతున్న క్రమంలో, షకీబ్ ఐదో ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్లో తొలి రెండు బంతులను అబహాని బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అయితే, ఆ మరుసటి బంతి ముష్ఫికర్ బ్యాట్‌ను మిస్ అయి ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను గట్టిగా తన్నాడు. కాగా, షకీబ్ ఇదే మ్యాచ్‌లో మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు. One more... Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these... Chih... pic.twitter.com/iUDxbDHcXZ — Saif Hasnat (@saifhasnat) June 11, 2021 ప్రత్యర్ధి విజయం దాదాపు ఖరారైన సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతను.. మరోసారి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఇంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ, వికెట్లను పీకి పారేశాడు. కాగా, షకీబ్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా, స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన షకీబ్.. యువ క్రికెటర్లకు స్పూర్తిగా నిలవాల్సింది పోయి, ఇలా దురుసుగా ప్రవర్తించడం సిగ్గు చేటని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే షకీబ్ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు గురయ్యాడు. అయితే తాజా వీడియోలపై బంగ్లా క్రికట్ బోర్డు స్పందిస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా.. -
చారిత్రక మ్యాచ్‌కు అంపైర్లు ఖరారు.. జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న చారిత్రక పోరులో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్.. నాలుగో అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత అభిమానులు ఐరెన్ లెగ్గా పరిగణించే రిచర్డ్ కెటిల్ బరోకు కూడా స్థానం లభించింది. కెటిల్ బరోను థర్డ్ అంపైర్‌గా నియమిస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేయడంతో భారత అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. దీంతో అతన్ని అంపైర్‌గా తీసుకోవద్దని భారత అభిమానులు ఐసీసీని రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పరంపర కొనసాగింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది. అలాగే, 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆతర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. చివరిసారిగా ఆయన అంపైరింగ్ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్‌బరో.. ‘అయ్యో' అని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను భారత అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కాగా, భారత అభిమానులకు సానుకూలాంశం ఏంటంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తుండటం. చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు -
అందరి చర్చా.. ‘సాఫ్ట్’ సిగ్నల్ పైనే!
‘స్పష్టత లేదు’... లెక్క లేనన్ని సార్లు రీప్లేలు చూసిన తర్వాత మూడో అంపైర్ వీరేందర్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నాలుగో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను మలాన్ ఎలా పట్టాడో అందరికీ స్పష్టంగా కనిపించింది. బంతి గ్రౌండ్‌కు తాకిన విషయం టీవీల ముందు కూర్చున్న లక్షలాది మందికి, మైదానంలో ఉన్న ఆటగాళ్లకూ తెలుస్తోంది. కానీ అంపైర్‌కు మాత్రం అది నాటౌట్ అనిపించలేదు. అందుకే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సూర్యను అంపైర్ పెవిలియన్‌కు పంపించాడు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అలా ఎలా ఇచ్చాడు అనేది సగటు అభిమానికి అర్థం కాలేదు. అందుకు కారణం ‘సాఫ్ట్ సిగ్నల్’. ఇప్పుడు ఇదే ‘సాఫ్ట్’ నిర్ణయం క్రికెట్లో కొత్త చర్చకు దారి తీసింది. -సాక్షి క్రీడా విభాగం నాలుగో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ఉంటే ఎలా ఉండేది? సహజంగానే సూర్యకుమార్ అవుట్‌పై మరింత రచ్చ జరిగేది. ఓటమికి అంపైర్ తప్పుడు నిర్ణయమే కారణమని అన్ని వైపుల నుంచి మాజీలు, విశ్లేషకులు విరుచుకు పడేవారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. తనకు కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో నిబంధనలు మార్చాలంటూ సహజంగానే డిమాండ్లు ముందుకు వచ్చాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి... సూర్యకుమార్ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఒకవైపు థర్డ్ అంపైర్‌కు నివేదిస్తూనే మరోవైపు తన వైపుగా ‘అవుట్’ అంటూ వేలెత్తి చూపించేశాడు. ఇదే ‘సాఫ్ట్ సిగ్నల్’. అంటే తనకు ఎలా అనిపించిందనే విషయాన్ని అతను స్పష్టంగా చెప్పేశాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసిన తర్వాత ‘ఇన్‌కన్‌క్లూజివ్’ అంటూ స్పష్టంగా కనిపించడం లేదని తేల్చేశాడు. కాబట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే సరైందని ప్రకటించడంతో అది అవుట్‌గా తేలింది. ఈ రకంగా చూస్తే ఇద్దరూ అంపైర్లూ తమ పరిధిలో సరిగ్గానే విధులు నిర్వర్తించారు. అయితే రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో థర్డ్ అంపైర్‌ను తప్పు పట్టలేం. కానీ సూర్య విషయంలో అంతా స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ అలా తేల్చడమే వివాదం ముదరడానికి కారణమైంది. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ ఎందుకు స్పందించాలి, రనౌట్ల తరహాలో నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయవచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయం తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. దీనినే ఇప్పుడు తొలగించాలని అందరూ చెబుతున్నారు. ‘సాఫ్ట్’ వెనుక కారణమిదీ... సాంకేతికత ఎంత గొప్పగా ఉన్నా దానిని ఆపరేట్ చేసేది మానవమాత్రులే కాబట్టి 100 శాతం దానిపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా సరిగ్గా ఇదే కారణంతోనే. బాల్ ట్రాకింగ్ ఎలా చూపించినా అంపైర్ దృష్టిలో బంతి ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే ఆధారపడి నిర్ణయాలు ప్రకటిస్తాడు. సూర్యకుమార్‌లాంటి క్యాచ్‌ల విషయంలో కొన్నిసార్లు ఫీల్డర్ స్పందన, ముఖకవళికలు కూడా అంపైర్లను ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ఇలాంటి సందర్భాల్లో మహా నటుల్లా కనిపించే ఆటగాళ్లను పూర్తిగా నమ్మడం కూడా సరైంది కాదు. అయితే సగటు అభిమానికి అర్థంకాని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ‘ఒక మ్యాచ్‌కు కనీసం 10 కెమెరాలు వాడితే అందులో 2 సూపర్ స్లో మోషన్ కెమెరాలు ఉంటాయి. అవి కూడా పూర్తిగా స్పష్టతనివ్వలేవు. ఇప్పుడు వాడుతున్న కెమెరాలు 2డి మాత్రమే. అన్ని స్పష్టంగా కనిపించాలంటే 3డి కెమెరాలు వాడాలి. పైగా పెద్ద జట్లు మినహా అన్ని సిరీస్‌లకు ఇలాంటివి వాడటంలేదు. అబుదాబిలో జరుగుతున్న అఫ్గానిస్తాన్, జింబాబ్వే సిరీస్‌లో అసలు అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) లేదు. కాబట్టి అందరికీ ఒకే రూల్ అనే నిబంధన పని చేయదు’ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అంటే ఏదో ఒక దశలో అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే కాబట్టి ఆ అవకాశం ఫీల్డ్ అంపైర్‌కే ఇస్తున్నట్లు లెక్క. కీలక మ్యాచ్‌లలో ఇలాం టివి తుది ఫలితాన్ని మార్చేయవచ్చు. అసలు అంపైర్ అవుట్గానీ నాటౌట్కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా. అందరికీ అర్థమయ్యే తరహాలో ఒకే రకమైన నిబంధనలు రూపొందించాలి. –కోహ్లి, భారత కెప్టెన్ -
మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా?
మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ ఫీల్డ్ అంపై‘రాంగ్’ అవుతుంది. క్రికెట్లో ఇది సహజం. కానీ ఈ అంపైరింగ్‌ను సరిదిద్దే మూడో కన్నే (థర్డ్ అంపైర్) పొరపాటు చేస్తే... ఇంకో కన్ను ఉండదుగా! అయితే ఈ ఫలితం అనుభవించిన జట్టుకు మాత్రం శాపంగా మారుతుంది. చెన్నై రెండో టెస్టులో జరిగింది కూడా ఇదే. అందుకేనేమో రూట్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇది గ్రహించిన రిఫరీ నిబంధనల మేరకు రివ్యూను పునరుద్ధరించారు. వివరాల్లోకెళితే... ఇన్నింగ్స్ 75వ ఓవర్లో స్పిన్నర్ జాక్ లీచ్ డెలివరీ రహానే గ్లౌజులను తాకుతూ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతుల్లో పడింది. ఇంగ్లండ్ చేసిన ఈ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కెప్టెన్ రూట్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరీ కూడా పొరపాటు చేశారు. ఆయన రీప్లేలన్నీ ఎల్బీడబ్ల్యూ కోసం పరిశీలించారు. కానీ క్యాచ్ ఔట్ అనే సంగతి మరిచారు. ఎల్బీ కాకపోవడంతో నాటౌట్ ఇచ్చారు. దీనిపై అప్పుడే రూట్ గ్లౌజులను తాకుతూనే వెళ్లిందిగా అన్నట్లు సంజ్ఞలు చేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. మొత్తానికి రివ్యూ సఫలం కాకపోవడంతో ఒక రివ్యూను ఇంగ్లండ్ కోల్పోయింది. తదనంతర పరిశీలనలో కోల్పోయిన ఈ రివ్యూను పునరుద్ధరించారు. పిచ్ ఎలా ఉందో మాకు తెలుసు. ఇది బాగా టర్న్ అవుతుందని కూడా తెలుసు. అందుకే ప్రాక్టీస్ సెషన్లలో దీనికి తగ్గట్లే కసరత్తు చేశాం. ముఖ్యంగా టర్నింగ్ అయ్యే పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ చురుకైన ఆలోచనలతో ఆడాలి. ఇక్కడ నిష్క్రియా పరత్వం ఏ మాత్రం పనికిరాదు. మనముందు దీటైన బౌలర్ ఉంటే మనం తనకంటే దీటైన ఆట ఆడాలి. క్రీజులో ఉన్నప్పుడు షాట్ ఆడాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఆ షాట్‌నే బాదేస్తాం. అలాగే నేను స్వీప్ షాట్ ఆడదామనుకునే స్వీప్ చేశాను అంతే! దీనికి ఔటైనంత మాత్రాన భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. –రోహిత్ శర్మ, భారత ఓపెనర్ ఇంగ్లండ్కెప్టెన్ జో రూట్ -
అతన్ని ఎదుర్కోవడం కష్టమే
చెన్నై: ఇటీవల టీమిండియా పేస్ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్ గడ్డపై ఈసారి తమకు సీమ్ పిచ్‌లు ఎదురవుతాయని ఆశిస్తున్నట్లు ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ అన్నాడు. సాధారణంగా భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్లే ఉంటాయి. కానీ గత కొంత కాలంగా భారత సీమర్లు కూడా స్పిన్నర్లకు దీటుగా మ్యాచ్‌ల్ని భారత్ వైపు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బర్న్స్ మీడియా సమావేశంలో పిచ్‌ల సంగతి ప్రస్తావించాడు. శ్రీలంకపై 2–0తో గెలిచినప్పటికీ సొంతగడ్డపై భారత్‌తో పెను సవాళ్లు ఎదురవుతాయని చెప్పాడు. భారత శిబిరంలో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ సీమర్ అని, అతన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నాడు. 30 ఏళ్ల బర్న్స్ శ్రీలంకతో జరిగిన సిరీస్ ఆడలేదు. మరోవైపు భారత క్రికెటర్లందరూ తమ తొలి కోవిడ్ పరీక్షలో నెగిటివ్‌గా తేలారని ప్రకటించిన బీసీసీఐ... క్వారంటైన్లో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో ఉండేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఇంటర్నేషనల్ ప్యానెల్ అంపైర్లతో... భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఎలైట్ ప్యానెల్లో ఉన్న నితిన్ మీనన్‌తో పాటు తొలి టెస్టుకు అనిల్ చౌదరి, రెండో టెస్టుకు వీరేందర్ శర్మ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. అనిల్, వీరేందర్‌లు ఈ సిరీస్ ద్వారా టెస్టు అంపైర్లుగా అరంగేట్రం చేయనున్నారు. నిజానికి వీరిద్దరు ప్రస్తుతం ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానెల్లో మాత్రమే ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో తటస్థ అంపైర్లను నియమించడం కష్టంగా మారడంతో వివిధ సిరీస్‌ల సమయంలో స్థానిక అంపైర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. తొలి టెస్టుకు హైదరాబాద్‌కు చెందిన సి.శంషుద్దీన్ థర్డ్ అంపైర్‌గా పని చేస్తారు. చదవండి: అరంగేట్రంలోనే ‘5’ వికెట్లు పడగొట్టాడు! బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?