హాట్‌టాపిక్‌గా మారిన సిరాజ్‌, కుల్దీప్‌ చేష్టలు.. వీడియో వైరల్‌ | Mohammed Siraj-Kuldeep Yadav Signal Out Before Umpire Raise Finger | Sakshi
Sakshi News home page

Mohammed Siraj-Kuldeep Yadav: హాట్‌టాపిక్‌గా మారిన సిరాజ్‌, కుల్దీప్‌ చేష్టలు.. వీడియో వైరల్‌

Published Sun, Feb 27 2022 10:24 AM | Last Updated on Sun, Feb 27 2022 11:13 AM

Mohammed Siraj-Kuldeep Yadav Signal Out Before Umpire Raise Finger - Sakshi

శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌లు ఆడలేదు. అయినా కూడా ఈ ఇద్దరు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. మ్యాచ్‌ ఆడకున్నా ఎందుకు వైరల్‌ అయ్యారో ఇప్పుడు చూద్దాం. విషయంలోకి వెళితే.. యజ్వేంద్ర చహల్‌ లంక బ్యాట్స్‌మన్‌ చరిత్‌ అసలంకను ట్రాప్‌ చేసి ఎల్బీ చేశాడు. అయితే అసలంక డీఆర్‌ఎస్‌ కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను ఎక్కడ తగల్లేదు.. దీంతో అసలంక క్లీన్‌ఔట్‌ అని తేలింది.

అంపైర్‌ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో డ్రింక్స్‌ బాయ్‌ అవతారంలో గ్రౌండ్‌లోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ అంపైర్‌ వెనుకాల నిలబడి ఔట్‌ సింబల్‌ చూపించాడు.  ఆ తర్వాత కుల్దీప్‌ కూడా వచ్చి అంపైర్‌ వెనక నుంచి ఔట్‌ సిగ్నల్‌ చూపించాడు. ఇదే సమయంలో ఫీల్డ్‌ అంపైర్‌ కూడా ఔట్‌ అని వేలు చూపించడం కెమెరాలకు చిక్కింది. ఈ దశలో కుల్దీప్‌ అంపైర్‌ను గుద్దుకుంటూ వెళ్లడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతకముందు రెండో టి20 మ్యాచ్‌కు లక్నో నుంచి ధర్మశాలకు బస్సులో బయలుదేరిన సమయంలో సిరాజ్‌, కుల్దీప్‌లు షారుక్‌ ఖాన్‌ ఫేమస్‌ సాంగ్‌..'' కిస్‌కా హై ఏ తుమ్‌కో ఇంతిజర్‌ మైన్‌ హు నా'' పాట పాడారు. ఈ వీడియోనూ బీసీసీఐ రిలిజ్‌ చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను గెలుచుకుంది. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా ఆదివారం శ్రీలంకతో మూడో టి20 మ్యాచ్‌ ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement