Ind Vs SL: Rahul Chahar Lost His Control While Srilankan Batsman Reacted Cool And Calm - Sakshi
Sakshi News home page

Rahul Chahar: నోరు జారిన చహర్‌; కూల్‌గా డీల్‌ చేసిన లంక బ్యాట్స్‌మన్‌

Published Thu, Jul 29 2021 12:36 PM | Last Updated on Thu, Jul 29 2021 4:41 PM

IND Vs SL: Fans Shocked Rahul Chahar Fiery Send Off Wanindu Hasaranga - Sakshi

కొలంబో: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ వికెట్‌ తీసిన ఆనందంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై నోరు జారాడు. అయితే బ్యాట్స్‌మన్‌ మాత్రం చహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా బ్యాట్‌పై తన చేతిని కొడుతూ అతని బౌలింగ్‌ను ప్రశంసించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. లంక ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ను రాహుల్‌ చహర్‌ వేశాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతిని హసరంగ ఫోర్‌ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా బ్యాట్‌ ఎడ్జ్‌​కు తాకి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా వెళ్లింది. అక్కడే ఉ‍న్న భువనేశ్వర్‌ దానిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో వికెట్‌ తీశానన్న ఆనందంలో రాహుల్‌ చహర్‌ హసరంగ వైపు కోపంగా చూస్తూ ''వెళ్లు'' అన్నట్లుగా ఒక ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. కానీ హసరంగా చహర్‌ను లైట్‌ తీసుకొని తన బ్యాట్‌ను కొడుతూ ''మంచి డెలివరీ'' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చహర్‌ చర్యపై సీరియస్‌ కానీ హసరంగను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. '' చహర్‌ సహనం కోల్పోయినా.. నువ్వు కోల్పోలేదు.. క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన హసరంగకు కంగ్రాట్స్‌'' అంటూ కామెంట్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో చహర్‌ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమం అయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 40 పరుగలుతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement