aggressive behaviour
-
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. -
నోరు జారిన రాహుల్ చహర్; కూల్‌గా డీల్ చేసిన లంక బ్యాట్స్‌మన్
కొలంబో: టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్ తీసిన ఆనందంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై నోరు జారాడు. అయితే బ్యాట్స్‌మన్ మాత్రం చహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా బ్యాట్‌పై తన చేతిని కొడుతూ అతని బౌలింగ్‌ను ప్రశంసించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లంక ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హసరంగ ఫోర్ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న భువనేశ్వర్ దానిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో వికెట్ తీశానన్న ఆనందంలో రాహుల్ చహర్ హసరంగ వైపు కోపంగా చూస్తూ ''వెళ్లు'' అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ హసరంగా చహర్‌ను లైట్ తీసుకొని తన బ్యాట్‌ను కొడుతూ ''మంచి డెలివరీ'' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చహర్ చర్యపై సీరియస్ కానీ హసరంగను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. '' చహర్ సహనం కోల్పోయినా.. నువ్వు కోల్పోలేదు.. క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన హసరంగకు కంగ్రాట్స్'' అంటూ కామెంట్ చేశారు. ఈ మ్యాచ్‌లో చహర్ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 40 పరుగలుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది. Wanindu Hasaranga upholds the Spirit of the Game! 👏🏽 Tune into Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/QYC4z57UgI) now! 📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #WaninduHasaranga pic.twitter.com/0CwCaTkkAS — Sony Sports (@SonySportsIndia) July 28, 2021 -
‘అసలు కోహ్లి గురించి మీకేం తెలుసు?’
ముంబై: ఫీల్డ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని చూసిన వారంతా.. అతడికి చాలా కోపం అని.. ఎవరి మాట వినని వ్యక్తిగా అంచనా వేస్తుంటారు. ఫీల్డ్‌లో కోహ్లి బిహేవియర్ కూడా ఇలానే ఉంటుంది. దీని గురించి సోషల్ మీడియాలో నెటిజనులు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా కోహ్లి ఇలానే ఉంటాడా.. ఇంత దూకుడుగా వ్యవహరిస్తాడా అంటే కాదు అంటారు అతడి గురించి బాగా తెలిసిన కొందరు ఆటగాళ్లు. ఫీల్డ్ బయట కోహ్లి ఎంతో ప్రశాంతంగా ఉంటాడట.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తనది అంటారు. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్, సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి బయట ఎంతో వినయంగా ఉంటాడని తెలిపాడు. ఈ సందర్భంగా శరణ్‌దీప్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లిని చూస్తే.. ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో కోహ్లి ఎంతో వినయంగా ఉంటాడు. తను మంచి శ్రోత. సెలక్షన్ మీటింగ్స్‌లో చాలా శ్రద్ధగా అందరూ చెప్పేది వింటాడు. గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో కోహ్లి అందరూ చెప్పేది శ్రద్ధగా విని.. ఆ తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు’’ అన్నాడు ‘‘ఇక ఇంట్లో కోహ్లి ప్రవర్తనని చూసిన వారు అస్సలు నమ్మలేరు. అతడి ఇంట్లో పని వాళ్లు ఉండరు. కోహ్లి ఇంటికి భోజనానికి వెళ్తే అతడు, అతని భార్య దగ్గరుండి అతిథులకు భోజనం వడ్డిస్తారు. మనతో పాటే కూర్చుని మాట్లాడతాడు. మనతో కలిసి డిన్నర్‌కి బయటకు వస్తాడు. మిగతా ఆటగాళ్లు అందరూ కోహ్లిని ఎంతో గౌరవిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కోహ్లిది’’ అని చెప్పుకొచ్చాడు. "కెప్టెన్ అయినందున మైదానంలో అతను అలానే ఉండాలి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో కోహ్లి ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటాడు.. చాలా సార్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో అతడు దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు" అన్నాడు. కోహ్లి అధ్వర్యంలో భారత జట్టు బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే డే-నైట్ టెస్టులో పాల్గొంటుంది. చదవండి: ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి కోహ్లి.. నీ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి -
టీనేజ్ దూకుడుకు పచ్చని పరిసరాలే మందు!
న్యూయార్క్: చుట్టు పక్కల ప్రాంతాల్లో పచ్చదనం అధికంగా ఉంటే యువతలో దూకుడు స్వభావం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పార్కులు, గోల్ఫ్ కోర్టులు, పొలలా దగ్గర నివసించే యువతలో దూకుడుతనం 12 శాతం తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా 9 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారు చాలా దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ వయసులో వారిలో విడుదలయ్యే హర్మోన్లే దీనికి కారణం. వీరు నివసించే ప్రదేశాలకు వెయ్యి మీటర్ల దూరంలోని ప్రదేశాలు పచ్చదనంతో నిండి ఉంటే కేవలం మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మార్పు ఆడవారిలో, మగ వారిలో ఒకేరకంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాకి చెందిన పరిశోధకులు తెలిపారు. సర్వేలో భాగంగా 9 నుంచి 18 ఏళ్ల వయసున్న 1,287 మంది యువతి, యువకులను ఎంచుకున్నారు.