టీనేజ్ దూకుడుకు పచ్చని పరిసరాలే మందు! | Green space reduces aggressive behaviour in teens, suggest study | Sakshi
Sakshi News home page

టీనేజ్ దూకుడుకు పచ్చని పరిసరాలే మందు!

Published Wed, Jun 29 2016 10:20 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

టీనేజ్ దూకుడుకు పచ్చని పరిసరాలే మందు! - Sakshi

టీనేజ్ దూకుడుకు పచ్చని పరిసరాలే మందు!

న్యూయార్క్: చుట్టు పక్కల ప్రాంతాల్లో పచ్చదనం అధికంగా ఉంటే యువతలో దూకుడు స్వభావం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పార్కులు, గోల్ఫ్ కోర్టులు, పొలలా దగ్గర నివసించే యువతలో దూకుడుతనం 12 శాతం తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా 9 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారు చాలా దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు.

ఆ వయసులో వారిలో విడుదలయ్యే హర్మోన్లే దీనికి కారణం. వీరు నివసించే ప్రదేశాలకు వెయ్యి మీటర్ల దూరంలోని ప్రదేశాలు పచ్చదనంతో నిండి ఉంటే కేవలం మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మార్పు ఆడవారిలో, మగ వారిలో ఒకేరకంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాకి చెందిన పరిశోధకులు తెలిపారు. సర్వేలో భాగంగా 9 నుంచి 18 ఏళ్ల వయసున్న 1,287 మంది యువతి, యువకులను ఎంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement