యువత చూపు.. ఈ-సిగరెట్ల వైపు
న్యూయార్క్ : ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి అంతగా ప్రమాదం ఉండదని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. సాధారణ సిగరెట్లు, సిగార్లు, హుక్కాల లాగే అనుభూతి నివ్వటంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. సిగరెట్ల నుంచి వచ్చే నికోటిన్ ప్రభావం ఈ సిగరెట్ల నుంచి విడుదలవ్వదు. దీంతో యువత ఎక్కువగా ఈ సిగరెట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో విషయమేమంటే వీటి నుంచి ఆరోగ్య సమస్యలు అంతగా తలెత్తవని యువత అభిప్రాయపడుతున్నారని పరిశోధకుల సర్వేలో ఈ విషయం బయటపడింది.
ప్రతి ఏడాది ఈ సిగరెట్లు వాడకం యువతలో పెరిగిందని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ, లాస్ ఏంజిల్స్ కు చెందిన అడమ్ లెవెన్తల్, అతని సహోద్యోగులు వెల్లడించారు. 2,530 విద్యార్థులను పరిశీలించగా.. ధూమపానం ప్రారంభదశలో మండే పొగాకును వాడలేదని తేలింది. గత రెండేళ్లుగా నిర్వహించిన సర్వేలలో కూడా ఇదే విషయం వెల్లడైందని తెలిపారు. 222 మంది విద్యార్థులను పరిశీలించగా.. 2013లో ఈ సిగరెట్లు వాడేవారు, సాధారణ సిగరెట్లు వాడేవారి నిష్పత్తి 31:8 శాతాలుగా ఉందని, 2014లో వీరి నిష్పత్తి 25:9 శాతంగా ఉందని కాలిఫోర్నియా వర్సిటీ రీసెర్చ్ లో తేలింది. దీంతో ఈ సిగరెట్ల వినియోగం యువతలో మరీ ఎక్కువైందని తెలుస్తోంది.