University of Southern California
-
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
టీనేజ్ దూకుడుకు పచ్చని పరిసరాలే మందు!
న్యూయార్క్: చుట్టు పక్కల ప్రాంతాల్లో పచ్చదనం అధికంగా ఉంటే యువతలో దూకుడు స్వభావం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పార్కులు, గోల్ఫ్ కోర్టులు, పొలలా దగ్గర నివసించే యువతలో దూకుడుతనం 12 శాతం తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా 9 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారు చాలా దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ వయసులో వారిలో విడుదలయ్యే హర్మోన్లే దీనికి కారణం. వీరు నివసించే ప్రదేశాలకు వెయ్యి మీటర్ల దూరంలోని ప్రదేశాలు పచ్చదనంతో నిండి ఉంటే కేవలం మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మార్పు ఆడవారిలో, మగ వారిలో ఒకేరకంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాకి చెందిన పరిశోధకులు తెలిపారు. సర్వేలో భాగంగా 9 నుంచి 18 ఏళ్ల వయసున్న 1,287 మంది యువతి, యువకులను ఎంచుకున్నారు. -
యువత చూపు.. ఈ-సిగరెట్ల వైపు
న్యూయార్క్ : ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి అంతగా ప్రమాదం ఉండదని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. సాధారణ సిగరెట్లు, సిగార్లు, హుక్కాల లాగే అనుభూతి నివ్వటంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. సిగరెట్ల నుంచి వచ్చే నికోటిన్ ప్రభావం ఈ సిగరెట్ల నుంచి విడుదలవ్వదు. దీంతో యువత ఎక్కువగా ఈ సిగరెట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో విషయమేమంటే వీటి నుంచి ఆరోగ్య సమస్యలు అంతగా తలెత్తవని యువత అభిప్రాయపడుతున్నారని పరిశోధకుల సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రతి ఏడాది ఈ సిగరెట్లు వాడకం యువతలో పెరిగిందని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ, లాస్ ఏంజిల్స్ కు చెందిన అడమ్ లెవెన్తల్, అతని సహోద్యోగులు వెల్లడించారు. 2,530 విద్యార్థులను పరిశీలించగా.. ధూమపానం ప్రారంభదశలో మండే పొగాకును వాడలేదని తేలింది. గత రెండేళ్లుగా నిర్వహించిన సర్వేలలో కూడా ఇదే విషయం వెల్లడైందని తెలిపారు. 222 మంది విద్యార్థులను పరిశీలించగా.. 2013లో ఈ సిగరెట్లు వాడేవారు, సాధారణ సిగరెట్లు వాడేవారి నిష్పత్తి 31:8 శాతాలుగా ఉందని, 2014లో వీరి నిష్పత్తి 25:9 శాతంగా ఉందని కాలిఫోర్నియా వర్సిటీ రీసెర్చ్ లో తేలింది. దీంతో ఈ సిగరెట్ల వినియోగం యువతలో మరీ ఎక్కువైందని తెలుస్తోంది.