
శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీలో అతని లోటు తెలియకుండా శ్రేయాస్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు. కాగా శ్రేయాస్ అయ్యర్ కొట్టిన ఒక సిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12 పరుగుల వరకు బౌండరీ లేకుండా ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయాస్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఒక్కసారిగా గేర్ మార్చాడు.
దాసున్ షనక బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాది మంచి రిథమ్‌లో కనిపించాడు. ఇక ఇన్నింగ్స్ 19వ ఓవర్లో చమిక కరుణరత్నే బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదిన అయ్యర్ ఆ తర్వాత కళ్లు చెదిరే సిక్సర్‌తో మెరిశాడు. కరుణరత్నే స్లో బాల్ వేయగా.. అయ్యర్ ఫ్రంట్‌ఫుట్ వచ్చి డీప్ మిడ్‌వికెట్ మీదుగా 90 మీటర్ల ఎత్తులో భారీ సిక్స్ కొట్టాడు. కాగా బంతి టైమింగ్ ఎలా ఉందంటే.. అయ్యర్ షాట్ కొట్టిన తర్వాత కనీసం బంతి వైపు తొంగిచూడలేదు. అతని షాట్‌పై అతనికి ఎంత నమ్మకమనేది దీనిని బట్టే తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి.
ఇక ఆ తర్వాత ఆఖరి ఓవర్లో మరో సిక్సర్ బాదిన అయ్యర్ ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్ 89, రోహిత్ శర్మ 42 పరుగులు చేయడంతో భారత్ 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమిండియా బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి 62 పరుగులతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య రెండో టి20 శనివారం(ఫిబ్రవరి 26న) ధర్మశాల వేదికగా జరగనుంది.
చదవండి: IND vs SL: విజయం సాధించినప్పటికి నిరాశలో రోహిత్.. కారణం?
Ravindra Jadeja: రీఎంట్రీ ఇచ్చాడు.. 'తగ్గేదేలే' అన్నాడు.. వీడియో వైరల్