Netizens Funny Trolls On Sri Lanka Pacer Lahiru Kumara Looklike Indian Youtuber - Sakshi
Sakshi News home page

Lahiru Kumara: లంక​ బౌలర్‌కు ఇండియన్‌ యూ ట్యూబర్‌తో సంబంధమేంటి?

Published Sun, Feb 27 2022 1:34 PM | Last Updated on Sun, Feb 27 2022 3:09 PM

Netizens Says Lanka Pacer Lahiru Kumara LookLike Famous Indian YouTuber - Sakshi

మనుషులు పోలిన మనుషులు ఉండడం సహజం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇదే వర్తిస్తుంది. ఉదాహరణకు భారత్‌కు చెందిన ఫేమస్‌ వీడియో క్రియేటర్స్‌ గౌరవ్‌ అరోరా, యష్‌ పురోహిత్‌లు ఒక యాంగిల్‌ నుంచి అచ్చం టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లిలాగే కనిపిస్తారు. యూట్యూబ్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లు చాలామంది వీరిద్దరిని కోహ్లి లుక్‌తోనే పోలుస్తారు. తాజాగా శ్రీలంక క్రికెటర్‌ లాహిరు కుమారాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 


టీమిండియాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో లాహిరు కుమారా ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ల వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు ఇషాన్‌ కిషన్‌ తలకు గాయం కావడానికి కారణం లాహిరు కుమారానే. కాగా టీమిండియా ఫ్యాన్స్‌ కుమారాను ఇండియన్‌ ఫేమస్‌ యూట్యూబర్‌ గౌరవ్‌ చౌదరీతో పోలుస్తున్నారు. గౌరవ్‌ చౌదరీకి టెక్నికల్‌ గురూజీ అని ముద్దుపేరు ఉంది. సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించిన వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. లంక క్రికెటర్‌ కుమారాకు సంబంధించి గుబురు గడ్డం.. పర్సనాలిటి, ముఖ కవలికలు కూడా అచ్చం గౌరవ్‌ లాగే ఉండడం విశేషం.

ఇంకేముంది కుమారాను గౌరవ్‌ చౌదరీతో పోలుస్తూ..  ఫ్యాన్స్‌ ఒక ఆట ఆడుకున్నారు. ''ఇండియాలో ఉన్న టెక్నికల్‌ గురు లంక క్రికెట్‌లో ఏం చేస్తున్నాడు... ధర్మశాలలో ప్రత్యక్షమైన టెక్నికల్‌ గురు.. లాహిరు కుమారా అతనికి ఇంకో రూపం.. టెక్నికల్‌ గురూజీ శ్రీలంక తరపున ఎందుకు ఆడుతున్నాడు.. టెక్నికల్‌ గురూజీ.. ప్లీజ్‌ ఇషాన్‌ కిషన్‌కు బౌన్సర్లు విసరడం ఆపేయండి'' అంటూ కామెంట్స్‌ చేశారు.  

చదవండి: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే

Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement