ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన టీమిండియా.. అతడిపై గంభీర్‌ ఫోకస్‌! | Coach Gambhir Suryakumar Led Team India Start First Training in Sri Lanka Video | Sakshi
Sakshi News home page

Ind vs SL: ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన టీమిండియా.. అతడిపై గంభీర్‌ ఫోకస్‌!

Published Tue, Jul 23 2024 8:55 PM | Last Updated on Tue, Jul 23 2024 9:02 PM

Coach Gambhir Suryakumar Led Team India Start First Training in Sri Lanka Video

శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. కొత్త కోచ్‌ గౌతం గంభీర్‌ మార్గ నిర్దేశనంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

కోచ్‌ గంభీర్‌, టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు హార్దిక్‌ పాండ్యా, శుబ్‌మన్‌ గిల్‌, సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, శివం దూబే  తదితర ఆటగాళ్లంతా సోమవారమే కొలంబోకు చేరుకున్నారు. వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తదితరులు కాస్త ఆలస్యంగా లంకకు వెళ్లనున్నారు.

కాగా శనివారం(జూలై 27) టీ20 మ్యాచ్‌తో శ్రీలంక- టీమిండియా సిరీస్‌కు తెరలేవనుంది. ఇందుకోసం సూర్య సేన మంగళవారం నుంచే నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. కాండీలో జరుగుతున్న ఈ సెషన్‌ను గౌతం గంభీర్‌ దగ్గరుండి మరీ వీక్షించాడు. వ్యక్తిగతంగా ఒక్కో ఆటగాడి దగ్గరకు వెళ్లి మరీ సూచనలు, సలహాలు ఇచ్చాడు. సంజూ శాంసన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాడు.

 

ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కోచ్‌ అవతారంలో గౌతీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గంభీర్‌ హయాంలో భారత క్రికెట్‌ మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని మురిసిపోతున్నారు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ను టీమిండియా శిక్షకుడిగా నియమించింది బీసీసీఐ. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా ఈ ఏడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతీకి భారత జట్టు బాధ్యతలు అప్పజెప్పింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement