Wazhma Ayoubi celebrates Afghanistan's historic series win over Pakistan - Sakshi
Sakshi News home page

PAK Vs AFG: చారిత్రాత్మక విజయం.. ఆఫ్గన్‌ సుందరి మళ్లీ వచ్చేసింది

Published Wed, Mar 29 2023 1:52 PM | Last Updated on Wed, Mar 29 2023 2:50 PM

Wazhma Ayoubi Celebrates Afghanistan Historic Series Win Over Pakistan - Sakshi

పాకిస్తాన్‌తో జరిగిన టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌ 2-1 తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. టి20ల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గన్‌కు ఇదే తొలి టి20 సిరీస్‌ విజయం కావడం విశేషం. దీంతో అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ ప్రేమికులు చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందులో ఆఫ్గన్‌ సూపర్‌ ఫ్యాన్‌.. అందాల సుందరి వజ్మా ఆయూబి కూడా ఉంది. 

వజ్మా అయూబీ అనగానే టక్కున గుర్తొచ్చేది ఆసియా కప్‌ 2022.అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు వజ్మా అయూబీ  హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్‌ చూసినవారు కూడా ఫిదా అయ్యారు. అంతగా కుర్రకారు మనసులు దోచుకుంది. అఫ్గానిస్తాన్‌ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్‌ వద్ద అఫ్గాన్‌ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందరంతో కట్టిపడేసింది.

కాగా మ్యాచ్‌ గెలిచిన తర్వాత అఫ్గానిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ''కంగ్రాట్స్‌ బ్లూ టైగర్స్‌'' అంటూ వాజ్మా ఆయూబీ తన ట్విటర్‌లో పేర్కొంది. అప్పట్లో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌ సందర్భంగా వజ్మా అయూబీ మరోసారి ప్రత్యక్షం అయింది.

తమ దేశం చారిత్రక సిరీస్‌ విజయాన్ని అందుకోవడంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సిరీస్‌ విజయం అనంతరం అప్గానిస్తాన్‌ జెండా పట్టుకొని గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోషల్‌ యాక్టివిస్ట్‌ అయిన వజ్మా అయూబీ దుబాయ్‌లోనే నివాసం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యుర్‌గా రాణిస్తున్న ఈమెకు లమన్‌ పేరుతో సొంతంగా ఫ్యాషన్‌ లేబుల్‌ కంపెనీ నడుపుతోంది.

చదవండి: Asia Cup IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌.. కళ్లన్నీ ఆ యువతిపైనే!

రిషబ్‌ పంత్‌ స్థానంలో బెంగాల్‌ సంచలనం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement