Rahul Chahar
-
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్‌కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్ ఇన్నింగ్స్‌తో వింటేజ్ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.కానీ పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్ అయ్యాడు.నిజానికి రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అనూహ్యంగా స్పిన్నర్ రాహుల్ చహర్‌ను బరిలోకి దించాడు.అప్పటికి పేసర్ హర్షల్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఉన్నా.. చహర్ వైపే మొగ్గు చూపి సామ్ కరన్ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్ అలీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్ సారథి సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్ చహర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. The artist performing his art 🎨 😎Chepauk roars to MS Dhoni's fireworks 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/WE7AnyBR8e— IndianPremierLeague (@IPL) May 1, 2024 -
శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన చాహర్ బ్రదర్స్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌ల్లో మయాంక్ అగర్వాల్ (157), దేవ్‌దత్ పడిక్కల్ (71), యుజ్వేంద్ర చహల్ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్ ప్లేయర్స్ దీపక్ హుడా (114, 1/5), దీపక్ చాహర్ (66 నాటౌట్), రాహుల్ చాహర్ (5/34) రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. దీపక్ హుడా, మానవ్ సుథర్ (41), దీపక్ చాహర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో నబమ్ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్ సెరా 2, అక్షయ్ జైన్, తెచి డోరియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్.. రాహుల్ చాహర్, మానవ్ సుథర్ (10-2-36-2), ఖలీల్ అహ్మద్ (7.2-0-44-2), దీపక్ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సచిన్ శర్మ (63), అప్రమేయ జైస్వాల్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బోణీ.. జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్ రెడ్డి (2/28), తనయ్ త్యాగరాజన్ (2/24) రాణించారు. అనంతరం హైదరాబాద్ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్ కెపె్టన్ గౌవ్లత్ రాహుల్ సింగ్ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఆంధ్ర పరాజయం.. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ (78 నాటౌట్; 11 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
LSG VS PBKS: ఆ ఒక్కడే తప్పించుకున్నాడు.. అప్పుడు భువీ..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం విధితమే. ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా లక్నో బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ (257) నమోదు చేశారు. కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) విధ్వంసం ధాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే లక్నో బ్యాటర్ల బారి నుంచి ఒక్క పంజాబ్ బౌలర్ మాత్రం తప్పించుకున్నాడు. అతడే రాహుల్ చాహర్.ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా, రాహుల్ చాహర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లను అద్భుతంగా బౌల్ చేసిన చాహర్.. 29 పరుగులు మాత్రమే ఇచ్చి, శివాలెత్తి ఉన్న లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మరోవైపు మిగతా పంజాబ్ బౌలర్లు లక్నో బ్యాటర్ల ఊచకోతను విలవిలలాడిపోయారు. గుర్నూర్ సింగ్ బ్రార్ 3 ఓవర్లలో 42 పరుగులు, అర్షదీప్ సింగ్.. తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత చెత్త గణాంకాలు (4-0-54-1), రబాడ 4 ఓవర్లలో 52 పరుగులు, సికందర్ రజా ఒక ఓవర్లో 17, సామ్ కర్రన్ 3 ఓవర్లలో 38, లివింగ్‌స్టోన్ ఒక ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నారు. ఛేదనలో పంజాబ్ ఆటగాళ్ల ధాటికి లక్నో బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. యశ్ ఠాకూర్ (4/37), నవీన్ ఉల్ హాక్ (3/30) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్ధి ఓటమిని ఖరారు చేశారు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, 2 కీలక వికెట్లు (అథర్వ టైడే (66), లివింగ్‌స్టోన్ (23)) తీశాడు. అప్పట్లో భువీ కూడా ఇంతే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ (ఆర్సీబీ- 263) నమోదైన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఓ బౌలర్ ఆర్సీబీ బౌలర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాటి మ్యాచ్‌లో పూణే బౌలర్లంతా విచ్చలవిడిగా పరుగులు సమర్పించుకుంటే.. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రం తాండవం చేస్తుండిన ఆర్సీబీ బ్యాటర్లను, ముఖ్యంగా అప్పటికే ఊగిపోతున్న క్రిస్ గేల్‌ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మిగతా బౌలర్లంతా 12 నుంచి 29 ఎకానమీ మధ్యలో పరుగులు సమర్పించుకున్నారు. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. అల్లు అర్జున్ను కలిసిన పంజాబ్ స్టార్ క్రికెటర్లు!
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకోపోతుంది. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ధావన్ సేన శనివారం నుంచి తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. పంజాబ్ క్రికెటర్లు రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలిశారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి వీరిద్దిరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ చాహర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక అతిథ్య ఎస్ఆర్హెచ్ జట్టు శనివారం హైదరాబాద్ చేరుకోనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. కాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియాతో చేరనున్న వాషింగ్టన్ సుందర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదలుకానున్న మొదటి టెస్ట్ కోసం టీమిండియా సెలెక్టర్లు నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ నలుగురు స్పిన్ బౌలర్లే కావడం విశేషం. సెలెక్టర్లు ఎంపిక చేసిన నలుగురిలో టీమిండియా పరిమిత ఓవర్ల ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, రాజస్థాన్ లెగ్ స్పిన్నర్, టీమిండియా బౌలర్ రాహుల్ చాహర్, తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ ఉన్నారు. ఈ నలుగురు స్పిన్నర్లు నాగ్‌పూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాతో రేపటి నుంచి కలుస్తారిన సెలెక్టర్లు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రకటించారు. ఆసీస్ బౌలర్లను, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైవిధ్యమైన స్పిన్నర్లు అవసరమనే ఉద్దేశంతో వీరిని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక జట్టులో నలుగురు స్పిన్నర్లు (కుల్దీప్, అశ్విన్, అక్షర్, జడేజా) ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు అదనంగా మరో నలుగురు స్పిన్నర్లను (నెట్ బౌలర్లు) ఎంపిక చేశారు. ఎందుకంటే ఆసీస్ స్పిన్ విభాగంలో (నాథన్ లయోన్ (ఆఫ్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్ (లెగ్ స్పిన్నర్), టాడ్ మర్ఫీ (ఆఫ్ స్పిన్నర్), ట్రవిస్ హెడ్ (ఆఫ్ స్పిన్నర్), అస్టన్ అగర్ (లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్)) ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు, ఓ లెగ్ స్పిన్నర్, ఓ లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఉన్నారు. వీరిని ఎదుర్కోవాలంటే అదే వాటం ఉన్న బౌలర్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని సెలెక్టర్లు ఈ ఎత్తుగడ వేశారు. భారత స్పిన్ విభాగంలో ఒక్క అశ్విన్ మినహా మిగతా ముగ్గురు లెఫ్ ఆర్మ్ బౌలర్లే కావడంతో ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుందని జట్టు కోచ్ సెలక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆసీస్ బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ల కంటే పేసర్ల (కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్) డామినేషనే అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్స్‌లో స్పిన్నర్లతో సమానంగా పేసర్లతో బౌలింగ్ చేయిస్తే, టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ బౌలర్.. ఫొటోలు
-
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ బౌలర్.. కాబోయే భార్యతో సందడి చేసిన చహర్
టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి ఇషాని జోహార్‌ను పెళ్లాడాడు. గోవాలో బుధవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. రాహుల్ కజిన్, టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ కాబోయే భార్యతో కలిసి రాగా.. శివమ్ మావి వంటి ఇతర కొద్ది మంది సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా బెంగళూరుకు చెందిన ఇషాని ఫ్యాషన్ డిజైనర్. గత కొన్నేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్న 22 ఏళ్ల రాహుల్ చహర్.. 2019లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ తర్వాత దాదాపు మూడేళ్లకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక శనివారం ఈ జంట రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాహుల్- ఇషాని మెహందీ, హల్దీ, పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పెళ్లైన అనంతరం.. ‘‘ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా’’ అంటూ మనసిచ్చిన నిచ్చెలిని భార్యగా చేసుకున్న రాహుల్ ఆమె చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కాగా రాజస్తాన్‌లో జన్మించిన రాహుల్ చహర్ 2021 టీమిండియా శ్రీలంక పర్యటన నేపథ్యంలో జట్టుకు ఎంపికై వన్డేల్లో అరంగేట్రంలో చేశాడు. ఆ సమయంలో ఆడిన ఏకైక వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున తరఫున 6 టీ20లు, ఓ వన్డే ఆడిన చహర్ మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా... ఐపీఎల్లో పుణే, ముంబై జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు రాహుల్‌ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పెళ్లి సందర్భంగా రాహుల్ దంపతులకు ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! View this post on Instagram A post shared by Rahul Chahar (@rdchahar1) View this post on Instagram A post shared by Rahul Chahar (@rdchahar1) -
గర్ల్ ఫ్రెండ్‌ను మనువాడబోతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్.. ఎప్పుడంటే..?
టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 9న గోవా వేదికగా తన ఇష్ట సఖి ఇషానిని రాహుల్ మనువాడబోతున్నాడు. 2019 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జోడీ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఒక్కటి కాబోతుంది. బెంగళూరుకు చెందిన ఇషాని ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తుండగా, రాహుల్ చాహర్.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికయ్యాడు. పంజాబ్ జట్టు రాహుల్‌ను రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గతేడాది శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు ఎంపికైన రాహుల్ చాహర్.. వన్డే అరంగేట్రంలో అదరగొట్టాడు. తనకు అవకాశం వచ్చిన ఏకైక వన్డేలో మూడు వికెట్లతో సత్తా చాటాడు. టీమిండియా తరఫున 6 టీ20లు, ఓ వన్డే ఆడిన చాహర్ 7 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో పూణే, ముంబై జట్లకు ఆడిన అతను 42 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. కాగా, రాహుల్ చాహర్, ఇషానిల వివాహానికి రాహుల్ కజిన్ బ్రదర్, టీమిండియా అప్ కమింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 12న బెంగళూరులో వీరి రిసెప్షన్ వేడుక జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Rahul Chahar (@rdchahar1) చదవండి: మటన్ రోల్స్ కోసం వెళ్లి రిస్క్‌లో పడిన విరాట్ కోహ్లి..! -
అతని కోసం ఆర్సీబీ పోటీ పడుతుంది.. కెప్టెన్‌గా అతనే సరైనోడు..
RCB will break the bank for Rahul Chahar in mega auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. కాగా రానున్న మెగా వేలంలో ఆర్సీబీ.. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తమ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను అంటిపెట్టుకోనందున అతడి స్దానంలో చహర్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు చోప్రా తెలిపాడు. “ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఆర్సీబీ కోనుగోలు చేయదు. మరో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను సొంతం చేసుకోవడానికి ఆర్సీబీ సిద్దంగా ఉంది. ఎందుకంటే వాళ్ల హోం గ్రౌండ్లో లెగ్ స్పిన్నర్లకు తప్ప మిగితా స్పిన్నర్లుకు అంతగా రికార్డులు లేవు. అయితే రవి బిష్ణోయ్ కూడా ఓ అవకాశంగా వాళ్లకి ఉండవచ్చు, కానీ నేను మాత్రం రాహుల్ చాహర్‌ని తీసుకుంటారని అని భావిస్తున్నాను" అని చోప్రా పేర్కొన్నాడు. ఇక కాబోయే ఆర్సీబీ కెప్టెన్ గురించి మాట్లాడూతూ... "విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆర్సీబీ రానున్న మెగా వేలంలో హోల్డర్ కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే అతడికి వెస్టిండీస్ జట్టుతో పాటు కరీబీయన్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అంతే కాకుండా అతడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని జట్లులో బాగా రాణిస్తున్నాడు" అని తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా తెలిపాడు. చదవండి: IPL 2021 Auction: ‘వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి’ -
టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే..
Rahul Chahar throws sunglasses in frustration: బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా భారత్-ఏ జట్టు, దక్షిణాఫ్రికా-ఏ జట్టు మధ్య నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత బౌలర్ రాహుల్ చహర్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 128వ వేసిన రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతి.. బ్యాటింగ్ చేస్తున్న క్యూషీలే ప్యాడ్లను తాకింది. అయితే వెంటనే ఎల్బీకు రాహుల్ అప్పీల్ చేయగా.. దానిని అంపైర్ తిరస్కరించాడు. దీంతో వెంటనే కోపంతో ఊగిపోయిన చహర్ తన సన్ గ్లాస్‌ను నేలకేసి కొట్టాడు. అంతేకాకుండా అంపైర్‌తో కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఆ తర్వాత కిందపడ్డ కళ్లజోడు పెట్టుకుని ఓవర్ పూర్తి చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏ 509 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే భారత బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్‌లో తిరిగి పోరాడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్ పాంచల్ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనున్న సంగతి తెలిసిందే. Rahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call. A double appeal and throwing his equipment. #SAAvINDA Footage credit - @SuperSportTV pic.twitter.com/TpXFqjB94y — Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021 చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
అశ్విన్‌ను ఆడించకుండా పెద్ద తప్పు చేశారు.. ఇప్పటికైనా
Sunil Gavaskar Says R Ashwin Must Play Vs Afghanistan Match T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అఫ్గన్‌తో మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించినా తప్పులేదని.. అశ్విన్‌ను మాత్రం కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్ చక్రవర్తిని అఫ్గాన్ బ్యాటర్స్ సులువుగా ఎదుర్కొనే అవకాశముంది. అందుకే అతని స్థానంలో రాహుల్ చహర్‌ను జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని తెలిపాడు. ఇక అశ్విన్, జడేజా, రాహుల్ చహర్‌లు స్పిన్ బాధ్యతలు తీసుకుంటే ఒక పేసర్‌ను తప్పించే అవకాశం ఉంటుందన్నాడు. ఒకవేళ హార్దిక్ బౌలింగ్ చేసే అవకాశం ఉంటే.. మహ్మద్ షమీ.. శార్దూల్ ఠాకూర్లలో ఎవర్నో ఒకర్ని తప్పించడం మంచిదని సూచించాడు. అబుదాబి పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తున్నాయని.. అఫ్గన్ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్ల బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని తెలిపాడు. -
టీమిండియాలోకి శ్రేయస్.. ఆ నలుగురిపై వేటు పడనుందా..?
Shreyas Iyer Likely To Be Promoted To Main Squad: టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన 15 మంది సభ్యుల భారత బృందంలో నలుగురు ఆటగాళ్ల ఫామ్ ప్రస్తుతం బీసీసీఐని కలవరపెడుతుంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రాహుల్ చాహర్‌లు.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో దశలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్(11, 14, 9 పరుగులు), సూర్యకుమార్ యాదవ్(3, 5, 8 పరుగులు), రాహుల్ చాహర్(ఒక్క వికెట్) దారుణమైన గణాంకాలను నమోదు చేయగా.. చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్లో ఒక్క బంతి కూడా బౌల్ చేయకపోవడంతో పాటు బ్యాటింగ్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 7.85 సగటున పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఈ నలుగురు ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని వీరిని తప్పించి ఐపీఎల్లో రాణిస్తున్న దేవ్‌దత్ పడిక్కల్/ శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్/ దీపక్ చహర్, చహల్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచకప్ జట్టులో మార్పులు చేర్పులు చేసేందుకు బీసీసీఐకి అక్టోబర్ 10 వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో మార్పులు తధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. ప్రస్తుతం ఆ నలుగురు ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. మరో 12 రోజుల సమయం(మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లు) ఉన్నందున వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినా.. ఇప్పుడు వరుస హాఫ్ సెంచరీలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ టీమిండియా తరఫున రాణించారని.. రాహుల్ చాహర్ తొలి దశలో పర్వాలేదనిపించాడని.. ఒక్క హార్ధిక్ పాండ్యా విషయమే బీసీసీఐకి తలనొప్పిగా మారిందని సదరు అధికారి చెప్పుకొచ్చాడు. రానున్న మ్యాచ్‌ల్లో ఈ నలుగురు ఆశించిన మేరకు రాణించకపోతే వారిని తప్పించేందుకు బీసీసీఐ ఏమాత్రం వెనుకడుగు వేయకపోవచ్చని, వారి స్థానాల భర్తీ విషయమై శ్రేయస్ అయ్యర్ సహా పలు ఆప్షన్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నాడు. చదవండి: ఉన్ముక్త్ చంద్ పరుగుల సునామీ.. రికార్డు శతకం నమోదు -
నోరు జారిన రాహుల్ చహర్; కూల్‌గా డీల్ చేసిన లంక బ్యాట్స్‌మన్
కొలంబో: టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్ తీసిన ఆనందంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై నోరు జారాడు. అయితే బ్యాట్స్‌మన్ మాత్రం చహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా బ్యాట్‌పై తన చేతిని కొడుతూ అతని బౌలింగ్‌ను ప్రశంసించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లంక ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హసరంగ ఫోర్ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న భువనేశ్వర్ దానిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో వికెట్ తీశానన్న ఆనందంలో రాహుల్ చహర్ హసరంగ వైపు కోపంగా చూస్తూ ''వెళ్లు'' అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ హసరంగా చహర్‌ను లైట్ తీసుకొని తన బ్యాట్‌ను కొడుతూ ''మంచి డెలివరీ'' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చహర్ చర్యపై సీరియస్ కానీ హసరంగను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. '' చహర్ సహనం కోల్పోయినా.. నువ్వు కోల్పోలేదు.. క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన హసరంగకు కంగ్రాట్స్'' అంటూ కామెంట్ చేశారు. ఈ మ్యాచ్‌లో చహర్ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 40 పరుగలుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది. Wanindu Hasaranga upholds the Spirit of the Game! 👏🏽 Tune into Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/QYC4z57UgI) now! 📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #WaninduHasaranga pic.twitter.com/0CwCaTkkAS — Sony Sports (@SonySportsIndia) July 28, 2021 -
'చహర్ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు'
ఢిల్లీ: ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ రాహుల్ చహర్ వేశాడు. అప్పటికే రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 85 పరుగులతో ఆడుతుంది. ఓపెనర్ బట్లర్ 41 పరుగులు చేసి చహర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అయితే చహర్ వేసిన 10వ ఓవర్ మూడో బంతిని జైస్వాల్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. జైస్వాల్ సిక్స్‌కు చహర్ బిత్తరపోయాడు. అయితే ఇన్నింగ్స్ ఐదో బంతిని జైస్వాల్ ఆడే క్రమంలో చహర్‌కే క్యాచ్ ఇచ్చి కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయితే చహర్ వికెట్ తీశానన్న ఆనందంలో జైస్వాల్‌ను కోపంగా చూస్తూ బంతిని అతని వైపు విసిరినట్లు చేశాడు. దీంతో జైస్వాల్ కొద్ది సెకన్లపాటు చహర్‌ను చర్యకు ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఏంటి చహర్ ఎంత వికెట్ తీస్తే.. అంత కోపంతో చూడాలా.. పాపం జైస్వాల్ చూడు ఎలా అయిపోయాడో'' అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: వార్నర్ షూపై పేర్లు.. రోహిత్‌లా మాత్రం కాదు pic.twitter.com/vfnSiwW89r — Aditya Das (@lodulalit001) April 29, 2021 -
'నా జుట్టు అంత స్టైల్‌గా ఉండడానికి కారణం తనే'
చెన్నై: రాహుల్ చాహర్.. ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో కీలకంగా మారాడు. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలవడంలో చహర్ కీలకపాత్ర పోషించాడు.ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు కలిపి ఏడు వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. రాహుల్ చాహర్ హెయిర్ స్టైల్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. కాగా అతని హెయిర్ స్టైల్ విండీస్ ఆటగాళ్లను తలపించేలా ఉంటుంది.రింగుల జుట్టును బలంగా వెనక్కి దువ్వి చివర్లో చిన్నపిలకను ముడేసి ఉంచుతాడు. తన జట్టు వెనుక ఉన్న రహాస్యాన్ని చహర్ బయటపెట్టాడు. అతని డిఫెరెంట్ హెయిర్‌స్టైల్‌కు.. ప్రేయసి, కాబోయే భార్య ఇషానినే కారణం అట. ఈ విషయం అతనే స్వయంగా వెల్లడించాడు. రాహుల్ చాహర్‌కు 2019లో నిశ్చితార్థమైంది. వారిద్దరిదీ పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. చాలాకాలం పాటు రాహుల్ చాహర్-ఇషానీ ప్రేమపక్షుల్లా తిరిగారు. ప్రేమలోకంలో విహరించారు. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం మాత్రం ఇంకా రాలేదు. పెళ్లి పీటలు ఎక్కడానికి ఇంకా సమయం ఉందనేది రాహుల్ చాహర్ కుటుంబీకుల మాట. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత వారిద్దరూ ఒక్కటి కావచ్చని అంటున్నారు. తాజాగా తన ఇషానీతో కలిసి దిగిన ఓ ఫొటోను రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 21, జయంత్ యాదవ్ 13 క్రీజులో ఉన్నారు. చదవండి: 'ఢిల్లీ క్యాపిటల్స్ టాలెంటెడ్.. కానీ మా ప్లాన్ మాకుంది' ‘వారిద్దరూ ఔటైతే ఇక మిగతా జట్టంతా ఐసీయూనే’ View this post on Instagram A post shared by Rahul Chahar (@rdchahar1) -
సాహోరే చహర్ బ్రదర్స్.. ఇద్దరూ సేమ్ టూ సేమ్
చెన్నై: మొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం.. నిన్న పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ. ఈ రెండు మ్యాచ్‌లకు ఎటువంటి సంబంధం లేకపోయినా, ఆయా జట్లను గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు పొందిన వారికి మాత్రం సంబంధం ఉంది. ఒకరు రాహుల్ చహర్ అయితే మరొకరు దీపక్ చహర్. వీరిద్దరూ అన్నదమ్ములు. రాహుల్ చహర్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ అయితే, దీపక్ చహర్ ఫాస్ట్ బౌలర్. నిన్న(ఏప్రిల్16వ తేదీ) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ తన కెరీర్లో గుర్తిండిపోయే గణాంకాల్ని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం మరొక విశేషం. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్‌ను షార్ట్‌పిచ్ బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్‌స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్‌స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్‌లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో దీపక్ చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలుపులో రాహుల్ చహర్‌దే కీలక పాత్ర. ముంబై ఓటమి దిశగా పయనిస్తున్నప్పుడు గేమ్ చేంజర్‌గా మారిపోయాడు రాహుల్. నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లను సాధించాడు రాహుల్ చహర్. ఇక్కడ 6.80 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడం మరొక విశేషం. ముంబై నిర్దేశించిన 153 పరుగుల టార్గెట్ ఛేదనలో కేకేఆర్ తొలుత గెలుపు దిశగా పయనించింది. కాగా, చహర్ వేసిన ప్రతీ ఓవర్లోనూ వికెట్ సాధిస్తూ ముంబై విజయంపై ఆశలు పెంచాడు. 9 ఓవర్ ఐదో బంతికి శుబ్‌మన్ గిల్‌ను ఔట్ చేసిన రాహుల్.. ఆపై 11 ఓవర్ మూడో బంతికి త్రిపాఠిని పెవిలియన్‌కు పంపాడు. అటు తర్వాత 13 ఓవర్ ఐదో బంతికి ఇయాన్ మోర్గాన్ ఔట్ చేశాడు. ఇక 15 ఓవర్ ఐదో బంతికి నితీష్ రానాను ఔట్ చేసి ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ గెలుపు తీసుకొచ్చాడు. ఈ నాలుగు వికెట్లతో తిరిగి తేరుకోలేకపోయిన కేకేఆర్ 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లో రాహుల్, దీపక్ చాహర్‌లు తలో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులుకు కూడా దక్కించుకుని సాహోరే చహర్ బ్రదర్స్ అనిపించుకుంటున్నారు. ఇక్కడ చదవండి: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్.. వరస్ట్ నుంచి బెస్ట్! -
చెన్నైలో గేమ్ ఛేంజర్ అంటే స్పిన్నరే అని తెలుసు.. అందుకే
చెన్నై: కీలకమైన సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ముంబై ఇండియన్స్ బౌలర్ రాహుల్ చహర్. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్లు నితీశ్ రాణా(57), శుభ్‌మన్ గిల్(33) మధ్య 72 పరుగుల భాగస్వామ్యానికి చెక్‌పెట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. వీరిద్దరి వికెట్లతో పాటు, రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌లను సైతం పెవిలియన్‌కు పంపిన ఈ ముంబై స్సిన్నర్ మ్యాచ్‌ను తమవైపు తిప్పేశాడు. ఈ క్రమంలో ముంబై కోల్‌కతాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం నాటి మ్యాచ్‌లో రాహుల్ చహర్ మొత్తంగా 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శన గురించి రాహుల్ చహర్ మాట్లాడుతూ... కెప్టెన్ రోహిత్ శర్మ సలహాలు సత్ఫలితాలను ఇచ్చాయని హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు చాలా మంచి బౌలర్‌వి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు అప్పుడు కచ్చితంగా రాణిస్తావు అని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడు. అంతేకాదు, నెట్స్‌లో కొన్నిసార్లు నా బౌలింగ్‌లో తను ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తుచేశాడు. బంతిని ఎలా టర్న్ చేయాలా అన్న అంశంపై దృష్టిసారించమని సూచించాడు. అంతకు మించి పెద్దగా ఏమీ చెప్పడు. ఒత్తిడి పడనివ్వడు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ మాత్రమే పరిస్థితులను మార్చగలడని అర్థమైన తర్వాత.. నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. నిజం చెప్పాలంటే, సైకాలజికల్‌గా కూడా మేం పైచేయి సాధించాం. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠికి నేను బౌలింగ్ చేస్తున్న సమయంలో, స్లిప్‌లో ఇద్దరిని పెట్టాం. మోర్గాన్‌కు స్లిప్, లెగ్ స్లిప్ ప్లేస్ చేశాం. ఇలాంటి కెప్టెన్సీ టెక్నిక్స్ నాలో మరింత కాన్ఫిడెన్స్‌ను పెంచాయి’’ అని చెప్పుకొచ్చాడు. స్కోర్లు: ముంబై ఇండియన్స్-152 (20) కేకేఆర్- 142/7 (20) చదవండి: ఏడేళ్ల తర్వాత రోహిత్.. ఇది వ్యూహం కాదంటారా? "I just knew that in Chennai, if there’s anyone who can be a game-changer, it has to be a spinner." 👊🏻 🎥 Man of the Match @rdchahar1 speaks to the media at the post-match press conference! 📺: @IPL #OneFamily #MumbaiIndians #MI #IPL2021 #KKRvMI pic.twitter.com/gPmnCDVUBk — Mumbai Indians (@mipaltan) April 14, 2021 -
రోహిత్ 'ఆరే'యడం ఖాయం..
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు టైటిళ్లు ఎగురేసుకుపోయిన ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ సారధ్యంలో ఆ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తూ, టైటిల్ ఫేవరేట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన 'ఆరే'యడం ఖాయమని ఆ జట్టు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ జోస్యం చెప్పాడు. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై జట్టు అజేయంగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్న అతను, ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. జహీర్ ఖాన్, జయవర్దనే లాంటి దిగ్గజాల ఆధ్వర్యంలో సాధన చేయడం తమకు కలిసొస్తుందని, వీరి శిక్షణలో జట్టు సభ్యులు మరింత రాటుదేలారని తెలిపాడు. టీమిండియా స్టార్ క్రికెటర్లతో జట్టు దుర్భేద్యంగా ఉందని, దీనికి విదేశీ క్రికెటర్ల బలం తోడైతే తమ జట్టుకు తిరుగే ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ సారధ్యంలో ముంబై జట్టు వరుసగా మూడో టైటిల్‌ను, మొత్తంగా ఆరో టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. చివరి రెండు సీజన్లలో ముంబై టైటిల్ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన రాహుల్ చహర్.. దుబాయ్ వేదికగా జరిగిన గత సీజన్లో 15 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిని అతను 7.46 ఎకానమీతో 30 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉండగా, చెన్నై వేదికగా ఏప్రిల్ 9న జరుగనున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. చదవండి: మ్యాక్సీ రివర్స్ స్వీప్ అదుర్స్.. -
రెండో టీ20: భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు!
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు(ఆదివారం) ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని లెగ్ స్పిన్నర్ చాహల్, పేసర్ శార్థూల్ ఠాగూర్ల స్థానాల్లో లెగ్ బ్రేక్ బౌలర్ రాహుల్ చాహర్, మీడియం పేస్ బౌలర్ దీపక్ చాహర్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి: హార్దిక్ షాట్‌కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి? కాగా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను రొటేషన్ పేరుతో తప్పించి.. టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్‌లో చేస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ రీ ఎంట్రీ, రాహుల్, దీపక్ చాహర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం చూసినా రోహిత్, రాహుల్‌ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్‌ను కనబర్చిన రాహుల్ చాహర్‌ను, తొలి మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్ స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక్కడ చదవండి: ఆ రూల్ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ -
‘వారిద్దరూ టీమిండియాకు ఆడటం ఖాయం’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో పలువురు యువ క్రికెటర్లు సత్తాచాటిన సంగతి తెలిసిందే, వారిలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లైన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్‌లు కూడా ఉన్నారు. టోర్నమెంట్ అంతటా సూర్య కుమార్ తన బ్యాటింగ్ పవర్ చూపించగా చాహర్ తన స్పిన్ బౌలింగ్‌తో గేమ్ ఛేంజర్ పాత్రను పోషిస్తూ వస్తున్నాడు. వీరిపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర డొమినిక్ కార్క్. అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉందని కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ టాక్ షోలో మాట్లాడిన కార్క్..ముంబై జట్టు అత్యంత పటిష్టంగా ఉందన్నాడు. ఒకరు గాయపడితే ఆ ప్లేస్‌ను భర్తీ చేయడానికి తగినన్ని వనరులు ముంబై జట్టులో ఉన్నాయన్నాడు. లెఫ్టార్మ్ బౌలర్ అయిన బౌల్ట్ గాయపడితే, అతని స్థానాన్ని రిప్లేస్ చేయడానికి లెఫ్టార్మ్ బౌలర్ అయిన మెక్లీన్గన్ ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఇలా ఎక్కడ చూసుకున్నా ముంబై అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందన్నాడు. అటు సీనియర్లు, ఇటు యువ టాలెంటెడ్ క్రికెటర్ల సమ్మేళనమే ముంబై ఇండియన్స్ అని అభిప్రాయపడ్డాడు. అసాధారణ నైపుణ్యమున్న యంగ్ క్రికెటర్లతో ముంబై కల్గి ఉండటమే వారి విజయాలకు కారణమన్నాడు. అందులో సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్‌ల పేర్లను కార్క్ ప్రస్తావించాడు. వారిద్దరూ కచ్చితంగా టీమిండియాకు ఆడతారని పేర్కొన్నాడు. ఈరోజు (మంగళవారం) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరనుగంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఒకవైపు, తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ మరొకవైపు టైటిల్ వేట కోసం సన్నద్ధమయ్యాయి. -
దటీజ్ కెప్టెన్ రోహిత్‌శర్మ..
దుబాయ్: ఐపీఎల్-13లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ముంబై గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన రాహుల్ చహర్ నిరుత్సాహ పడకుండా ఉండేలా కెప్టెన్ రోహిత్ చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ విన్నింగ్ స్పిరిట్‌తో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లేందుకు జట్టును ముందుండి నడిపించేలా రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. రెండు ఓవర్లలో 35 పరుగుల చెత్త ప్రదర్శన కబరిచినా అతని కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు కెప్టెన్ రోహిత్ చేసిన ఈ స్టీట్ జెస్టర్ అమితంగా ఆకట్టుకుంటుంది. ‘థట్స్ అవర్ కెప్టెన్ రోహిత్ శర్మ’ అంటూ ఫ్యాన్స్ తెగ ముచ్చటపడుతున్నారు. (ముంబై వేట.. ఆరో సారి ఫైనల్‌కు) ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికీ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు చెలరేగిపోయారు. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంస రచన చేశాడు. వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏ దశలోనూ తేరుకోనివ్వని ముంబై తనమార్కు ఆట తీరుతో చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0)లను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా, స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా, పొలార్డ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినప్పటికీ మరొక అవకాశం ఉంది. ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్-2లో తలపడనుంది. (చెలరేగిన బుమ్రా: ఫైనల్లో ముంబై) Rohit Sharma, the captain - Class act. Allowing Rahul Chahar who had a disappointing day with ball allowing to lead the team into dressing room😍 That's Our Captain Rohit💙#MIvDC #MIvsDC #MumbaiIndians #OneFamily #MITheEmperorOfIPL #MI @ImRo45 @mipaltan pic.twitter.com/dz1oZPVCpW — Ukkasha😈 (@smart_ukkasha) November 5, 2020 -
బ్రదర్ కాస్కో.. నిన్ను టీజ్ చేస్తా: రాహుల్ చాహర్
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ముంబైపై సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. కాగా, ఆ తర్వాత చతికిలబడ్డ సీఎస్కే వరుస ఓటములను చవిచూసి టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ఈరోజు(శుక్రవారం) ముంబై ఇండియన్స్-సీఎస్కేల మధ్య షార్జా వేదికగా రెండో అంచె మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కేపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ముంబై ఇండియన్స్. (‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’) ఈ మేరకు ముంబై స్పిన్నర్ రాహుల్ చాహర్ మాట్లాడుతూ.. నేటి మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. అదే సమయంలో సీఎస్కే తరఫున ఆడుతున్న అన్న దీపక్ చాహర్‌ను కూడా టీజ్ చేస్తానంటున్నాడు. దీనిలో భాగంగా రాహుల్ చాహర్ ఒక వీడియోలో మాట్లాడుతూ అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. దీన్ని ముంబై ఇండియన్స్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘సీఎస్కేపై మేము మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మేము గెలిస్తే మాత్రం మా అన్న దీపక్ చాహర్‌ను టీజ్ చేయడం ఖాయం. నాకు 2018 బాగా గుర్తుంది. నన్ను మా బ్రదర్ దీపక్ చాహర్ టీజ్ చేశాడు. అతని జట్టు సీఎస్కే గెలిచిన తర్వాత నన్ను ఏడిపించాడు. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది. 2019లో మేము సీఎస్కేపై గెలిచిన తరవఆత దీపక్‌ను టీజ్ చేశా. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం నాకు వస్తుందని ఆశిస్తున్నా. బ్రదర్ కాస్కో.. నేను టీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ రాహుల్ చాహర్ పేర్కొన్నాడు. కాగా, తామిద్దరం ఎప్పుడు కలిసిన ఒకరి ఆట గురించి మరొకరం మాట్లాడుకోమని రాహుల్ చెప్పాడు. కానీ తాము జట్ల కోసం వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నాడు. మ్యాచ్ ఆడేటప్పుడు అన్నను కూడా ప్రత్యర్థి ఆటగాడు మాదిరిగానే చూస్తానన్నాడు. (గంభీర్.. ఇప్పుడేమంటావ్?) -
కుటుంబంతో ఉంటే మాస్క్ ధరిస్తామా?
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడేందుకు వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)లో కరోనా కలకలం రేగిన సంగతి తెలసిందే. దీపక్ చహర్ సహా ఇతర చెన్నై ఫ్రాంచైజీ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా వీరు వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. దీపక్ సోదరుడు, ముంబై ఇండియన్ లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోమని రాహుల్ చెప్పిన ప్రతీసారి దీపక్ వాటిని తేలిగ్గా కొట్టిపరేశాడు. ఇంట్లో ఉంటే ఈ దూరాలేంటి కుటుంబంతో ఉంటే మాస్క్ ధరించడమేంటి? అని చాలా లైట్ తీసుకున్నాడు. (సీఎస్కేలో 10మందికి కరోనా పాజిటివ్!) ఈ నేపథ్యంలో దీపక్‌కు కరోనా సోకడంతో ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ వైరల్‌గా మారింది. ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా దాని ప్రభావం ఇతరులపై పడుతుందంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనాకు గురైన దీపక్‌కు సోదరుడు రాహుల్ బాసటగా నిలిచాడు. ధైర్యంగా ఉండు..త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులో ఇప్పటికే 10 మంది సీఎస్కే సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్‌ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (వెంటాడుతున్న కరోనా : ఆలస్యం కానున్న ఐపీఎల్) -
‘సాహోరే చహర్ బ్రదర్స్’
ప్రొవిడెన్స్ (గయానా) : నాలుగు పరుగులు మూడు వికెట్లు. టి20లో సాధ్యంకాని బౌలింగ్ గణాంకాలు. అది కూడా పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పైన. కెరీర్లో గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు యువ బౌలర్ దీపక్ చహర్. అరంగేట్రపు మ్యాచ్‌లో దారాళంగా పరుగులిచ్చాడు. దీంతో అతడిపై ఆశలు సన్నగిల్లాయి. కానీ విండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బుల్లెట్లా దూసుకొస్తున్న దీపక్ చహర్ బంతులను ఆడటానికి కరేబియన్ బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టింది. దీపక్ చహర్‌తో పాటు ఐపీఎల్, లిస్టు ఏ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ రాహుల్ చహర్ విండీస్‌తో జరిగిన చివరి టి 20లో అదరగొట్టారు. వీరి ఆటకు మంత్రముగ్దుడైన సారథి విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి రెండు టి20లను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తర్వాత కూడా టీమిండియా ఎక్కడా తగ్గలేదు. చివరి మ్యాచ్‌లోనూ కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ఆటతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి చహర్ బ్రదర్స్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. భువీ స్కిల్‌ఫుల్ బౌలర్ ‘పిచ్ అంత గొప్పగా ఏంలేదు. బౌలింగ్‌కు అంతగా సహకరించటం లేదు. అయినా రాహుల్ చహర్ తన తొలి స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అనంతరం దీపక్ చహర్ బౌలింగ్ అత్యద్భుతం. తన స్వింగ్ బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు పడగొట్టాడు. అయితే ఓ దశలో విండీస్ భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నాం. కానీ చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ సంచలన రీతిలో బౌలింగ్ చేయడంతో విండీస్‌ను కట్టడి చేయగలం. నిజంగా చహర్ బ్రదర్స్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. భువీ స్కిల్ ఫుల్ బౌలర్. అతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచకప్ 2023 గురించి ఇప్పుడే ఆలోచిండంలేదు తొలి రెండు టి20లో పంత్ విఫలమవ్వడం నన్ను ఎంతగానో నిరాశపరిచింది. అయితే చివరి మ్యాచ్‌లో పంత్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ పంత్ నుంచి ఇంకా ఆశిస్తున్నాం. అయితే అతడిపై ఎలాంటి ఒత్తిడి తీసుకరావడం లేదు. పంత్‌కు పూర్తి స్వేచ్చనిచ్చాం. ఇక నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. పరుగులు ఎన్ని సాధించాం అనే దానికంటే జట్టుకు మనం చేసిన పరుగులు ఎంతవరకు ఉపయోపడ్డాయి అనేది ముఖ్యం. ప్రపంచకప్ 2023 గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. యువ ఆటగాళ్లకు అనేక అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మరింత బలం చేకూర్చాలని భావిస్తున్నాం’అంటూ కోహ్లి వివరించాడు. -
భారత్ తరఫున 81వ ప్లేయర్‌గా రాహుల్ చహర్
గయానాలో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. టాస్ వేయడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా రాహుల్ చహర్ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ (20 ఏళ్ల 2 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.