![T20 World Cup 2021: Sunil Gavaskar Wants Ravichandran Ashwin Play Vs AFG - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/3/Ashwin.jpg.webp?itok=0IvrAKLA)
Sunil Gavaskar Says R Ashwin Must Play Vs Afghanistan Match T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అఫ్గన్‌తో మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించినా తప్పులేదని.. అశ్విన్‌ను మాత్రం కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్ చక్రవర్తిని అఫ్గాన్ బ్యాటర్స్ సులువుగా ఎదుర్కొనే అవకాశముంది. అందుకే అతని స్థానంలో రాహుల్ చహర్‌ను జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని తెలిపాడు.
ఇక అశ్విన్, జడేజా, రాహుల్ చహర్‌లు స్పిన్ బాధ్యతలు తీసుకుంటే ఒక పేసర్‌ను తప్పించే అవకాశం ఉంటుందన్నాడు. ఒకవేళ హార్దిక్ బౌలింగ్ చేసే అవకాశం ఉంటే.. మహ్మద్ షమీ.. శార్దూల్ ఠాకూర్‌లలో ఎవర్నో ఒకర్ని తప్పించడం మంచిదని సూచించాడు. అబుదాబి పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తున్నాయని.. అఫ్గన్ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్‌ల బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment