టీమిండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేను సెలెక్టర్‌ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
దీని ముందు గవాస్కర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశిస్తూ కూడా పలు కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ కూడా వికెట్‌కీపింగ్ కమ్ బ్యాటింగ్‌కు బెస్ట్ ఛాయిసే. అయినా నా ఓటు మాత్రం పంత్‌కే అని అన్నాడు. పంత్ అందుబాటులో ఉన్నంత కాలం అతనే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం తన ఓటు కేఎల్ రాహుల్‌కు ఉంటుందని చెప్పిన గవాస్కర్.. రాహుల్ వల్ల టీమిండియా సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తూ మిడిలార్డర్‌లో అయినా ఓపెనర్‌గా అయినా సింక్ అవుతాడని తెలిపాడు.
స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో జరిగిన గేమ్ ప్లాన్ అనే షోలో గవాస్కర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, 2022 చివర్లో జరిగిన కార్ యాక్సిడెంట్‌లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా సిరీస్‌కు ఒకరు చొప్పున పార్ట్‌టైమ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు.
వన్డే వరల్డ్‌కప్‌లో అతను పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు అద్భుతంగా వికెట్‌కీపింగ్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ సమయానికంతా పూర్తి ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రాహుల్‌ను కానీ ఇషాన్ కిషన్‌ను కాని వికెట్‌కీపర్లుగా ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపిక చేయబడ్డారు. రాహుల్, ఇషాన్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెబుతున్నారు. మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత కోహ్లి తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment