గయానాలో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. టాస్ వేయడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా రాహుల్ చహర్ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా రాహుల్ (20 ఏళ్ల 2 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు), ఇషాంత్ శర్మ (19 ఏళ్ల 152 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment