టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 9న గోవా వేదికగా తన ఇష్ట సఖి ఇషానిని రాహుల్ మనువాడబోతున్నాడు. 2019 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జోడీ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఒక్కటి కాబోతుంది. బెంగళూరుకు చెందిన ఇషాని ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తుండగా, రాహుల్ చాహర్.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికయ్యాడు. పంజాబ్ జట్టు రాహుల్‌ను రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకుంది.
గతేడాది శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు ఎంపికైన రాహుల్ చాహర్.. వన్డే అరంగేట్రంలో అదరగొట్టాడు. తనకు అవకాశం వచ్చిన ఏకైక వన్డేలో మూడు వికెట్లతో సత్తా చాటాడు. టీమిండియా తరఫున 6 టీ20లు, ఓ వన్డే ఆడిన చాహర్ 7 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో పూణే, ముంబై జట్లకు ఆడిన అతను 42 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. కాగా, రాహుల్ చాహర్, ఇషానిల వివాహానికి రాహుల్ కజిన్ బ్రదర్, టీమిండియా అప్ కమింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 12న బెంగళూరులో వీరి రిసెప్షన్ వేడుక జరగనున్నట్లు సమాచారం.
చదవండి: మటన్ రోల్స్ కోసం వెళ్లి రిస్క్‌లో పడిన విరాట్ కోహ్లి..!
Comments
Please login to add a commentAdd a comment