Rahul Chahar Married Ishani Johar In Grand Wedding Ceremony Pics Viral - Sakshi
Sakshi News home page

Rahul Chahar: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ బౌలర్‌.. ఫొటోలు వైరల్‌

Mar 10 2022 10:59 AM | Updated on Mar 10 2022 11:42 AM

Rahul Chahar Married Ishani Johar In Grand Wedding Ceremony Pics Viral - Sakshi

Rahul Chahar: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ బౌలర్‌.. ఫొటోలు వైరల్‌

టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్‌ చహర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి ఇషాని జోహార్‌ను పెళ్లాడాడు. గోవాలో బుధవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. రాహుల్‌ కజిన్‌, టీమిండియా ఆటగాడు దీపక్‌ చహర్‌ కాబోయే భార్యతో కలిసి రాగా.. శివమ్‌ మావి వంటి ఇతర కొద్ది మంది సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. 

కాగా బెంగళూరుకు చెందిన ఇషాని ఫ్యాషన్ డిజైనర్‌. గత కొన్నేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్న 22 ఏళ్ల రాహుల్‌ చహర్‌.. 2019లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత దాదాపు మూడేళ్లకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక శనివారం ఈ జంట రిసెప్షన్‌ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

రాహుల్‌- ఇషాని మెహందీ, హల్దీ, పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పెళ్లైన అనంతరం.. ‘‘ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా’’ అంటూ మనసిచ్చిన నిచ్చెలిని భార్యగా చేసుకున్న రాహుల్‌ ఆమె చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.   

కాగా రాజస్తాన్‌లో జన్మించిన రాహుల్‌ చహర్‌ 2021 టీమిండియా శ్రీలంక పర్యటన నేపథ్యంలో జట్టుకు ఎంపికై వన్డేల్లో అరంగేట్రంలో చేశాడు. ఆ సమయంలో ఆడిన ఏకైక వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు భారత్‌ తరఫున తరఫున 6 టీ20లు, ఓ వన్డే ఆడిన చహర్‌ మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇదిలా ఉండగా... ఐపీఎల్‌లో పుణే, ముంబై జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ జట్టు రాహుల్‌ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పెళ్లి సందర్భంగా రాహుల్‌ దంపతులకు ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.

చదవండి: IPL 2022- CSK: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement