Courtesy: IPL Twitter
టీ20 క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు, పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా ధావన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఈ ఘనత సాధించాడు.
ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(1132) ఫోర్లతో ఉన్నాడు. ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి(917) ఫోర్లతో రెండో ప్లేస్‌లో, రోహిత్ శర్మ (875)ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీ20ల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్లు వీరే
క్రిస్ గేల్- 1132 ఫోర్లు
అలెక్స్ హేల్స్-1054 ఫోర్లు
డేవిడ్ వార్నర్ - 1005 ఫోర్లు
ఆరోన్ ఫించ్- 1004 ఫోర్లు
శిఖర్ ధావన్- 1000 ఫోర్లు
చదవండి: IPL 2022: నిజానికి ఇది కింగ్స్ గేమ్.. ఆ ముగ్గురి వల్లే ఇదంతా: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment