Courtesy: IPL Twitter
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ రిషి ధావన్ టీమిండియాలోకి తిరిగి రావాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. రిషి ధావన్ బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాగా ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌కు తొలి సారి విజయ్ హజారే ట్రోఫీని ధావన్ అందించాడు. ఇక ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధావన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ధావన్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
"నేను జట్టులో సీనియర్ ఆటగాడిని. భారత జట్టులో తిరిగి వచ్చి అత్యత్తుమ ప్రదర్శన చేయడమే నా లక్ష్యం. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల్లో రాణించడం చాలా కష్టం. కానీ మ్యాచ్ పరిస్థితిని బట్టి బౌలింగ్ చేయమని కోచ్‌లు నాకు చెప్పారు. అది నాకు చాలా సహాయపడింది. నేను కగిసో రబాడా నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అతడు బౌలింగ్‌లో నా బలాలపై దృష్టి పెట్టమని చెప్పాడు ”అని ఎన్డీటీవికు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు. ధావన్ టీమిండియా తరపున మూడు వన్డేలు, కేవలం ఒక్క టీ20 మాత్రమే ఆడాడు.
చదవండి: IPL 2022: ముంబైతో తలపడనున్న సీఎస్‌కే.. నిలవాలంటే గెలవాలి..!
Comments
Please login to add a commentAdd a comment