Courtesy : IPL Twitter
చెన్నై: రాహుల్ చాహర్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో కీలకంగా మారాడు. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలవడంలో చహర్ కీలకపాత్ర పోషించాడు.ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు కలిపి ఏడు వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. రాహుల్ చాహర్ హెయిర్ స్టైల్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. కాగా అతని హెయిర్ స్టైల్ విండీస్ ఆటగాళ్లను తలపించేలా ఉంటుంది.రింగుల జుట్టును బలంగా వెనక్కి దువ్వి చివర్లో చిన్నపిలకను ముడేసి ఉంచుతాడు. తన జట్టు వెనుక ఉన్న రహాస్యాన్ని చహర్ బయటపెట్టాడు.
అతని డిఫెరెంట్ హెయిర్‌స్టైల్‌కు.. ప్రేయసి, కాబోయే భార్య ఇషానినే కారణం అట. ఈ విషయం అతనే స్వయంగా వెల్లడించాడు. రాహుల్ చాహర్‌కు 2019లో నిశ్చితార్థమైంది. వారిద్దరిదీ పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. చాలాకాలం పాటు రాహుల్ చాహర్-ఇషానీ ప్రేమపక్షుల్లా తిరిగారు. ప్రేమలోకంలో విహరించారు. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం మాత్రం ఇంకా రాలేదు. పెళ్లి పీటలు ఎక్కడానికి ఇంకా సమయం ఉందనేది రాహుల్ చాహర్ కుటుంబీకుల మాట. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత వారిద్దరూ ఒక్కటి కావచ్చని అంటున్నారు. తాజాగా తన ఇషానీతో కలిసి దిగిన ఓ ఫొటోను రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 21, జయంత్ యాదవ్ 13 క్రీజులో ఉన్నారు.
చదవండి: 'ఢిల్లీ క్యాపిటల్స్ టాలెంటెడ్.. కానీ మా ప్లాన్ మాకుంది'
‘వారిద్దరూ ఔటైతే ఇక మిగతా జట్టంతా ఐసీయూనే’
Comments
Please login to add a commentAdd a comment