ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకోపోతుంది. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ధావన్ సేన శనివారం నుంచి తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. పంజాబ్ క్రికెటర్లు రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు.
ఈ సందర్భంగా బన్నీతో కలిసి వీరిద్దిరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ చాహర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక అతిథ్య ఎస్‌ఆర్‌హెచ్ జట్టు శనివారం హైదరాబాద్ చేరుకోనుంది.
వరుస ఓటములతో సతమతమవుతున్న ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. కాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు
Comments
Please login to add a commentAdd a comment