RCB will break the bank for Rahul Chahar in mega auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్‌సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. కాగా రానున్న మెగా వేలంలో ఆర్‌సీబీ.. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తమ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను అంటిపెట్టుకోనందున అతడి స్దానంలో చహర్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు చోప్రా తెలిపాడు.
“ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఆర్‌సీబీ కోనుగోలు చేయదు. మరో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను సొంతం చేసుకోవడానికి ఆర్‌సీబీ సిద్దంగా ఉంది. ఎందుకంటే వాళ్ల హోం గ్రౌండ్‌లో లెగ్ స్పిన్నర్లకు తప్ప మిగితా స్పిన్నర్లుకు అంతగా రికార్డులు లేవు. అయితే రవి బిష్ణోయ్ కూడా ఓ అవకాశంగా వాళ్లకి ఉండవచ్చు, కానీ నేను మాత్రం రాహుల్ చాహర్‌ని తీసుకుంటారని అని భావిస్తున్నాను" అని చోప్రా పేర్కొన్నాడు.
ఇక కాబోయే ఆర్‌సీబీ కెప్టెన్ గురించి మాట్లాడూతూ... "విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఆర్‌సీబీ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆర్‌సీబీ రానున్న మెగా వేలంలో హోల్డర్ కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే అతడికి వెస్టిండీస్ జట్టుతో పాటు కరీబీయన్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అంతే కాకుండా అతడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని జట్లులో బాగా రాణిస్తున్నాడు" అని తన యూట్యూబ్ ఛానెల్‌లో చోప్రా తెలిపాడు.
చదవండి: IPL 2021 Auction: ‘వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి’
Comments
Please login to add a commentAdd a comment