David Warner Reel On Puneeth Rajkumar Fans Asks Play For RCB His Reaction - Sakshi
Sakshi News home page

David Warner: ‘అప్పు’ను గుర్తుచేసిన వార్నర్‌.. అదైతే కష్టం కానీ! మరి ఆర్సీబీకి ఆడతావా బ్రో!

Published Sun, Dec 5 2021 1:09 PM | Last Updated on Sun, Dec 5 2021 3:09 PM

David Warner Reel On Puneeth Rajkumar Fans Asks Play For RCB His Reaction - Sakshi

IPL 2022: David Warner Reply After Fan Requested Him Join RCB: ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడు, ఎవరిని ఏ జట్టు కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అంశాలపై చర్చలు సాగుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్లతో ముచ్చటిస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ ఆసక్తికర పోస్టుతో ముందుకు వచ్చాడు. ఇటీవల మరణించిన కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తుచేస్తూ.. తన సినిమాలోని సీన్‌ను ఫేస్‌యాప్‌ సాయంతో రీక్రియేట్‌ చేసి రీల్‌ షేర్‌ చేశాడు. ‘‘రెస్పెక్ట్‌’’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో షేర్‌ చేశాడు.

కన్నడ అభిమానుల నుంచి ఇందుకు విశేష స్పందన లభిస్తోంది. అప్పును మీరిలా గుర్తుచేయడం మా హృదయాలను ద్రవింపజేసింది. ధన్యవాదాలు అంటూ వార్నర్‌కు థాంక్స్‌ చెబుతున్నారు. మరోవైపు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు టైటిల్‌ సాధించిపెట్టిన డేవిడ్‌ వార్నర్‌.. వేలంలో భాగంగా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందా అని ఓ అభిమాని అడిగాడు. ఇందుకు స్పందించిన వార్నర్‌.. అది చాలా కష్టమన్నట్లుగా కామెంట్‌ చేశాడు.

అదే సమయంలో మరో నెటిజన్‌.. ‘‘మరి కర్ణాటకకు ఆడతారా? అదే.. ఆర్సీబీలో చేరతారా’’ అంటూ ప్రశ్న సంధించాడు. ఇందుకు ఎమోజీలతో బదులిచ్చాడు వార్నర్‌. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో వార్నర్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడటం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఆర్సీబీ బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్‌ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), మహ్మద్‌ సిరాజ్‌ (రూ. 7 కోట్లు)ను రిటైన్‌ చేసుకోగా.. సన్‌రైజర్స్‌ వార్నర్‌ను వదిలేసింది. మరోవైపు.. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలగడంతో వార్నర్‌ జట్టులోకి వస్తే అతడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

చదవండి: Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్‌.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్‌ ఆడించలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement