IPL Retention
-
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వచ్చింది. భారత వికెట్ కీపర్, హిట్టర్ రిషభ్ పంత్‌ను క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఐపీఎల్-2025లో క్యాపిటల్స్ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ టీమ్ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. జీఎంఆర్ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. ఆ నలుగురు జట్టుతోనేదాంతో తమ స్టార్ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్... 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్ రేట్‌తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు. కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్‌కు భారీ డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. రిటెన్షన్ పూర్తి లిస్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!నిబంధనలు ఇవీఅంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురుఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంతఅయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవేముంబై ఇండియన్స్1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు2. జస్ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు5. నమన్ ధీర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ఆకాశ్ మధ్వాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు4. యశ్ దయాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అనూజ్ రావత్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు5. ఎంఎస్ ధోని(అన్క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు5. హర్షిత్ రాణా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. అంగ్క్రిష్ రఘువంశీ(అన్‌కాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 55 కోట్లురాజస్తాన్ రాయల్స్1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు5. సందీప్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది- రూ. 55 కోట్లులక్నో సూపర్ జెయింట్స్1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు4. ఆయుశ్ బదోని(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. మొహ్సిన్ ఖాన్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుపంజాబ్ కింగ్స్1. అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు2. సామ్ కరన్- రూ. 14 కోట్లు3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు4. అశుతోశ్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ప్రభ్‌సిమ్రన్ సింగ్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు4. రసిఖ్ సలాం దర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అభిషేక్ పోరెల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు 6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్1. శుబ్‌మన్ గిల్- రూ. 18 కోట్లు2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు5. రాహుల్ తెవాటియా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. మోహిత్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
David Warner: ‘అప్పు’ను గుర్తుచేసిన వార్నర్.. అదైతే కష్టం కానీ!
IPL 2022: David Warner Reply After Fan Requested Him Join RCB: ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడు, ఎవరిని ఏ జట్టు కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అంశాలపై చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్లతో ముచ్చటిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ ఆసక్తికర పోస్టుతో ముందుకు వచ్చాడు. ఇటీవల మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తుచేస్తూ.. తన సినిమాలోని సీన్‌ను ఫేస్‌యాప్ సాయంతో రీక్రియేట్ చేసి రీల్ షేర్ చేశాడు. ‘‘రెస్పెక్ట్’’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేశాడు. కన్నడ అభిమానుల నుంచి ఇందుకు విశేష స్పందన లభిస్తోంది. అప్పును మీరిలా గుర్తుచేయడం మా హృదయాలను ద్రవింపజేసింది. ధన్యవాదాలు అంటూ వార్నర్‌కు థాంక్స్ చెబుతున్నారు. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ సాధించిపెట్టిన డేవిడ్ వార్నర్.. వేలంలో భాగంగా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందా అని ఓ అభిమాని అడిగాడు. ఇందుకు స్పందించిన వార్నర్.. అది చాలా కష్టమన్నట్లుగా కామెంట్ చేశాడు. అదే సమయంలో మరో నెటిజన్.. ‘‘మరి కర్ణాటకకు ఆడతారా? అదే.. ఆర్సీబీలో చేరతారా’’ అంటూ ప్రశ్న సంధించాడు. ఇందుకు ఎమోజీలతో బదులిచ్చాడు వార్నర్. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో వార్నర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడటం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఆర్సీబీ బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు)ను రిటైన్ చేసుకోగా.. సన్‌రైజర్స్ వార్నర్‌ను వదిలేసింది. మరోవైపు.. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలగడంతో వార్నర్ జట్టులోకి వస్తే అతడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చదవండి: Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్ ఆడించలేదు! View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
'ముంబై నన్ను వదిలేసింది'.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
Hardik Pandya Emtional After Mumbai Indians Release For Mega Auction.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ జాబితాను ప్రకటించాయి. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా.. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలను మాత్రమే రిటైన్ చేసుకుంది. కాగా ఆ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ ముంబైతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో విడుదల చేశాడు. చదవండి: Ipl Retention: రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. జడేజాకు భారీ ధర.. పూర్తి వివరాలు! ''ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన క్షణాలను నా తర్వాతి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటా. ఎన్నో ఆశలతో ఒక యంగ్‌స్టర్‌గా 2015లో ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన నేను ఈరోజు అంతర్జాతీయ స్థాయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాను. ఈ ఆరేళ్లలో ముంబై ఇండియన్స్‌కు ఒక మంచి ఆల్‌రౌండర్‌గా పనిచేశాను. నాకు ముంబై ఇండియన్స్‌తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. జట్టు ఆటగాళ్లతో స్నేహం.. ముంబై ఫ్యాన్స్ అభిమానం.. ఇవన్నీ నాకు గొప్పగా అనిపించాయి. ఇవాళ నన్ను ముంబై నన్ను వదిలేసి ఉండొచ్చు.. కానీ వారితో ఉన్న ఎమోషన్ మాత్రం ఎప్పటికి నాతోనే ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తో ఇన్నాళ్లు కలిసి గెలిచాం.. కలిసి ఓడాం.. ఈ క్షణంలో దూరమవ్వడం బాధ కలిగిస్తుంది. అయినప్పటికి నా గుండెల్లో ముంబై ఇండియన్స్ పేరు మాత్రం ఎప్పటికి నిలిచిపోతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Rashid Khan: 16 కోట్లు కావాలని పట్టుబట్టాడు!.. అయితే.. అంతకంటే ఎక్కువకే మరి! ఇక 2015లో కనీస ధర రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన హార్దిక్ నాలుగు ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో ముంబై టైటిల్ గెలవడంలో హార్దిక్‌ది కీలకపాత్ర. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హార్దిక్ టీమిండియాలోనూ చోటు కోల్పోయాడు. టి20 ప్రపంచకప్ 2021కు ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పటికి.. ఒక్క మంచి ప్రదర్శన లేక విమర్శల పాలయ్యాడు. దీంతోపాటు బౌలింగ్‌కు దూరంగా ఉండడంతో ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ హార్దిక్‌కు తీసేయొచ్చంటూ పలువురు మాజీలు చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే రీహాబిటేషన్ కోసం ఎన్సీఏకు వెళ్లిన హార్దిక్ సౌతాఫ్రికా టూర్‌కు తనను పరిగణించొద్దంటూ సెలక్టర్లను కోరడం ఆసక్తి కలిగించింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
అతని కోసం ఆర్సీబీ పోటీ పడుతుంది.. కెప్టెన్‌గా అతనే సరైనోడు..
RCB will break the bank for Rahul Chahar in mega auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. కాగా రానున్న మెగా వేలంలో ఆర్సీబీ.. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తమ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను అంటిపెట్టుకోనందున అతడి స్దానంలో చహర్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు చోప్రా తెలిపాడు. “ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఆర్సీబీ కోనుగోలు చేయదు. మరో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను సొంతం చేసుకోవడానికి ఆర్సీబీ సిద్దంగా ఉంది. ఎందుకంటే వాళ్ల హోం గ్రౌండ్లో లెగ్ స్పిన్నర్లకు తప్ప మిగితా స్పిన్నర్లుకు అంతగా రికార్డులు లేవు. అయితే రవి బిష్ణోయ్ కూడా ఓ అవకాశంగా వాళ్లకి ఉండవచ్చు, కానీ నేను మాత్రం రాహుల్ చాహర్‌ని తీసుకుంటారని అని భావిస్తున్నాను" అని చోప్రా పేర్కొన్నాడు. ఇక కాబోయే ఆర్సీబీ కెప్టెన్ గురించి మాట్లాడూతూ... "విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆర్సీబీ రానున్న మెగా వేలంలో హోల్డర్ కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే అతడికి వెస్టిండీస్ జట్టుతో పాటు కరీబీయన్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అంతే కాకుండా అతడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని జట్లులో బాగా రాణిస్తున్నాడు" అని తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా తెలిపాడు. చదవండి: IPL 2021 Auction: ‘వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి’ -
16 కోట్లు కావాలని పట్టుబట్టాడు!.. అయితే.. అంతకంటే ఎక్కువకే మరి!
Rashid Khan Will Fetch Above 16 Crores In IPL mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రషీద్ ఖాన్‌ను రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రానున్న మెగా వేలంలో రషీద్‌కు భారీ ధర దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప కూడా ఇటువంటి వాఖ్యలే చేశాడు. "రషీద్ ఖాన్‌కు వచ్చే మెగా వేలంలో తప్పకుండా 16 కోట్లకు పైగా దక్కుతుంది" అని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. రషీద్ ఖాన్ తన కోసం 16 కోట్లు వెచ్చిస్తేనే(మొదటి రిటెన్షన్) జట్టులో ఉంటానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే రషీద్‌ని కాదు అని ఆజట్టు కెప్టెన్ విలియమ్సన్ వైపే మెగ్గు చూపింది. దీంతో ఆ ప్రాంఛైజీతో రషీద్ ఖాన్‌కు విభేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా సన్‌రైజర్స్ రషీద్‌ను రెండో రిటెన్షన్‌గా ఉంచాలని భావించింది. అంటే అతడికి 11 కోట్లు చెల్లంచడానికి సిద్దంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీన్ని అతడు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఫ్రాంఛైజీ లక్నోతో ఇప్పటికే రషీద్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అదే విధంగా ఎస్ఆర్హెచ్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)లను రీటైన్ చేసుకుంది. చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి... -
KL Rahul: అంకుల్ ఓకే అన్న తర్వాత ఇంకేంటి రాహుల్.. వెళ్లు అక్కడ నిలబడు!
KL Rahul Athiya Shetty First Public Appearance Tadap Premiere Video Viral Fans Funny Trolls: గత కొన్ని రోజులుగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సారథిగా కొనసాగేందుకు ఇష్టపడని రాహుల్.. కొత్తగా రాబోయే లక్నో ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్నాడంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒకవేళ అవే గనుక నిజమైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు అతడిపై ఏడాది పాటు వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. కెరీర్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కూతురు, నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీరు చేసే పోస్టులు, కలిసి యాడ్స్‌లో నటించడం సహా వీలు చిక్కినప్పుడల్లా డేటింగ్‌లకు వెళ్లడం వీటికి మరింత ఊతమిచ్చాయి. అయితే, ఇద్దరూ కలిసి బయట ఎక్కడా ఫొటోలకు పోజులిచ్చిన సందర్భాలు లేవు. తాజాగా ‘తడప్’ మూవీ ప్రీమియర్ సందర్భంగా మాత్రం ఇద్దరూ కలిసి ఎంచక్కా జంటగా పోజులిస్తూ అభిమానులకు కనువిందు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సునిల్ శెట్టి కుమారుడు, అతియా సోదరుడు అహాన్ శెట్టి నటించిన తొలి చిత్రమే ‘తడప్’. ఈ క్రమంలో శెట్టి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఫొటోలు దిగుతుండగా.. రాహుల్‌కు ఎక్కడ నిల్చోవాలో అర్థంకాక తికమకపడుతుండగా.. సునిల్ శెట్టి స్వయంగా రాహుల్‌ను అతియా పక్కన నిలబడమనడం విశేషం. ఈ నేపథ్యంలో ‘‘అంకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా ఇంకేంటి రాహుల్.. పద పద.. అక్కడ నిలబడు’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2022 Retention: వీళ్లను వదిలేశారు.. ఈ 11 మంది ఒకే జట్టులో ఉన్నారంటే రికార్డులు బద్దలే! View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
IPL 2022 Retention: ఈ 11 మంది ఒకే జట్టులో ఉన్నారంటే రికార్డులు బద్దలే!
IPL 2022 Retention: Best XI Of Released Players Check Here: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు తాము కొనసాగించాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాను 8 ఫ్రాంఛైజీలు ఇప్పటికే ప్రకటించాయి. గరిష్టంగా నలుగురిని అట్టిపెట్టుకునే అవకాశం ఉండటంతో తమకు అత్యంత ముఖ్యమైన క్రికెటర్ల వైపే మొగ్గుచూపిన యజమాన్యాలు.. కారణాలేవైనా సరే కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను మాత్రం వదిలేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసిన బెస్ట్ ఎలెవన్‌పై ఓ లుక్కేద్దామా! 1.కేఎల్ రాహుల్(పంజాబ్ కింగ్స్) టీమిండియా టీ20 ఫార్మాట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ సారథిగా వ్యవహరించాడు. గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ కర్టాటక ఆటగాడు... ఐపీఎల్-2021 సీజన్లో బ్యాటర్‌గా అత్యుత్తమంగా రాణించాడు. 626 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, వచ్చే సీజన్లో లక్నో ఫ్రాంఛైజీ రాకతో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు రాహుల్ ఒప్పందం చేసుకున్నాడని అందుకే తనను రిటైన్ చేయవద్దని పంజాబ్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తేలాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు. 2.డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్ హైదరాబాద్) సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి టైటిల్ అందించిన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్-2021 సీజన్లో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అతడిని రిలీజ్ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన వార్నర్ కోసం మెగా వేలంలో భారీ డిమాండ్ ఉండటం సహజం. 3. శుభ్‌మన్ గిల్(కోల్‌కతా నైట్‌రైడర్స్) టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను అనూహ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసుకుంది. మరో ఓపెనర్, ఈ సీజన్లో రాణించిన వెంకటేశ్ అయ్యర్ వైపే మొగ్గు చూపింది. అతడి కోసం ఏకంగా 8 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో గిల్ వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేయాలంటూ కేకేఆర్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. 4.శ్రేయస్ అయ్యర్(ఢిల్లీ క్యాపిటల్స్) గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ ఢిల్లీ పగ్గాలు చేపట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో పంత్‌ను రిటైన్ చేసుకున్న ఢిల్లీ అయ్యర్‌ను రిలీజ్ చేసింది. 5. ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్) యువ సంచలనం ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ వదిలేసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముంబైకి భవిష్యత్ కెప్టెన్ అంటూ అభిమానులు సంబరపడుతున్న వేళ ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను కొనసాగించకపోవడంతో షాక్ తగిలింది. ఇషాన్‌కు కూడా వేలంలో మంచి డిమాండ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 6. హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్) ఐపీఎల్-2021లో విఫలమైన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. ఆది నుంచి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌ను ఫిట్నెస్ కష్టాలు వెంటాడుతున్న వేళ అతడిని రిటైన్ చేసుకోకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కాగా 28 ఏళ్ల హార్దిక్ పాండ్యా 85 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1476 పరుగులు చేశాడు. 60 ఇన్నింగ్స్‌లో 42 వికెట్లు పడగొట్టాడు. 7.రషీద్ ఖాన్(సన్‌రైజర్స్ హైదరాబాద్) స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను వదిలేసుకున్నందుకు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రిటెన్షన్‌లో భాగంగా తననే మొదటి పిక్‌గా ఎంచుకోవాలంటూ రషీద్ పట్టుబట్టిన క్రమంలో తలెత్తిన విభేదాల కారణంగానే అతడిని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కారణమేదైనా రషీద్ జట్టును వీడటం నిజంగా పెద్ద దెబ్బే. 8. జోఫ్రా ఆర్చర్(రాజస్తాన్ రాయల్స్) ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్‌ను రాజస్తాన్ రాయల్స్ వదిలేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడమే గాక అవసరమైన సమయంలో హిట్టింగ్ ఆడతాడు. ఇలాంటి ప్లేయర్ కోసం వేలంలో జట్లు పోటీ పడటం సహజం. 9. కగిసో రబడ ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పేసర్లలో కగిసో రబడ కూడా ఒకడు. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్లేయర్ అయిన ఇతడిని ఫ్రాంఛైజీ వదిలేయడం గమనార్హం. వరల్డ్‌క్లాస్ సీమర్ల కోసం వెదుకుతున్న ఫ్రాంఛైజీలకు మెగా వేలంలో అతడొక మంచి ఆప్షన్ అనడంలో సందేహం లేదు. 10.దీపక్ చహర్ చెన్నై నాలుగోసారి చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు టీమిండియా ప్లేయర్ దీపక్ చహర్. కెప్టెన్ ఎంఎస్ ధోని నమ్మకాన్ని గెలుచుకున్న దీపక్‌ను చెన్నై రిలీజ్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే, రవీంద్ర జడేజాతో పాటు ధోని, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకునే క్రమంలో అతడిని వదిలేసింది. 11.యజువేంద్ర చహల్(ఆర్సీబీ) టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వదిలేసింది. నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని రిలీజ్ చేయడం గమనార్హం. అన్నట్లు ఈ 11 మంది ఒకే జట్టులో ఉంటే ఎలా ఉంటుందంటారు? ఐడియా బాగున్నా డిమాండ్‌కు తగ్గట్లు వీళ్లందరికీ భారీ ధర చెల్లించాలంటే ఫ్రాంఛైజీల పర్సులో ఉన్న మొత్తం సరిపోదేమో! చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
‘కేఎల్ రాహుల్ అలా చేస్తే అనైతికమే’
Ness Wadia Says Its Unethical KL Rahul Has Approached By Franchise.. పంజాబ్ కింగ్స్‌ను వీడి కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్లాలని అనుకోవడం అతని ఇష్టమని, అయితే తాము విడుదల చేయక ముందే కొత్త ఫ్రాంచైజీతో చర్చలు జరిపి ఉంటే మాత్రం అది అనైతిక చర్య అని జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. రిటెయినింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే రాహుల్ లక్నో ఫ్రాంచైజీతో సంప్రదింపులు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు సీజన్ల పాటు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్... బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినా, జట్టు మాత్రం ఘోరంగా విఫలమైంది. టీమ్ ఈసారి కూడా అతడిని అట్టి పెట్టుకోవాలని భావించినా అతను అంగీకరించలేదు. చదవండి: IPL 2022: KL Rahul- Rashid Khan: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌పై ఏడాది పాటు నిషేధం!? తప్పుకున్న ఆండీ ఫ్లవర్ పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ తన పదవికి రాజీనామా చేశాడు. రెండు సీజన్లలో అతను పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. లీగ్‌లోని రెండు కొత్త ఫ్రాంచైజీలలో ఒకదాంతో అతను మళ్లీ జత కట్టే అవకాశం ఉంది. కోచ్‌గా మంచి రికార్డు ఉన్న ఫ్లవర్ దాదాపు దశాబ్ద కాలంపాటు ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి పని చేశాడు. చదవండి: IPL 2022 Auction: రాహుల్, రషీద్ ఖాన్‌ను లాక్కొన్నారు.. -
IPL 2022: అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు..!
IPL 2022 Retention: KKR Venkatesh Iyer Received 4000 Percent Hike In Salary: ఒక్కసారి క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోతే చాలు మినిమమ్ లక్షాధికారి అయిపోవచ్చు. అదే.. ఆడే అవకాశం రావడం.. అందునా ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే ఇంక చెప్పేదేముంటుంది. కోట్లు కొల్లగొట్టేయచ్చు. ప్రతిభను నిరూపించుకుంటే చాలు కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఎగబడతాయి. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా ధనవంతులైపోయారు. ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్‌ను రిటెన్షన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ వెచ్చించిన మొత్తమే ఈ ప్రస్తావనకు కారణం. వెంకటేశ్ అయ్యర్‌ను కేవలం 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే, ఐపీఎల్-2021లో భాగంగా యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో అతడు అత్యద్భుతంగా రాణించడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ స్టార్ ఓపెనర్ 370 పరుగులు చేశాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని రిటైన్ చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఫ్రాంఛైజీ.. ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ సాలరీ దాదాపు 40 రెట్లు(4000%) పెరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అయ్యర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలయ్యేవి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా వెంకటేశ్ ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను ఆల్‌రౌండర్‌ను అని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ రిటెన్షన్ విషయానికొస్తే.. కేకేఆర్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)ను కొనసాగిస్తామని ప్రకటించింది. ఇందుకోసం 42 కోట్లు ఖర్చు చేయగా.. కోల్‌కతా పర్సులో ఇంకా 48 కోట్ల రూపాయలు ఉన్నాయి. చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
KL Rahul- Rashid Khan: రాహుల్, రషీద్ ఖాన్‌పై ఏడాది పాటు నిషేధం!?
IPL 2022 Retention KL Rahul Rashid Khan Could Banned Lucknow Approach Reports: ఐపీఎల్-2022 సీజన్లో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ నిషేధం ఎదుర్కోబోతున్నారా? 15వ సీజన్‌కు వీరిద్దరు దూరం కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. తాము ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల ఫిర్యాదు మేరకు బీసీసీఐ తీసుకునే చర్యలపై వీరి ఐపీఎల్ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొంటున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో నవంబరు 30న 8 ఫ్రాంఛైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌తో కలిసి కొనసాగడానికి ఇష్టపడకపోగా.. రషీద్ ఖాన్ తన కోసం 16 కోట్లు వెచ్చిస్తేనే(మొదటి రిటెన్షన్) జట్టులో ఉంటానని పేర్కొన్నట్లు సమాచారం. కానీ, సన్‌రైజర్స్ మాత్రం కేన్ విలియమ్సన్ వైపు మొగ్గు చూపగా రషీద్‌తో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ఫ్రాంఛైజీ లక్నో రాహుల్, రషీద్‌తో సంప్రదింపులు జరిపి... భారీ మొత్తం ఆఫర్ చేయడంతో వీరిద్దరు తమ జట్లను వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్, హైదరాబాద్.. లక్నో ఫ్రాంఛైజీపై ఫిర్యాదు చేసినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ కథనం ప్రచురించింది. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారని, మౌఖికంగా తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాహుల్‌కు 20 కోట్లు, రషీద్‌కు 16 కోట్లు ముట్టజెప్పేందుకు లక్నో అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే రాహుల్, రషీద్ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ఫ్రాంఛైజీతో ఒప్పందాలు చేసుకున్నట్లయితే వారిపై వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఏడాది పాటు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కావాల్సి ఉంటుంది. అయితే, బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే వీరి భవితవ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
IPL Retention: ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!
IPL 2022 Retention Retained Players Money Deducted Remaining Salary Purse Full Details Here: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు మంగళవారం సమర్పించాయి. చెన్నై, ముంబై, పంజాబ్, రాజస్తాన్, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు.. 8 ఫ్రాంఛైజీలు మొత్తంగా 27 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఈ క్రమంలో 15వ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న లక్నో, అహ్మదాబాద్ డిసెంబర్ 25లోగా గరిష్టంగా ముగ్గురు చొప్పున క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన క్రికెటర్లంతా వేలానికి అందుబాటులోకి వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎల్లో భాగమైన 8 జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం ఎంత మొత్తం ఖర్చు చేశాయి? రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ ఫ్రాంఛైజీ పర్సులో ఎంత మిగిలింది అన్న అంశాలను పరిశీలిద్దాం. చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా(16 కోట్లు), ఎంఎస్ ధోని(12 కోట్లు), మొయిన్ అలీ(8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(6 కోట్లు)ను కొనసాగిస్తామని ప్రకటించింది. వీరి కోసం మొత్తంగా 42 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం చెన్నై పర్సులో 48 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్(16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 9 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.50 కోట్లు), నోర్జే (రూ. 6.50 కోట్లు) నలుగురిని రిటైన్ చేసుకుంది. అయితే, అక్షర్, పృథ్వీ షాను వరుసగా 9, 7.5 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసినప్పటికీ రిటెన్షన్ నిబంధనల ప్రకారం పర్సు నుంచి 12 కోట్లు, 8 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్ కోసం 42.5 కోట్లు వెచ్చించగా.. ఆ జట్టు పర్సులో మిగిలిన మొత్తం 47.5 కోట్లు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు)ను రిటైన్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు గానూ పర్సు నుంచి 33 కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా 57 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)ను కేకేఆర్ అట్టిపెట్టుకుంది. అయిఏత రసెల్ కోసం అదనంగా నాలుగు కోట్లు(మొదటి రిటెన్షన్), వరుణ్ చక్రవర్తి కోసం 4 కోట్లు పర్సు నుంచి తీయాల్సి వచ్చింది. దీంతో 42 కోట్లు ఖర్చయ్యాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ పర్సులో మిగిలిన మొత్తం.. 48 కోట్లు. ముంబై ఇండియన్స్ టీమిండియా టీ20 కెప్టెన్, తమ జట్టు సారథి రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను ముంబై ఫ్రాంఛైజీ కొనసాగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్ కోసం 42 కోట్లు ఖర్చు చేసింది. ఇక వారి పర్సులో ఇంకా 48 కోట్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుతో కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు)కు జాక్‌పాట్ తగిలింది. మయాంక్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు)ను పంజాబ్ రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో ఖర్చైన 16 కోట్లు పోనూ.. పంజాబ్ పర్సులో మిగిలిన మొత్తం 72 కోట్లు. కేవలం ఇద్దరినే రిటైన్ చేసుకోవడంతో వేలం సమయానికి అత్యధిక మొత్తం ఈ ఫ్రాంఛైజీ పర్సులోనే ఉండటం విశేషం. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ (రూ. 14 కోట్లు), జాస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు)ను రాజస్తాన్ కొనసాగించనుంది. ఈ క్రమంలో 28 కోట్లు ఖర్చు కాగా.. ఇంకా 62 కోట్లు పర్సులో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మలిక్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు) మొత్తంగా ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇందుకోసం 22 కోట్లు వెచ్చించగా.. పర్సులో మిగిలిన మొత్తం 68 కోట్లు. ►కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ పర్సులో 90 కోట్ల రూపాయలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య సాలరీ(రూపాయల్లో) పర్సు నుంచి తీసిన మొత్తం(రూపాయల్లో) వేలానికి పర్సులో ఉన్న మొత్తం(రూపాయల్లో) ఢిల్లీ క్యాపిటల్స్ 4 39 కోట్లు 42.5 కోట్లు 47.5 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ 4 42 కోట్లు 42 కోట్లు 48 కోట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3 33 కోట్లు 33 కోట్లు 57 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 34 కోట్లు 42 కోట్లు 48 కోట్లు ముంబై ఇండియన్స్ 4 42 కోట్లు 42 కోట్లు 48 కోట్లు పంజాబ్ కింగ్స్ 2 16 కోట్లు 18 కోట్లు 72 కోట్లు రాజస్తాన్ రాయల్స్ 3 28 కోట్లు 28 కోట్లు 62 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 22 కోట్లు 22 కోట్లు 68 కోట్లు చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్ అనౌన్స్మెంట్’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు! -
IPL Retention: ఆ 6 స్థానాల్లో ఎవరు? భారీ డిమాండ్.. వార్నర్, రాహుల్ ఇంకా..
IPL Retention: 27 Players Retained By 8 Existed Teams What About New Teams: ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాము కొనసాగించే ఆటగాళ్ల జాబితాను 8 జట్లు ప్రకటించేశాయి. మొత్తంగా 27 మంది క్రికెటర్లను రిటైన్ చేసుకోనున్నట్లు ఆయా ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. ఇప్పుడు రిటైనింగ్లో ఎనిమిది టీమ్‌లు తమ వద్దే ఉంచుకున్న ఆటగాళ్లను మినహాయించగా... మిగిలిన క్రికెటర్ల నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంచుకుంటాయి. అహ్మదాబాద్, లక్నో జట్లు డిసెంబర్ 25లోగా గరిష్టంగా ముగ్గురు చొప్పున క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వారంతా వేలంలో అందుబాటులోకి వస్తారు. ఈ ఆరు స్థానాల కోసం వార్నర్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రషీద్ ఖాన్, డుప్లెసిస్, ధావన్, స్టొయినిస్, ఇషాన్ కిషన్, హార్దిక్, షారుఖ్ ఖాన్, స్టోక్స్, ఆర్చర్, చహల్, బెయిర్‌స్టో, హోల్డర్, ముజీబ్ తదితర ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండబోతోంది. కాగా ఐపీఎల్-2022 సీజన్లో 10 జట్లు పోటీపడనున్న విషయం తెలిసిందే. రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించి లక్నో జట్టును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్‌ను దక్కించుకుంది. ఇక కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌ను సొంతం చేసుకునేందుకు లక్నో ఫ్రాంఛైజీ వారిని ప్రలోభాలకు గురిచేసిందంటూ పంజాబ్, హైదరాబాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒకవేళ నిజంగానే లక్నో రాహుల్‌ను కొనుగోలు చేస్తే అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. చదవండి: IPL Retention: వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు.. పెద్దగా మార్పులు లేవు.. అయితే! ఐపీఎల్-2022లో 8 జట్లు ఆడినట్లే ఇకపైనా 10 జట్లు కూడా లీగ్ దశలో 14 మ్యాచ్‌లే ఆడతాయి. అయితే రెండు జట్ల వల్ల మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74కు చేరింది. అయితే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు తలపడతాయి. ఈ ఐదు జట్ల మధ్య ఇంటా (4), బయటా (4) ఎనిమిది మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం అవతలి గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, ఒక్క జట్టుతో మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడటం ద్వారా 14 మ్యాచ్‌లు పూర్తవుతాయి. చదవండి: Ipl Retention: రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. జడేజాకు భారీ ధర.. పూర్తి వివరాలు! -
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. జడేజాకు భారీ ధర.. పూర్తి వివరాలు!
కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు... మొత్తంగా చూస్తే అంచనాలకు అనుగుణంగానే ఐపీఎల్ ‘రిటెన్షన్’ సాగింది... సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. సన్‌రైజర్స్‌తో రషీద్ ఖాన్ బంధం ముగియగా, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదిలేసింది. డుప్లెసిస్‌కంటే మొయిన్ అలీ వైపే చెన్నై సూపర్ కింగ్స్ మొగ్గు చూపగా, పొలార్డ్‌లో ఇంకా పవర్ మిగిలి ఉందని ముంబై నమ్మింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా గిల్‌లాంటి కుర్రాడిని కాదని రసెల్‌లాంటి వెటరన్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. 2022 రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తున్న నేపథ్యంలో ఈ కొనసాగింపు ఆసక్తి రేపింది. ఇక కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో ఎంచుకునే తర్వాతి ఆరుగురు ఎవరనేది చూడాలి. ఐపీఎల్ జట్లు తమతో అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (ప్రాధాన్యత క్రమంలో) చెన్నై సూపర్ కింగ్స్ 1. జడేజా (రూ. 16 కోట్లు) 2. ధోని (రూ. 12 కోట్లు) 3. మొయిన్ అలీ (రూ. 8 కోట్లు) 4. రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు) విశేషాలు: ధోని కాకుండా జడేజాకు తొలి ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన అలీను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాగా, రుతురాజ్‌కు మరో మంచి అవకాశం దక్కింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 1. కోహ్లి (రూ.15 కోట్లు) 2. మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు) 3. సిరాజ్ (రూ. 7 కోట్లు) విశేషాలు: హర్షల్‌తో పోటీ ఉన్నా టీమిండియాలో రెగ్యులర్ పేసర్‌గా మారిన సిరాజ్ వైపు జట్టు మొగ్గు చూపింది. నాలుగో ఆటగాడిగా చహల్‌ను తీసుకునే అవకాశం ఉన్నా ఆసక్తి చూపించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 1. రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు) 2. అక్షర్ పటేల్ (రూ. 9 కోట్లు) 3. పృథ్వీ షా (రూ. 7.50 కోట్లు) 4. నోర్జే (రూ. 6.50 కోట్లు) విశేషాలు: దాదాపుగా ఊహించినట్లే ఉంది. సీనియర్లు అశ్విన్, ధావన్‌లను వద్దనుకుంది. నిలకడగా ఆడుతున్న నోర్జేకు అవకాశం దక్కగా, శ్రేయస్ తనే స్వయంగా తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్ 1. మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు) 2. అర్‡్షదీప్ సింగ్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు) విశేషాలు: జట్టుతో కొనసాగడానికి కేఎల్ రాహుల్ ఇష్టపడలేదు. ఇటీవల డిమాండ్ పెరిగిన తమిళనాడు ప్లేయర్ షారుఖ్ ఖాన్ కూడా వేలంలో వెళ్లేందుకు ఆసక్తి చూపించి ఉండవచ్చు. అయితే వేలంలో ఇంత భారీ విలువ దక్కే అవకాశం లేని మయాంక్‌ను రూ. 12 కోట్లకు తీసుకోవడం అతనికి లభించిన జాక్‌పాట్. గత సీజన్లో ఆకట్టుకున్న అర్‡్షదీప్‌ను స్థానిక ఆటగాడిగా కొనసాగించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ 1. ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు) 2. వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు) 3. వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు) 4. సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు) విశేషాలు: చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చి చాలా కాలమైనా రసెల్‌పై ఫ్రాంచైజీ నమ్మకముంచింది. నరైన్‌పై ఇన్నేళ్ల తర్వాత కూడా ఆశలు పెట్టుకోగా... మిగిలిన రెండు ఊహించినవే. మున్ముందు కెప్టెన్ కాగలడని భావించిన శుబ్‌మన్ గిల్‌ను వదిలేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 1. కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు) 2. అబ్దుల్ సమద్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు) 3. ఉమ్రాన్ మలిక్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు) విశేషాలు: విలియమ్సన్‌ను ఇంత భారీ మొత్తంతో కొనసాగించడం పెద్ద విశేషం. ఫ్రాంచైజీతో విభేదాలతో వార్నర్ మళ్లీ రాడనే ముందే తెలిసిపోగా... రషీద్ తనకు ఇవ్వచూపిన మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేసి వేలానికి సిద్ధపడ్డాడు. జోరు తగ్గిన భువనేశ్వర్‌ను వద్దనుకున్న ఫ్రాంచైజీ... మంచి విజయాలందించిన బెయిర్స్టోనూ పట్టించుకోలేదు. ముంబై ఇండియన్స్ 1. రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు) 2. బుమ్రా (రూ. 12 కోట్లు) 3. సూర్యకుమార్ (రూ. 8 కోట్లు) 4. పొలార్డ్ (రూ. 6 కోట్లు) విశేషాలు: ఇటీవలి ఫామ్, ఫిట్నెస్ చూస్తే హార్దిక్‌ను తప్పించడం ఊహించిందే. అయితే విధ్వంసక ఆట, కీపింగ్‌తో పాటు రాబోయే సీజన్లలోనూ ప్రభావం చూపగల ఇషాన్‌ను తీసుకోకపోవడం అనూహ్యం. 35 ఏళ్ల పొలార్డ్‌కు మరో అవకాశం ఇవ్వడం కూడా సరైన నిర్ణయంగా అనిపించలేదు. రాజస్తాన్ రాయల్స్ 1. సంజు సామ్సన్ (రూ. 14 కోట్లు) 2. జాస్ బట్లర్ (రూ. 10 కోట్లు) 3. యశస్వి జైస్వాల్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు) విశేషాలు: కెప్టెన్‌గా ఆకట్టుకున్న సామ్సన్, దూకుడైన బట్లర్‌లను కొనసాగించడం సరైందే. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ ఇబ్బందులు ఉన్న ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్లపై సహజంగానే భారీ మొత్తం పెట్టేందుకు రాజస్తాన్ రాయల్స్ ఆసక్తి చూపించలేదు. -
ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. కోహ్లికు ఎన్ని కోట్లంటే..
Rcb retained Virat Kohli, Glenn Maxwell for the Vivo IPL 2022 season: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను మంగళవారం(నవంబర్ 30) ప్రకటించాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. ఈ జట్టులో విరాట్ కోహ్లిను అత్యధికంగా 15 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని 11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు 7 కోట్లు వెచ్చించారు. కాగా ఐపీఎల్-2021 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL Retention: వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు.. -
వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు..
David Warner Confirms SRH Has No Intentions Of Keeping Him Ahead Of Retention Day: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి సమయం ఆసన్నమైంది. ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం (నవంబర్ 30) రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే డేవిడ్ వార్నర్‌ను విడిచి పెట్టేందుకు సన్‌రైజర్స్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే సన్‌రైజర్స్ నుంచి అధికారిక ప్రకటనకు ముందే డేవిడ్ వార్నర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. వచ్చే సీజన్‌కుగాను ఫ్రాంచైజీ తనని నిలుపుకోదని వార్నర్ సృష్టం చేశాడు. కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అభిమాని .. 'మిమ్మల్ని సన్‌రైజర్స్ రీటైన్ చేసుకుంటే, మీరు ఆడుతారా'..? అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "వాళ్లు నన్ను రీటైన్ చేయరు, నేను దాని గురించి ఆలోచించడం లేదు" అంటూ వార్నర్ రాసుకొచ్చాడు. ఇక డేవిడ్ భాయ్‌తో పాటు ఎన్నో మ్యాచ్‌ల్లో ఆ జట్టును ఒంటి చేత్తో గెలిపించిన జానీ బెయిర్‌స్టోను కూడా సన్‌రైజర్స్ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా రషీద్ ఖాన్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి సన్‌రైజర్స్.. విలియమ్సన్ , అబ్దుల్ సమద్ ,ఉమ్రాన్ మాలిక్ రిటైన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు 'తమ ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ క్యాప్షన్ పెట్టింది. చదవండి: IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు! -
అతడు వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే..
Irfan Pathan feels KKRs all rounder Venkatesh Iyer can become a hot pick at a mega auction: ఐపీఎల్ 14వ సీజన్లో అదరగొట్టిన కేకేఆర్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఒక వేళ అయ్యర్‌ను కోల్‌కతా రీటైన్ చేసుకోపోతే.. రానున్న మెగా వేలంలో అయ్యర్‌కు భారీ ధర దక్కనుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును నవంబర్ 30 న సమర్పించునున్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆయా జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఆ జాబితాలో కచ్చితంగా ఒక విదేశీ ఆటగాడు ఉండాలి. "కేకేఆర్‌లో రస్సెల్, సునీల్ నరైన్ స్టార్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. వాళ్లు ఎన్నో అద్బుతమైన విజయాలు ఆ జట్టుకు అందించారు. కావున వాళ్లు ఇద్దరినీ వేలానికి విడుదల చేయడానికి కేకేఆర్ ఇష్టపడకపోవచ్చు. కానీ రస్సెల్, సునీల్ నరైన్ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. అయితే వాళ్లకు తమదైన రోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉంది. మరోవైపు కేకేఆర్ లాకీ ఫెర్గూసన్ గురించి ఆలోచించవచ్చు. అతడు కొత్త బంతితో యార్కర్లను బౌలింగ్ చేయడంలో దిట్ట. ప్యాట్ కమ్మిన్స్ కంటే లూకీ ఫర్గూసన్‌ని అట్టిపెట్టుకుంటే మంచిది అని" పఠాన్ పేర్కొన్నాడు. ఇక మూడో ఆటగాడి గురించి మాట్లాడూతూ.. శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ గత సీజన్లో అద్బుతంగా రాణించాడు. నాలుగో స్థానం కోసం వరుణ్ చక్రవర్తి లేదా నితీష్ రానా గురించి కేకేఆర్ ఆలోచిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం నాలుగవ ఆటగాడిగా వెంకటేష్ అయ్యర్‌ను రీటైన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అతడు బ్యాట్‌తోను, బాల్‌తో రాణించగలడు. ఒక వేళ అయ్యర్ వేలం లోకి వెళ్తే.. అతడిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడతాయి అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. చదవండి: Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్ హాగ్ -
IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? జడ్డూ కోసం 16 కోట్లు!
IPL 2022 Auction: KKR RCB SRH RR All 8 Teams Probable Retentions: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును సమర్పించే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఇప్పటికే 8 జట్లు తుది జాబితాను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? అన్న విషయాలపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ఫ్రాంఛైజీలు.. మెగా వేలానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్ రూల్స్, ఏయే జట్లు ఎవరిని రీటైన్ చేసుకుంటున్నాయి, అందుకోసం ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది అన్న అంశాలను పరిశీలిద్దాం. ఐపీఎల్ 2022 మెగా వేలం- రిటెన్షన్ నిబంధనలు? రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంఛైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉండవచ్చు. వీళ్ల కోసం సాలరీ పర్స్‌లో 90 కోట్ల నుంచి.. ఫ్రాంఛైజీ 42 కోట్ల రూపాయలు ఖర్చు చేయవచ్చు. రిటైన్ జాబితాలో ఉన్న మొదటి ఆటగాడి కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఉదాహరణకు: చెన్నై సూపర్‌కింగ్స్ తమ మొదటి పిక్‌గా రవీంద్ర జడేజాను ఎంచుకుందన్న వార్తల నేపథ్యంలో అతడి కోసం పర్సు నుంచి 16 కోట్లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. రిటెన్షన్ విధానంలో నలుగురు ప్లేయర్ల కోసం వెచ్చించాల్సిన మొత్తం- 42 కోట్ల రూపాయలు. ►మొదట రిటైన్ చేసుకున్న ఆటగాడి కోసం- రూ.16 కోట్లు ►రెండో ప్లేయర్ కోసం- 12 కోట్లు ►మూడో ప్లేయర్ కోసం- 8 కోట్లు ►నాలుగో ప్లేయర్ కోసం- 6 కోట్లు ముగ్గురు ప్లేయర్ల కోసం వెచ్చించాల్సిన మొత్తం- 33 కోట్ల రూపాయలు ►ప్లేయర్ 1- రూ. 15 కోట్లు ►ప్లేయర్ 2- రూ. 11 కోట్లు ►ప్లేయర్ 3- రూ. 7 కోట్లు ఇద్దరు ప్లేయర్ల రిటెన్షన్ కోసం వెచ్చించాల్సిన మొత్తం- 24 కోట్ల రూపాయలు ►ప్లేయర్ 1- రూ. 14 కోట్లు ►ప్లేయర్ 2- రూ. 10 కోట్లు. ►కేవలం ఒకే ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకునేందుకు వెచ్చించాల్సిన మొత్తం 14 కోట్ల రూపాయలు. ఏయే జట్లు ఏ ఆటగాళ్లను రీటైన్ చేసుకుంటున్నాయంటే? ►చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే)- రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ. ►కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)- సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్. ►సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్): కేన్ విలియమ్సన్ ►ముంబై ఇండియన్స్(ఎంఐ)- రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ►రాయల్ చాలెంజన్స్ బెంగళూరు(ఆర్సీబీ)- విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్. ►ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)- రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే. ►రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్)- సంజూ శాంసన్(14 కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం) రిలీజ్ చేస్తున్న ఆటగాళ్ల జాబితా! ►కేకేఆర్- ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పాట్ కమిన్స్. ►ఎస్ఆర్హెచ్- కేన్ విలియమ్సన్ రిటెన్షన్ మినహా ఏ ఆటగాడి గురించి ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ►ఢిల్లీ క్యాపిటల్స్- శిఖర్ ధావన్, అశ్విన్, శ్రేయస్ అయ్యర్, కగిసో రబడ ►రాజస్తాన్ రాయల్స్- బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, కార్తిక్ త్యాగి, రాహుల్ తెవాటియా ►పంజాబ్ కింగ్స్- ఏ ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోవడం లేదని సమాచారం. చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్ అనౌన్స్మెంట్’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు!