Courtesy: IPL
Ness Wadia Says Its Unethical KL Rahul Has Approached By Franchise.. పంజాబ్ కింగ్స్‌ను వీడి కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్లాలని అనుకోవడం అతని ఇష్టమని, అయితే తాము విడుదల చేయక ముందే కొత్త ఫ్రాంచైజీతో చర్చలు జరిపి ఉంటే మాత్రం అది అనైతిక చర్య అని జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. రిటెయినింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే రాహుల్ లక్నో ఫ్రాంచైజీతో సంప్రదింపులు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు సీజన్ల పాటు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్... బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినా, జట్టు మాత్రం ఘోరంగా విఫలమైంది. టీమ్ ఈసారి కూడా అతడిని అట్టి పెట్టుకోవాలని భావించినా అతను అంగీకరించలేదు.
చదవండి: IPL 2022: KL Rahul- Rashid Khan: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌పై ఏడాది పాటు నిషేధం!?
తప్పుకున్న ఆండీ ఫ్లవర్
పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ తన పదవికి రాజీనామా చేశాడు. రెండు సీజన్లలో అతను పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. లీగ్‌లోని రెండు కొత్త ఫ్రాంచైజీలలో ఒకదాంతో అతను మళ్లీ జత కట్టే అవకాశం ఉంది. కోచ్‌గా మంచి రికార్డు ఉన్న ఫ్లవర్ దాదాపు దశాబ్ద కాలంపాటు ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి పని చేశాడు.
చదవండి: IPL 2022 Auction: రాహుల్, రషీద్ ఖాన్‌ను లాక్కొన్నారు..
Comments
Please login to add a commentAdd a comment