ఐపీఎల్ మెగావేలం ముగిసింది. మెగావేలంలో తమకు ఇష్టమైన ఆటగాళ్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక కెప్టెన్ల వేట మొదలుపెట్టనున్నాయి. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎంపికచేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ప్రకటించనుంది. కాగా వేలంలో ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. ''జట్టు కెప్టెన్‌గా ధావన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్న ధావన్ పంజాబ్ కెప్టెన్‌గా జట్టును తన భుజాలపై మోస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు కోచ్ కూడా ధావన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. తొందర్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుంది.'' అంటూ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఒక కీలక వ్యక్తి తెలిపారు.
చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం
కాగా 12 కోట్లతో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే సీనియారిటీ ప్రకారం ధావన్ కెప్టెన్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో కెప్టెన్ ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. ఇక ఈసారి కచ్చితంగా కప్ సాధించాలాని అనుకుంటున్న పంజాబ్ వేలంలో నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది.
లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు వేలంలో కొనుగోలు చేసింది. మరి ఈసారైనా పంజాబ్ రాత మారుతుందో లేదో చూడాలి. ఇక పంజాబ్ కింగ్స్ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో భారత క్రికెటర్లు 18 మంది ఉండగా.. ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఆటగాళ్లపై పంజాబ్ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది.
చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు
Comments
Please login to add a commentAdd a comment