IPL 2022: Shikhar Dhawan Reveals About His Rejected Love Proposal In Interview, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shikar Dhawan: 'లవ్‌ ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేసింది.. కోహినూర్‌ డైమండ్‌ను మిస్సయ్యావు!'

Published Wed, Apr 6 2022 6:10 PM | Last Updated on Wed, Apr 6 2022 7:02 PM

IPL 2022: Shikhar Dhawan Recalls Reaction Girl Rejectt His Proposal Viral - Sakshi

Courtesy: IPL TWitter

టీమిండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ అభిమానులను సంతోషపరచడంలో ముందుంటాడు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ధావన్‌ సినిమా డైలాగ్స్‌, డ్యాన్స్‌లతో ఎన్నోసార్లు అలరించాడు. ధావన్‌కు టీమిండియా గబ్బర్‌ అని ముద్దుపేరు ఉంది. టీమిండియా ఓపెనర్‌గా మంచి పేరు సంపాదించిన శిఖర్‌ ధావన్‌ 149 వన్డేల్లో 6284 పరుగులు, 34 టెస్టుల్లో 2315 పరుగులు, 68 టి20ల్లో 1759 పరుగులు సాధించి కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 


Courtesy: IPL TWitter
తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌ 2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్‌ రెండు మ్యాచ్‌ల్లో 92 పరుగులు చేశాడు. ఏప్రిల్‌ 8న బ్రబౌర్న్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ఆడేందుకు పంజాబ్‌ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ క్యాండిడ్‌ కాన్వర్జేషన్‌ పేరిట శశి దిమన్‌కు ఇచ్చిన ఫన్నీ ఇంటర్య్వూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్య్వూలో ధావన్‌ తన వ్యక్తిగత విషయాలను చాలానే పంచుకున్నాడు. అయితే అందులో ఒకటి మాత్రం బాగా పేలింది. క్రికెట్‌ ఆడుతున్న కొత్తలో ఒక అమ్మాయి ధావన్‌ లవ్‌ ప్రపోజల్‌ను రిజెక్ట్‌ చేసిన విషయాన్ని పేర్కొన్నాడు.


Courtesy: IPL TWitter
''అవి నేను క్రికెట్‌లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. ఆ సమయంలో ఒక అమ్మాయి(పేరు చెప్పలేను) బాగా నచ్చి ప్రపోజ్‌ చేశాను. ఆమె నన్ను రిజెక్ట్‌ చేసింది. కారణం.. నేను అప్పట్లో కాస్త నల్లగా ఉండేవాడిని(ఇప్పుడు కూడా పెద్ద కలర్‌ కాదనుకోండి).. అంతే కాదు నా ముఖంపై మచ్చలు ఉండడంతో నా లవ్‌ను రిజెక్ట్‌ చేసింది. ఆ తర్వాత ఆమెకు నేను ఇచ్చిన కౌంటర్‌ సమాధానం ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు కోహినూర్‌ డైమండ్‌ను రిజెక్ట్‌ చేశావు.. ఇలాంటివాడు నీకు మళ్లీ దొరక్కపోవచ్చు..''  అంటూ ముసిముసిగా నవ్వాడు. ఈ వీడియోనూ పంజాబ్‌ కింగ్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. మీరు ఒక లుక్కేయండి.

చదవండి: Kohli-Maxwell: మ్యాక్స్‌వెల్‌ టెన్షన్‌ పోగొట్టేందుకు కోహ్లి ఏం చేశాడంటే!

IPL 2022 RR Vs RCB: కోహ్లి ఎందుకంత బద్దకం.. వీడియో వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement