IPL 2023 PBKS Vs KKR Match: Shikhar Dhawan Forgets His 4th Overseas Player During Toss, Video Viral - Sakshi
Sakshi News home page

Shikar Dhawan: 'వయసుతో పాటు మతిమరుపు'

Published Sat, Apr 1 2023 4:35 PM | Last Updated on Sat, Apr 1 2023 5:34 PM

Dhawan Forgets 4th-Overseas Player During-Toss IPL 2023 Vs KKR Match - Sakshi

Photo: Jio Cinema Twitter

టీమిండియా సీనియర్‌ ఆటగాడు.. ముద్దుగా గబ్బర్‌ అని పిలుచుకునే శిఖర్‌ ధావన్‌ పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన ఐపీఎల్‌ 16వ సీజన్‌ ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిఖర్‌ ధావన్‌ పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

శనివారం పంజాబ్‌ కింగ్స్‌ కేకేఆర్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టాస్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  టాస్‌ అనంతరం జట్టులో ఎవరు ఉన్నారనే దానిపై కెప్టెన్‌ మాట్లాడడం ఆనవాయితీ. మురళీ కార్తిక్‌ ధావన్‌ను తుది జట్టు గురించి అడిగాడు. ధావన్‌ తుదిజట్టు గురించి మాట్లాడుతూ విదేశీ ఆటగాళ్ల పేర్లు చెబుతున్న సమయంలో ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పాడు.

బానుక రాజపక్స, నాథన్‌ ఎల్లిస్‌, సామ్‌ కరన్‌ ఇంకా.. అంటూ ఆగిపోయాడు. ఆ తర్వాత..'' నాలుగో ఆటగాడి పేరు మరిచిపోయా.. క్షమించండి'' అని పేర్కొన్నాడు. దీంతో అక్కడ నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంతకు ధావన్‌ మరిచిపోయిన నాలుగో విదేశీ క్రికెటర్‌ ఎవరో తెలుసా.. జింబాబ్వే సంచలనం సికందర్‌ రజా. అయితే ధావన్‌ చర్యను క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేశారు.. 37 ఏళ్లు వచ్చాయి.. వయసు పెరుగుతోంది.. అందుకే మతిమరుపు కూడా అంటూ కామెంట్‌ చేశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 100 పరుగులు దాటింది. రాజపక్స అర్థసెంచరీతో దాటిగా ఆడుతుండగా.. ధావన్‌ అతనికి సహకరిస్తున్నాడు.

చదవండి: 16 కోట్లు! ఇంతకీ ఏం చేశాడు? దండుగ అంటూ ట్రోల్స్‌! కానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement