Photo: IPL Website
ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ యాస అర్థం కాక కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా అయోమయానికి గురయ్యాడు.
అయితే దీనిపై తర్వాత డుప్లెసిస్ క్లారిటీ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. టాస్ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా కాయిన్ గాల్లోకి ఎగరేశాడు. ఆ సమయంలో డుప్లెసిస్ హెడ్స్ అన్నాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. అయితే మ్యాచ్ రిఫరీతోపాటు నితీష్ రానా కూడా డుప్లెసిస్ టెయిల్స్ అన్నాడనుకొని టాస్ కేకేఆర్ గెలిచినట్లు భావించారు.
కానీ తాను హెడ్స్ అన్నట్లు డుప్లెసిస్ చెప్పాడు. ఆ సమయంలో టాస్ నిర్వహిస్తున్న సంజయ్ మంజ్రేకర్ కూడా ఫాఫ్.. హెడ్స్ అన్నాడని స్పష్టం చేశాడు. దీనిపై నితీష్ అసహనం వ్యక్తం చేస్తూ పక్కకెళ్లిపోయాడు. ఇది నీకు ఓకే కదా అని మంజ్రేకర్ అడిగినా అతడు పట్టించుకోలేదు. దీనిపై డుప్లెసిస్ వివరణ ఇచ్చాడు. "మొదట బౌలింగ్ చేస్తాం. నా యాస అర్థం కాక నితీష్ రాణా కాస్త తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నాడు" అని డుప్లెసిస్ చెప్పాడు. ఈ నిర్ణయంపై నితీష్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి ఉంటే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని నితీష్ రాణా పేర్కొన్నాడు.
అయితే డుప్లెపసిస్ అర్థం కాని యాస కేకేఆర్‌కు ఒక రకంగా మేలు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ మొదట్లో తడబడినా ఆఖర్లో శార్దూల్, రింకూ సింగ్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ దారుణ ఆటతీరును కనబరిచింది. 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇక ఈ సీజన్‌లో రాత్రి పూట మంచు కారణంగా టాస్ గెలిచిన జట్లు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి.
.@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪
— JioCinema (@JioCinema) April 6, 2023
Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI
Comments
Please login to add a commentAdd a comment