కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే ఒక దశలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఆకాశ్ దీప్(8 బంతుల్లో 17), డేవిడ్ విల్లే(20 బంతుల్లో 20 నాటౌట్)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీ పరువు నిలబడింది. లేకుంటే వంద పరుగులలోపే ఆలౌటై ఘోర పరాజయాన్నే మూటగట్టుకునేదే. డుప్లెసిస్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు తీయగా.. సుయాశ్‌శర్మ మూడు, సునీల్ నరైన్ రెండు వికెట్లు, శార్దూల్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఓటమి దిశగా ఆర్‌సీబీ.. 86 పరుగులకే 8 వికెట్లు డౌన్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
టార్గెట్ 205.. 54కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ
205 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. 8 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. బ్రాస్‌వెల్ ఆరు, షాదాబ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
శార్దూల్, రింకూ సింగ్ మెరుపులు.. ఆర్‌సీబీ టార్గెట్ 205
శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 69,9 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకముందు రహమనుల్లా గుర్బాజ్ 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మలు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్, ఆకాశ్‌దీప్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Photo Credit : IPL Website
శార్దూల్ దూకుడు.. 16 ఓవర్లలో కేకేఆర్ 147/5
ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్‌తో దూకుడు ప్రదర్శిస్తుండడంతో కేకేఆర్ 16 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శార్దూల్ 19 బంతుల్లో 47, రింకూ సింగ్ 21 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
94 పరుగులకే ఐదు వికెట్లు
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ కష్టాల్లో పడింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కర్ణ్ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
Photo Credit : IPL Website
9 ఓవర్లలో కేకేఆర్ 71/3
9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 47 పరుగులతో ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ విల్లే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్(3), మణిదీప్(0) పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న ఆర్‌సీబీ
ఐపీఎల్ 16వ సీజన్ 9వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్తలపడుతున్నాయి. ఈడెన్స్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయంపై కన్నేసింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ ఫీల్డింగ్ ఏంచుకుంది.
.@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪
Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI
— JioCinema (@JioCinema) April 6, 2023
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ జోరు కొనసాగించాలని భావిస్తోంది. సొంత గడ్డపై గెలిచి, టోర్నమెంట్‌లో బోణీ కొట్టాలని నితీశ్ రానా సేన పట్టుదలతో ఉంది. ముంబైపై హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. సమిష్టిగా సత్తా చాటడంపై కేకేఆర్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment