
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ దారుణ ఫీల్డింగ్ కనబరిచింది. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఆర్‌సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తొలుత నితీష్ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌కుమార్ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా షాట్ ఆడగా.. సిరాజ్ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు.
ఇక రెండోసారి సిరాజ్ బౌలింగ్‌ఓ ఫైన్‌లెగ్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ మరోసారి క్యాచ్‌ను జారవిడిచాడు. ఇక ముచ్చటగా మూడోసారి మ్యాక్స్‌వెల్ వదిలేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రానా లాంగాన్ దిశగా ఆడగా.. మ్యాక్స్‌వెల్ కాస్త వేగంగా స్పందించి ఉంటే ఉంటే క్యాచ్ దొరికేది. ఇలా మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రానా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
Photo: IPL Twitter
కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డు
సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే నితీశ్ రానా ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నితీశ్ రానా కొట్టిన నాలుగు సిక్సర్లతో వంద సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్ 180 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా.. వంద సిక్సర్లతో నితీశ్ రానా రెండో స్థానంలో, 85 సిక్సర్లతో యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్పలు సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్నారు.
Nitish is scoring Run Rana Run 😅@KKRiders' skipper goes 💥 back-to-back 💪#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/I3fNVedeSr
— JioCinema (@JioCinema) April 26, 2023
చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు