రిషభ్ పంత్ (PC: BCCI)
ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వచ్చింది. భారత వికెట్ కీపర్, హిట్టర్ రిషభ్ పంత్‌ను క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఐపీఎల్-2025లో క్యాపిటల్స్ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ టీమ్ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది.
జీఎంఆర్ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం.
ఆ నలుగురు జట్టుతోనే
దాంతో తమ స్టార్ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్... 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్ రేట్‌తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు.
కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్‌కు భారీ డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం.
చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్
Comments
Please login to add a commentAdd a comment