
Rashid Khan Will Fetch Above 16 Crores In IPL mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రషీద్ ఖాన్‌ను రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రానున్న మెగా వేలంలో రషీద్‌కు భారీ ధర దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప కూడా ఇటువంటి వాఖ్యలే చేశాడు.
"రషీద్ ఖాన్‌కు వచ్చే మెగా వేలంలో తప్పకుండా 16 కోట్లకు పైగా దక్కుతుంది" అని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. రషీద్ ఖాన్ తన కోసం 16 కోట్లు వెచ్చిస్తేనే(మొదటి రిటెన్షన్) జట్టులో ఉంటానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే రషీద్‌ని కాదు అని ఆజట్టు కెప్టెన్ విలియమ్సన్ వైపే మెగ్గు చూపింది. దీంతో ఆ ప్రాంఛైజీతో రషీద్ ఖాన్‌కు విభేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
కాగా సన్‌రైజర్స్ రషీద్‌ను రెండో రిటెన్షన్‌గా ఉంచాలని భావించింది. అంటే అతడికి 11 కోట్లు చెల్లంచడానికి సిద్దంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీన్ని అతడు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఫ్రాంఛైజీ లక్నోతో ఇప్పటికే రషీద్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అదే విధంగా ఎస్‌ఆర్‌హెచ్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)లను రీటైన్ చేసుకుంది.