KL Rahul And Athiya Shetty First Appearance In Tadap Premiere Video Goes Viral - Sakshi
Sakshi News home page

KL Rahul- Athiya Shetty: హే.. అంకుల్‌ ఓకే అన్న తర్వాత ఇంకేంటి రాహుల్‌.. వెళ్లు అక్కడ నిలబడు

Published Thu, Dec 2 2021 4:11 PM | Last Updated on Thu, Dec 2 2021 5:18 PM

KL Rahul Athiya Shetty First Public Appearance Tadap Premiere Video Viral - Sakshi

PC: Manav Manglani Istagram

KL Rahul Athiya Shetty First Public Appearance Tadap Premiere Video Viral Fans Funny Trolls: గత కొన్ని రోజులుగా టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా కొనసాగేందుకు ఇష్టపడని రాహుల్‌.. కొత్తగా రాబోయే లక్నో ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్నాడంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒకవేళ అవే గనుక నిజమైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు అతడిపై ఏడాది పాటు వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

కెరీర్‌ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. బాలీవుడ్‌ నటుడు సునిల్‌ శెట్టి కూతురు, నటి అతియా శెట్టితో రాహుల్‌ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో వీరు చేసే పోస్టులు, కలిసి యాడ్స్‌లో నటించడం సహా వీలు చిక్కినప్పుడల్లా డేటింగ్‌లకు వెళ్లడం వీటికి మరింత ఊతమిచ్చాయి. అయితే, ఇద్దరూ కలిసి బయట ఎక్కడా ఫొటోలకు పోజులిచ్చిన సందర్భాలు లేవు. తాజాగా ‘తడప్‌’ మూవీ ప్రీమియర్‌ సందర్భంగా మాత్రం ఇద్దరూ కలిసి ఎంచక్కా జంటగా పోజులిస్తూ అభిమానులకు కనువిందు చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా సునిల్‌ శెట్టి కుమారుడు, అతియా సోదరుడు అహాన్‌ శెట్టి నటించిన తొలి చిత్రమే ‘తడప్‌’. ఈ క్రమంలో శెట్టి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఫొటోలు దిగుతుండగా.. రాహుల్‌కు ఎక్కడ నిల్చోవాలో అర్థంకాక తికమకపడుతుండగా.. సునిల్‌ శెట్టి స్వయంగా రాహుల్‌ను అతియా పక్కన నిలబడమనడం విశేషం. ఈ నేపథ్యంలో ‘‘అంకుల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడుగా ఇంకేంటి రాహుల్‌.. పద పద.. అక్కడ నిలబడు’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: IPL 2022 Retention: వీళ్లను వదిలేశారు.. ఈ 11 మంది ఒకే జట్టులో ఉన్నారంటే రికార్డులు బద్దలే!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement