RCB Batter Rajat Patidar Ruled Out Of IPL 2023 Due To Achilles Heel Injury - Sakshi
Sakshi News home page

IPL 2023: ఆర్సీబీకి బిగ్‌ షాక్‌.. స్టార్‌ క్రికెటర్‌ దూరం

Published Tue, Apr 4 2023 4:41 PM | Last Updated on Tue, Apr 4 2023 5:14 PM

RCB batter Rajat Patidar ruled out of IPL 2023 - Sakshi

Photo Credit : IPL Website

ఐపీఎల్‌-2023 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రజత్‌ పటిదార్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్‌.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 

"దురదృష్టవశాత్తూ కాలి మడమ గాయం కారణంగా రజత్ పాటిదార్ ఐపీఎల్‌-2023 నుంచి తప్పుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. రజత్‌కు మేము ఎల్లప్పుడూ మద్దతునిస్తూనే ఉంటాము. ఇక పాటిదార్‌ స్థానంలో ఎవరని తీసుకోవాలన్నది కోచ్‌, మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయించలేదు అని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది.

కాగా గతేడాది జరిగిన మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పాటిదార్‌ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. అయితే తనకు వచ్చి అవకాశాన్ని పాటిదార్‌ అందిపుచ్చుకున్నాడు. గతేడాది ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై అద్భుతమైన సెంచరీ బాదాడు. గతేడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్‌.. 333 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీకి ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ దూరం కాగా..  ఇప్పుడు పాటిదార్‌ దూరం కావడం మేనేజ్‌మెంట్‌ను మరింత కలవరపెడుతోంది.
చదవండి: IPL 2023: 'అదే మా కొంపముంచింది.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement