Rahul Chahar Frustrated After Umpire Denies A Wicket Against SA A - Sakshi
Sakshi News home page

IND-A Vs SA- A: టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే..

Published Fri, Nov 26 2021 9:24 AM | Last Updated on Fri, Nov 26 2021 9:58 AM

Rahul Chahar Frustrated After Umpire Denies A Wicket Against SA A - Sakshi

Rahul Chahar throws sunglasses in frustration: బ్లూమ్‌ఫోంటైన్‌ వేదికగా భారత్‌-ఏ జట్టు, దక్షిణాఫ్రికా-ఏ జట్టు మధ్య నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత బౌలర్‌ రాహుల్‌ చహర్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 128వ వేసిన  రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతి.. బ్యాటింగ్‌ చేస్తున్న క్యూషీలే ప్యాడ్‌లను తాకింది. అయితే వెంటనే ఎల్బీకు రాహుల్‌ అప్పీల్ చేయగా.. దానిని అంపైర్ తిరస్కరించాడు. దీంతో వెంటనే కోపంతో ఊగిపోయిన చహర్‌ తన సన్‌ గ్లాస్‌ను నేలకేసి కొట్టాడు.

అంతేకాకుండా అంపైర్‌తో కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఆ తర్వాత కిందపడ్డ కళ్లజోడు పెట్టుకుని ఓవర్ పూర్తి చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏ 509 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే భారత బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్‌లో తిరిగి పోరాడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్‌ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్‌ పాంచల్‌ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

చదవండిIPL 2022 Auction: ఆర్‌సీబీ రిటైన్‌ లిస్ట్‌.. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement