Team India A team
-
దక్షిణాఫ్రికాపై రాణించిన హనుమ విహారి..
Hanuma Vihari shines as India A South Africa A play out another draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య బ్లోమ్‌ఫోంటెన్‌లో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆట చివరిరోజు శుక్రవారం దక్షిణాఫ్రికా నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి (116 బంతుల్లో 72 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! -
డ్రాగా ముగిసిన భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్..
బ్లోమ్‌ఫొంటెయిన్: భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. చివరి రోజు శుక్రవారం ఆట పూర్తిగా వర్షార్పణమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 509/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కాగా దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వెరియంట్ విజృంభిస్తుండడంతో భారత ఆటగాళ్లను స్వదేశానికి రప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: IND Vs NZ: దుమ్ము రేపిన కీవిస్ ఓపెనర్లు.. చేతులేత్తిసిన భారత బౌలర్లు -
టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే..
Rahul Chahar throws sunglasses in frustration: బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా భారత్-ఏ జట్టు, దక్షిణాఫ్రికా-ఏ జట్టు మధ్య నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత బౌలర్ రాహుల్ చహర్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 128వ వేసిన రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతి.. బ్యాటింగ్ చేస్తున్న క్యూషీలే ప్యాడ్లను తాకింది. అయితే వెంటనే ఎల్బీకు రాహుల్ అప్పీల్ చేయగా.. దానిని అంపైర్ తిరస్కరించాడు. దీంతో వెంటనే కోపంతో ఊగిపోయిన చహర్ తన సన్ గ్లాస్‌ను నేలకేసి కొట్టాడు. అంతేకాకుండా అంపైర్‌తో కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఆ తర్వాత కిందపడ్డ కళ్లజోడు పెట్టుకుని ఓవర్ పూర్తి చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏ 509 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే భారత బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్‌లో తిరిగి పోరాడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్ పాంచల్ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనున్న సంగతి తెలిసిందే. Rahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call. A double appeal and throwing his equipment. #SAAvINDA Footage credit - @SuperSportTV pic.twitter.com/TpXFqjB94y — Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021 చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
పాండే సెంచరీ.. కృనాల్ పాంచ్ పటాక
అంటిగ్వా : సారథి మనీశ్ పాండే సెంచరీతో పాటు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్-ఏతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా-ఏ 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 34.2 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఆటగాళ్లలో మనీష్ పాండే(100; 87 బంతుల్లో) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(77), శ్రేయాస్ అయ్యర్(47)లు రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా(5/25) నిప్పులు చెరగడంతో విండీస్ కనీసం 150 పరుగులు కూడా దాటలేకపోయింది. కరేబియన్ ఆటగాళ్లలో క్యాంప్‌బెల్(21), సునీల్ అంబ్రిస్(30) మినహా ఎవరూ రాణించలేకపోయారు. -
ఊరమాస్ పాటకు చిందేసిన క్రికెటర్లు
లండన్: జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన చిత్రం దఢక్. ఇప్పటికే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మూవీలోని జింగాత్ పాట మాస్ పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ పాటకు ఇంగ్లండ్‌లోని టీమిండియా ఆటగాళ్లు చిందేశారు. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి బయలుదేరే ముందు భారత్ ఏ జట్టు ఆటగాళ్లు చివరి రోజు లండన్ వీధుల్లో విహరిస్తూ, ఉల్లాసంగా గడిపారు. ఆటగాళ్లు బస్సులో ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సమయంలో హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్, కే భరత్, అంకిత్ బావ్నే జింగాత్ పాటకు నృత్యం చేశారు. వీరు డ్యాన్స్ చేసిన వీడియోను సిరాజ్‌లో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘లండన్‌లో చివరి రోజు జింగాత్ సాంగ్‌తో సరదాగా గడిచిపోయింది, త్వరలో కలుద్దాం’అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం క్రికెటర్ల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఇంగ్లండ్ లయన్స్, వెస్టిండీస్ జట్లతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ను ‘టీమిండియా ఏ’ గెలుచుకుంది. #having fun on#zingaat song last day in London.see you soon 🇮🇳 #teammatesforlife #indiaA🇮🇳 #bleedblue #bromance❤️ #moretolife #smilandrise @ankeetbawne @konasbharat @indiancricketteam A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) on Jul 20, 2018 at 3:40am PDT -
3 పరుగులు.. 3 వికెట్లు ఢమాల్!
ముంబై: భారత్-ఏ జట్టుతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. రహానే కెప్టెన్సీలో యువ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. టీమ్ స్కోరు 163 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 164 వద్ద ఐదో వికెట్, 165వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన దిండా చివరి బంతికి బెయిర్ స్టో(64: 65 బంతుల్లో 10 ఫోర్లు) కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో బట్లర్ పరుగులేవీ చేయకుండానే రసూల్ బౌలింగ్ లో అతడే క్యాచ్ పట్టడంతో డకౌట్ గా వెనుదిరిగాడు. మరోసారి దిండా మ్యాజిక్ చేశాడు. 29వ ఓవర్ తొలి బంతికి మోయిన్ అలీ(1)ని ఔట్ చేశాడు. ఇక్కడి బ్రాబౌర్న్ స్డేడియంలో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఐదు ఓవర్లలో 42 పరుగుల వద్ద ఓపెనర్ జాసన్ రాయ్ హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. హేల్స్ హాఫ్ సెంచరీ(51: 53 బంతుల్లో 8 ఫోర్లు)తో ఆకట్టుకున్నాడు. అయితే జట్టు స్కోరు 116 వద్ద హెల్స్, ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఔట్ కావడంతో బెయిర్ స్టో, స్టోక్స్ మరో వికెడ్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దిండాను బెయిర్ స్టో ఔట్ చేయగానే మరో రెండు వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. 30 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.