పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక | Team India A Beat West Indies A By 148 Runs | Sakshi
Sakshi News home page

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

Published Wed, Jul 17 2019 8:49 PM | Last Updated on Wed, Jul 17 2019 8:49 PM

Team India A Beat West Indies A By 148 Runs - Sakshi

అంటిగ్వా : సారథి మనీశ్‌ పాండే సెంచరీతో పాటు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్‌-ఏతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా-ఏ 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ 34.2 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. 

టీమిండియా ఆటగాళ్లలో మనీష్‌ పాండే(100; 87 బంతుల్లో) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్‌ గిల్‌(77), శ్రేయాస్‌ అయ్యర్‌(47)లు రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా కృనాల్‌ పాండ్యా(5/25) నిప్పులు చెరగడంతో విండీస్‌ కనీసం 150 పరుగులు కూడా దాటలేకపోయింది. కరేబియన్‌ ఆటగాళ్లలో క్యాంప్‌బెల్‌(21), సునీల్‌ అంబ్రిస్‌(30) మినహా ఎవరూ రాణించలేకపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement