అన్న దావత్‌లో అదరగొట్టిన తమ్ముడు.! | Hardik Pandya Goes Berserk At Brother Krunal's Mehendi Function | Sakshi
Sakshi News home page

అన్న దావత్‌లో అదరగొట్టిన తమ్ముడు.!

Published Wed, Dec 27 2017 2:23 PM | Last Updated on Wed, Dec 27 2017 2:23 PM

 Hardik Pandya Goes Berserk At Brother Krunal's Mehendi Function - Sakshi

‍ముంబై :భారత క్రికెటర్ల పెళ్లీల సీజన్‌ నడుస్తున్న తరుణంలో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా సైతం ఈ రోజే పెళ్లి పీటలెక్కుతున్నాడు. ప్రియురాలు పాంకురి శర్మను ముంబైలో పెళ్లిచేసుకోనున్నాడు.

ఈ మధ్యకాలంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌, మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌లు  పెళ్లి చేసుకోగా తాజాగా కృనాల్‌ పాండ్యా వారి సరసన చేరనున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన మెహందీ ఫంక్షన్‌లో కృనాల్‌ తమ్ముడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. డ్యాన్స్‌తో అదరగొట్టాడు. 

మైదానంలోనే ఆనందం వస్తేనే తట్టుకోలేక చిందులేసే హార్దిక్‌.. అసలే అన్న పెళ్లి ఊరుకుంటాడా.. ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్‌తో ఇరగదీశాడు. అన్న కృనాల్‌తో కలిసి పంజాబ్‌ మ్యూజిక్‌కు చేసిన ఈ డ్యాన్స్‌ వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఇద్దరి అన్నదమ్ములకు యువ క్రికెటర్‌ మనీష్‌ పాండే కూడా తోడయ్యాడు. కృనాల్‌ పాండ్యా ఈ ఏడు ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.

అన్న దావత్‌లో అదరగొట్టిన తమ్ముడు.!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement