మిస్టరీ గర్ల్‌తో హార్దిక్‌ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్‌ | Natasa Drops A Cryptic Post As Hardik Pandya Holds A Mystery Girl Love Everything | Sakshi
Sakshi News home page

మిస్టరీ గర్ల్‌తో హార్దిక్‌ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్‌

Published Fri, Jul 12 2024 10:51 AM | Last Updated on Fri, Jul 12 2024 11:24 AM

Natasa Drops A Cryptic Post As Hardik Pandya Holds A Mystery Girl Love Everything

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ అమ్మాయితో అతడు సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్‌.. ‘‘ప్రతీదీ ప్రేమకు అర్హమైందే.. కానీ.. దేవుడిపై ఎప్పుడూ నమ్మకం మాత్రం వదులుకోకూడదు’’ అంటూ నర్మగర్భపూరిత పోస్ట్‌ చేయడం గమనార్హం.

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యా తీవ్ర విమర్శల పాలయ్యాడు. రోహిత్‌ శర్మ స్థానంలో సారథిగా వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని అవమానకరంగా ట్రోల్‌ చేశారు.

టీ20 ప్రపంచకప్‌-2024 హీరోగా
అందుకు తగ్గట్లే ముంబై ఇండియన్స్‌ పద్నాలుగింట కేవలం నాలుగే గెలవడంతో హార్దిక్‌ కెప్టెన్సీ తీరుపై మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ టీ20 ప్రపంచకప్‌-2024 జట్టుకు అతడు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీసీసీఐ అతడికి అవకాశం ఇవ్వగా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించి విమర్శించిన వారే ప్రశంసించేలా సత్తా చాటాడు.

కెరీర్‌ పరంగా కోలుకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం హార్దిక్‌ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని వార్తలు రాగా.. వీరిద్దరు దూరదూరంగా ఉండటం ఇందుకు బలాన్నిచ్చింది.

అంతేకాదు.. వరల్డ్‌కప్‌ విజయం సెలబ్రేట్‌ చేసుకునే సమయంలో తమ కుమారుడు అగస్త్యను మాత్రమే నటాషా హార్దిక్‌ దగ్గరికి పంపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విడాకులు నిజమేనన్న వార్తలు గుప్పుమన్నాయి.

ఆ మిస్టరీ గర్ల్‌ ఎవరు?
ఇలాంటి తరుణంలో ఓ అమ్మాయి హార్దిక్‌ పాండ్యాతో పాటు అతడి కుటుంబంతో సన్నిహితంగా మెదిలిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ మిస్టరీ గర్ల్‌ ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఆమె మరెవరో కాదు.. డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రాచీ సోలంకి. హార్దిక్‌ పాండ్యా ఇంటికి వచ్చిన ఆమెను బొట్టుపెట్టి ఆహ్వానించారు. ఈ క్రమంలో హార్దిక్‌తో పాటు అతడి అన్న, టీమిండియా క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా- పాంఖురి శర్మ దంపతులతో ప్రాచీ ఫొటోలు దిగింది.

వరల్డ్‌కప్‌ హీరోను కలిసానని.. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఫొటోలు, వీడియోలను ప్రాచీ షేర్‌ చేసింది. దీంతో నటాషా స్థానంలోకి రాబోయే అమ్మాయి.. కాబోయే వదిన అంటూ హార్దిక్‌ అభిమానులు తోచినవిధంగా కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో ఒక్క ఫొటోతో ఆ అమ్మాయిపై లేనిపోని వదంతులు సృష్టించడం సరికాదని హితవు పలుకుతున్నారు. నిజంగానే ప్రాచీ హార్దిక్‌ ఫ్యాన్‌గర్ల్‌ మాత్రమేనా.. లేదంటే అతడి కుటుంబంతో అంతకుమించిన అనుబంధం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ప్రాచీతో హార్దిక్‌ ఫొటోలు వైరల్‌ అయిన తరుణంలో నటాషా పైవిధంగా పోస్ట్‌ పెట్టడం గమనార్హం.

చదవండి: KKR: ద్రవిడ్‌ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్‌?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement